Illu Illalu Pillalu Today Episode October 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. భద్రావతి తన చెల్లెల్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. బతుకమ్మ సంబరాలు మేమిద్దరం కలిసి చేసేవాళ్లం మా ఇంట్లో మా చెల్లెలు లేదు నా మేనకోడలు లేదు.. అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ప్రేమ, వేదవతి ఇద్దరూ కూడా తమ పుట్టింటి గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటారు. నర్మదా ఇద్దరినీ ఓదారుస్తుంది.. అయితే నర్మదా ఎలాగైనా సరే ప్రేమ పుట్టింటి వాళ్ళతో కలపాలని అనుకుంటుంది. ఇక నర్మదకు వేదవతి సపోర్టుగా ఉంటుంది. మా పుట్టింటి వాళ్ళని మేము దూరం చేసుకుని చాలా బాధపడుతున్నాము అని అనగానే నర్మదా రేపు బతుకమ్మ సంబరాలు మీ కుటుంబంతో మిమ్మల్ని కలిపేస్తాను అని మాట ఇస్తుంది.. ఆ మాట వినగానే ప్రేమ సంతోషపడుతుంది. బతుకమ్మ సంబరాలు నర్మదా ప్రేమ కుటుంబంతో ప్రేమను కలపాలని అనుకుంటుంది. అనుకున్నట్లుగానే అందరిని ఒకచోటకి చేరుస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఇంట్లోని వాళ్లందరూ సంతోషంగా ఉండడం చూసిన నర్మదా మురిసిపోతూ ఉంటుంది. అయితే నర్మద దగ్గరకొచ్చిన సాగర్ నువ్వు ఎంత బాధ పడుతున్నావో నాకు అర్థమైంది నీ పుట్టింటి వాళ్ళు గుర్తొచ్చారా అని అడుగుతాడు. ఒకసారి అటు చూడు అని చెప్పగానే నర్మద వాళ్ళ అమ్మ నాన్న ఎదురుగా కనిపిస్తారు వాళ్ళని చూసి సంతోషంగా ఉంటుంది.. మీరేంటమ్మా ఎప్పుడు బతుకమ్మనే పెట్టరు ఇప్పుడేంటి ఇక్కడికి వచ్చారు అని నర్మదా అడుగుతుంది. మేం రాలేదమ్మా సాగర్ మా ఇంటికి వచ్చి మీ అమ్మాయి కోసమైనా మీరు రావాలి అని అడిగారు. అందుకే నీకోసమే బతుకమ్మను తీసుకొని వచ్చాను అని వాళ్ళ అమ్మ చెప్పగానే నర్మదా సంతోషపడుతుంది.
నన్ను అల్లుడిగా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ అమ్మాయిని బాధ పెడుతున్నారు. మీ అమ్మాయి కోసమేనా మీరు రావాలి అని అడిగారు ఇక మీ నాన్న కూడా దానికి కాదనలేకపోయాడు. ఆ మాట వినగానే నర్మదా సంతోషపడుతుంది. ఇక ప్రేమను బతుకమ్మ ఆడుతుండగా మధ్యలో తీసుకొని బయటకు వస్తుంది. ఎందుకు తీసుకొచ్చావు అంటే.. నువ్వు మీ ఆయన ఎదురుచూపులు చూసుకుంటుంటే చూడలేకపోయాను అందుకే తీసుకొచ్చాను. మీదనే ఇప్పుడే కలిపే ప్రయత్నం చేస్తాను అని నర్మదా అంటుంది. నువ్వు వెళ్లి ధీరజ్ తో మాట్లాడు అని ఎంత చెప్పినా సరే నర్మదా ప్రేమ వినకుండా నాకు సిగ్గేస్తుంది భయమేస్తుంది అని అంటుంది.
అయితే ధీరజే నీ దగ్గరకు వచ్చేలా నేను చేస్తాను అని నర్మదా అంటుంది. ఏంటక్కా ఏం చేస్తున్నావు అనంటే నేను చేసి చూపిస్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూడు అని నర్మదా అంటుంది. నర్మదా లవ్ లెటర్ ని ప్రేమ ఇచ్చిన విధంగా ధీరజ్ కి ఇవ్వాలని ఒక అమ్మాయి చేత పంపిస్తుంది. అది చూసిన ధీరజ్ ఆ లెటర్ ను తీసుకొని ఐశ్వర్య దగ్గరకు వెళ్తాడు. ఏంటిది పిచ్చిపిచ్చిగా నాకు లవ్ లెటర్ రాసావ్ ఏంటి అని అడుగుతాడు. ఏ నిజం చెప్పు నీకు నేనంటే ఇష్టం కదా అందుకే నువ్వు రాసావు అని ఐశ్వర్య రివర్స్లో ధీరజ్ ని అడుగుతుంది.
Also Read: పల్లవి పై కమల్ కు అనుమానం.. షాకిచ్చిన శ్రీయా.. అవని ప్లాన్ సక్సెస్ అవుతుందా..?
ఇదంతా చూసిన ప్రేమ మా ఆయనకే లవ్ లెటర్ రాస్తావా నీకు ఎంత ధైర్యం అంటూ కొట్టబోతుంది. నర్మదా అక్కడికి వెళ్లి ఆ లెటర్ రాసింది నువ్వు రాసినట్టుగా నేనే అని అంటుంది.. ఆ మాట వినగానే ప్రేమ షాక్ అవుతుంది. ఐశ్వర్యను ధీరజ్ ని నర్మద పంపిస్తుంది. ఇక తర్వాత రోజు ఉదయం దసరా ఉత్సవాలు బాగా చేయాలి అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రెండు కుటుంబాలు కలిసిపోయినట్లే అనిపిస్తుంది. మీరు దసరా సంబరాలు ని మరింత బాగా చేస్తే బాగుంటుంది. ఇక సేన రావడం చూసి ఊరి పెద్దలు మీరు బావ మరదలు కలిసి దసరా ఉత్సవాలను జరిపించాలని కోరుతారు. ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది.. వేదవతి పై రామరాజు సీరియస్ అవుతాడు. సందు దొరికితే ఏదో ఒకటి అనాలని శ్రీవల్లి ఎదురుచూస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..