Bigg Boss 10: బిగ్ బాస్ 10 .. ఇప్పటికే మూడు వారాలు పూర్తయ్యాయి. ప్రతి వారం ఏదో ఒక ఉత్కంఠ. ఆడియన్స్ లో తరువాతి వారంపై ఆసక్తిని పెంచేస్తోంది. అలా ఎవరి ఊహకందని సరికొత్త ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తూ.. మరింత ఆదరణ సొంతం చేసుకుంది. మొదటివారం చైత్ర రెండవ వారం కృష్ణుడు ఎలిమినేట్ అయ్యారు . మూడవ వారం వంశీ లేదా వర్షిణి ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. ముఖేష్ వీళ్లిద్దరి కోసం తన కెప్టెన్సీ పదవిని కూడా త్యాగం చేసి, మూడవ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించారు.
అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్.. మిథిలేష్ హౌస్ నుండి బయటకు వెళ్లిపోవడం.. బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీజన్ 10 లో తొలిసారి గేమ్ ఆరంభంలోనే సూట్ కేస్ ఆఫర్ తీసుకువచ్చి.. కంటెస్టెంట్స్ కి ఝలక్ ఇచ్చారు బిగ్ బాస్. కానీ బిగ్ బాస్ కే షాక్ ఇస్తూ.. వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన మిథిలేష్ కేవలం 48 గంటల్లోనే ఏకంగా 15 లక్షల బిగ్ బాస్ ఆఫర్ సూట్ కేసును తీసుకొని చక్కగా సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చేశారు.
ఇక నాలుగవ వారం ఎప్పటిలాగే నామినేషన్ ప్రక్రియ చాలా రసవత్తరంగా సాగింది. ఒకరిపై ఒకరు ఫోమ్ వేసుకుంటూ తమ పాయింట్ చెప్పి నామినేషన్స్ వేశారు. ఇకపోతే గత వారం కెప్టెన్సీ పదవిని వదులుకొని ఇద్దరినీ సేవ్ చేసి డైరెక్ట్ గా నామినేషన్ లోకి వచ్చేసారు ముకేష్. ఈయన తో పాటు ఈవారం నామినేషన్ లోకి వచ్చిన వారి జాబితా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి నాలుగవ వారం ఎలిమినేషన్ దిశగా అడుగులు వేస్తోంది ఎవరు? నామినేషన్ లో ఉన్నది ఎవరు? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
ALSO READ:జోరు పెంచిన మమితా బైజు.. సంక్రాంతి టార్గెట్ గా ‘హలో డియర్’!
ఇక ఎప్పటిలానే నామినేషన్ల ప్రక్రియ రచ్చ రచ్చగా సాగింది. ఇంటి సభ్యుల మధ్య వాదోపవాదాలు, ఆరోపణలు, విమర్శలు చాలా స్పష్టంగా కనిపించాయి. ఇలాంటి రచ్చ మధ్య నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ఇక ఈ వారం నామినేషన్ లో భాగంగా ఎక్కువగా మిథిలేష్ ఎలిమినేషన్ కి సహకరించిన అంశంపైనే చర్చ వాగ్వాదం జరిగింది. అంతేకాకుండా ముఖేష్, త్రిగుణ్, సృష్టి లని టార్గెట్గా చేసుకొని చాలామంది నామినేట్ చేశారు. ఈ నామినేషన్ల ప్రక్రియ తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ.. మొత్తం 9 మందిని నేరుగా నామినేట్ చేస్తామని స్పష్టం చేశారు. ఈవారం ఇంటి నుండి బయటకు వెళ్లడానికి అర్హత ఉన్న వారిలో ముఖేష్, త్రిగుణ్, దేబ్ జానీ , రోహిణి షాలిని, అమన్, నరేష్, చరణ్, సృష్టి ఉన్నట్టు ప్రకటించారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్ లో మొత్తం 9 మంది టాప్ కంటెస్టెంట్లు ఉన్నారు. మరి డేంజర్ జోన్ లో ఈ వారం ఎవరు నిలవనున్నారు? ఎవరు ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నారు ?అనే విషయం ఆసక్తికరంగా మారింది. మొత్తానికైతే అటు ఓటింగ్ పోల్ ఓపెన్ అయింది. మరి ఎవరు ఎలిమినేషన్ దిశగా అడుగులు వేయబోతున్నారు అనే విషయం తెలియాల్సి ఉంది.