Hello Dear Movie:మమిత బైజు (Mamitha baiju).. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈమె పేరే వినిపిస్తోంది . కుర్రకారు క్రష్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈమె నటించిన ప్రతి సినిమా ఈ మధ్యకాలంలో వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతోంది. అంతేకాదు ఒకే నెలలో మూడు చిత్రాలతో రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి.. సరికొత్త రికార్డు కూడా క్రియేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ . ప్రస్తుతం ఈమె నటించిన కొన్ని సినిమాలు థియేటర్లలో ప్రదర్శితమవుతుంటే.. మరికొన్ని చిత్రాలు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నాయి. అయితే ఇప్పుడు మరో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
అదే హలో డియర్.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద లక్కీ లేడీగా పేరు దక్కించుకున్న ఈమె.. తన లేటెస్ట్ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది. ఈ చిత్రంలో ఈమె సరసన ‘ప్రేమలు’ ఫేమ్ సంగీత్ ప్రతాప్ హీరోగా నటిస్తున్నారు. ప్రేమలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత మళ్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టు పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఆశిక్ ఉస్మాన్ నిర్మిస్తుండగా.. డినోయ్ పాలోస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపడానికి మేకర్స్ పక్కా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
సంక్రాంతి బరిలో ఇప్పటికే పెద్ద పెద్ద సినిమాలు పోటీగా ఉండగా.. ఇప్పుడు హలో డియర్ కూడా ఆ పెద్ద సినిమాలకు పోటీ ఇస్తుండడంతో అంచనాలు మరింత పెరిగాయి. మరి ఆ పెద్ద సినిమాలకు పోటీగా ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి అని సినీ ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇన్ని రోజులు బాక్సాఫీస్ వద్ద తన కలెక్షన్లతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన ఈమె.. ఈ హలో డియర్ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
also read: ఓటీటీలోకి మమిత బైజు ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
మలయాళ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె తొలిసారి 2017లో సర్వోపరి పాలక్కారన్ అనే చిత్రంలో నటించింది. 2021లో ఆపరేషన్ జావాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఖో ఖో, ప్రణయ విలాసం, సూపర్ శరణ్య వంటి చిత్రాలలో నటించింది. అయితే ఎన్నో మలయాళం సినిమాలలో నటించిన ఈమె ప్రేమలు సినిమాతో 2024 లో ఊహించని విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో కుర్రకారు క్రష్ గా మారిన ఈమె.. డ్యూడ్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్, బెత్లెహెమ్ కుటుంబ యూనిట్, జననాయగన్ వంటి చిత్రాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా వరుస చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న మమిత బైజు ఈ సినిమాలతో మరిన్ని విజయాలను తన ఖాతాలో వేసుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈమె నటిస్తున్న మరో సినిమా ధనుష్ 54వ చిత్రం కరా లో కూడా నటిస్తోంది.