E-Paper
Advertisement

నర్సింగ్ కౌన్సిల్ ఖాతాల్లో కోట్ల రూపాయలు.. మరి ఆ డబ్బంతా ఏమైనట్లు?

నర్సింగ్ కౌన్సిల్ ఖాతాల్లో కోట్ల రూపాయలు.. మరి ఆ డబ్బంతా ఏమైనట్లు?
Advertisement

Nursing Council: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్’ అక్రమాలకు, నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని నర్సింగ్ ఆఫీసర్లు ఫైర్ అవుతున్నారు. వేలాది మంది నర్సుల నుంచి కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న ఈ కౌన్సిల్, కనీస సదుపాయాలు కల్పించడంలో మాత్రం ఘోరంగా విఫలమైందని విమర్శిస్తున్నారు. అసలు కౌన్సిల్‌కు ఒక లెక్కా పత్రం అనేది ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా కొందరి స్వార్థ ప్రయోజనాలకు వేదికగా మారిందని నర్సింగ్ వర్గాలు తీవ్రస్థాయిలో ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నర్సింగ్ పూర్తి చేసిన విద్యార్థుల కొత్త రిజిస్ట్రేషన్లు, విధుల్లో ఉన్న నర్సుల ఐదేళ్ల రెన్యూవల్స్, అదనపు అర్హతల నమోదు, కౌన్సిల్ వెరిఫికేషన్లు.. ఇలా ప్రతి ఒక్క దానికి వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రతి నెలా నర్సింగ్ కౌన్సిల్ ఖాతాల్లోకి కోట్లాది రూపాయలు జమ అవుతున్నాయి. ఇంత భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ, ఆ నిధులన్నీ ఏమైపోతున్నాయనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. నిధుల కేటాయింపులు, వ్యయంపై పారదర్శకత లేకపోవడంపై పలు నర్సింగ్ సంఘాలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ఆడిట్ నిర్వహించి లెక్కలు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ప్రతి ఏడాది అన్యువల్ రిపోర్ట్ విడుదల చేసి, వెబ్ సైట్ లో పబ్లిస్ చేసినా… రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ లో ఎంత డబ్బు వస్తుంది? ఎంత ఖర్చు చేస్తున్నారు? అనే అంశాలేవీ పొందుపరచడం లేదని నర్సింగ్ అసోసియేషన్లు చెప్తున్నారు. ఖర్చులకు ఎలాంటి ఆధారాలుండవని చెబుతున్నారు. తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ లో పారదర్శకత లేనందున కొందరు అధికారులు అందిన కాడికి దోచుకుంటున్నారనే విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి.

మౌలిక వసతులు సున్నా.. కుర్చీలు లేవు.. వాష్ రూమ్స్ లేవు..

Advertisement

కౌన్సిల్ ఆఫీస్‌కు పనుల నిమిత్తం రాష్ట్రం నలుమూలల నుంచి రోజువారీగా వందలాది మంది నర్సులు, విద్యార్థులు వస్తుంటారు. అయితే అక్కడ అడుగుపెడితే నర్సింగ్ ఆఫీసర్లకు నరకం కనిపిస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే నర్సులు, గంటల తరబడి నిలబడలేక నేలపైనే కూర్చోవాల్సిన దుస్థితి నెలకొంది. కనీసం తాగడానికి గుక్కెడు మంచినీళ్లు కూడా అందుబాటులో ఉంచడం లేదు. గతంలోని కౌన్సిల్ కార్యాలయంలో అసలు వాష్​ రూమ్ సౌకర్యమే లేకపోగా, తాజాగా డీఎంఈ బిల్డింగ్ లోకి ఈ ఆఫీస్ ను షిప్ట్ చేసినా…మహిళలు అధికంగా వచ్చే ఈ కార్యాలయంలో కనీసం ఉపయోగించడానికి వీలులేని రీతిలో వాష్‌రూమ్స్ దర్శనమిస్తున్నాయి. కనీస మెయింటెనెన్స్ కూడా చేయలేని దుస్థితిలో కౌన్సిల్ ఉందంటే, ఆయా నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో అర్థం చేసుకోవచ్చని బాధితులు మండిపడుతున్నారు.

గత రిజిస్ట్రార్ నుంచి నేటి ఇన్‌ఛార్జ్ వరకు అదే ధోరణి!

Advertisement

కౌన్సిల్‌లో సీటు మారినా సీన్ మాత్రం మారడం లేదని నర్సింగ్ ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పనిచేసిన రిజిస్ట్రార్ నుంచి ప్రస్తుతం కొనసాగుతున్న ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ వరకు అందరిదీ అదే నిర్లక్ష్య వైఖరి ఉన్నట్లు మండిపడుతున్నారు. నర్సుల సమస్యలను పరిష్కరించడం, కార్యాలయంలో సదుపాయాలు మెరుగుపరచడంపై ఏ ఒక్క అధికారి కూడా దృష్టి సారించడం లేదని సీరియస్ అవుతున్నారు. కేవలం వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ, కౌన్సిల్ నిర్వహణపై లేదని నర్సింగ్ సంఘాలు వివరించాయి. కనీస మెయింటెనెన్స్ లేని కౌన్సిల్ లోని నిధులపై వెంటనే ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫీజుల రూపంలో కోట్ల రూపాయలు వసూలైన సొమ్ము ఎటు మళ్లిందో లెక్క తేల్చాలని కోరుతున్నారు. నర్సింగ్ కౌన్సిల్ వ్యవహారాలపై ప్రభుత్వం తక్షణమే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని నర్సింగ్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కౌన్సిల్‌లో కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు, నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన బాట పడతామని నర్సింగ్ ఆఫీసర్స్ హెచ్చరిస్తున్నారు.

ఎన్ యూ ఐడీ కార్డులకు భారీగా డబ్బులు..

ఇప్పటి వరకు నర్సింగ్ కౌన్సిల్ లో 74,382 మంది నర్సింగ్ ఆఫీసర్లు ఎన్ రోల్ చేసుకోగా, 72,763 మంది దరఖాస్తులు వెరిఫై అయ్యాయి. ఇందులో 64,496 మందికి అప్రూవల్ కాగా, ఇందులో 59,649 మంది కి ఎన్ యూఐడీ కార్డులు మంజూరయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఎన్ యూఐడీ కార్డులు తీసుకున్న వారిలో దాదాపు 20 వేల మంది లేట్ ఫీజులు చెల్లించినట్లు సమాచారం. అంటే ఎన్ యూ ఐడీ కార్డుల కోసం ఒక్కో నర్సింగ్ ఆఫీసర్ కు పదిహేను వందల నుంచి రెండు వేలు ఖర్చు వస్తుండగా, లేట్ రెన్యువల్ కు దాదాపు ఒక్కోక్కరు 5 వేలు అదనంగా చెల్లించాలి. అంటే రెన్యువల్ తో పాటు అదనంగా దాదాపు రూ.10 కోట్లు కౌన్సిల్ అకౌంట్ కు జమ అయ్యాయి. ఇవే కాకుండా బీఎస్సీ నర్సింగ్ కాలేజీలు, జీఎన్ ఎం కాలేజీల రెన్యువల్స్, నర్సింగ్ ఆఫీసర్ల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల రెన్యువల్స్ తదితరవన్నీంటికి కోట్ల రూపాయల్లో కౌన్సిల్ వసూల్ చేస్తుంది. కానీ కౌన్సిల్ లో ఎలాంటి సౌకర్యాలను అందుబాటులో ఉంచకుండా నర్సింగ్ ఆఫీసర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

నర్సింగ్ డబ్బంతా ఏమవుతుంది?

విజ్జులతకు ఏం సంబంధం..? ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినాను తొలగించాలి…ఎస్ కే ప్రసన్న, జనరల్ సెక్రటరీ, ఐఎన్ టీయూసీ ఫెడరేషన్. నర్సింగ్ కౌన్సిల్ కు ఇప్పుడు ఇన్ చార్జ్ గా ఉన్న విజ్జులతకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఫ్యాకల్టీ వైపు ఉన్నారు. కౌన్సిల్ లో రిజిస్టార్ గా అవకాశం ఇవ్వకూడదు. అసలు ఆ పోస్టు నామినేటెడ్ . ప్రభుత్వం నర్సుల నుంచే ఇవ్వాలి. వైద్యారోగ్య శాఖ మంత్రిని కూడా అధికారులు మిస్ గైడ్ చేస్తున్నారు. వైద్యశాఖ డెవలప్ కు సీఎం, మంత్రులు కష్టపడుతున్నా.. అధికారులు వృథా చేస్తున్నారు. నర్సింగ్ కౌన్సిల్ లో గత రిజిస్టార్ అందిన కాడికి దోచుకున్నారు. ఇప్పుడు ఈ ఇన్ చార్జ్ రిజిస్టార్ అదే పనిచేస్తున్నారు. నర్సింగ్ డబ్బంతా ఏమవుతుంది? అనేది అందరికీ తెలియాలి. వెంటనే ప్రభుత్వం ఆడిట్ నిర్వహించాలి. అదే విధంగా మంత్రి పేషీలో నర్సింగ్ వ్యవస్థ నుంచి ఒక అడ్వైజర్ ను పెట్టుకోవాలి. ఏఎన్ ఎంలకు ఎలాంటి ట్రైనింగ్ అవసరం లేదు. వైద్యారోగ్యశాఖ వ్యవస్థ మారాలంటే వెంటనే హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూను మార్చాలి. అప్పుడే పరిస్థితులు మారతాయి. వాళ్లు ఎప్పుడూ ఏసీ రూముల్లో కూర్చొని రివ్యూలు..రిపోర్టులతో చప్పట్లు కొట్టుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఒక్కో అధికారికి మూడు పోస్టుల చొప్పున ఎందుకు? వెంటనే విజ్జులతను మార్చాలి. ఏఎన్ ఎంల వ్యవస్థ లేకుంటే మెడికల్ డిపార్ట్ మెంట్ లేదు. అందుకే పారామెడికల్ డైరెక్టరేట్ కూడా ఇవ్వాలి’ అని ఐఎన్ టీయూసీ జనరల్ సెక్రటరీ ఎస్ కే ప్రసన్న తెలిపారు.

Also Read: మోడీని ఎదుర్కొనే దమ్ములేక ఈసీ, ఈవీఎంలపై నిందలా? కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్!

Tags

Related News

తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు బంపర్ ఆఫర్..11 కేవీ కనెక్షన్లపై సరికొత్త నిబంధనలు!

మోడీని ఎదుర్కొనే దమ్ములేక ఈసీ, ఈవీఎంలపై నిందలా? కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్!

ఎమ్మెల్సీ బరిలో ఆ ఇద్దరు నేతలు.. రేవంత్ రెడ్డి మార్క్ మాస్టర్ ప్లాన్!

రాహుల్ కాదు కదా.. ఆయన జేజమ్మ వచ్చినా మోడీని ఏమీ చేయలేరు: ఈటల రాజేందర్

హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్.. జలమండలి పేరుతో నకిలీ సందేశాలు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని

తెలంగాణలో ఊపందుకున్న ఎన్నికల వేడి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే, పార్టీ హైకమాండ్ ప్రకటన

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీ!

Big Stories

Advertisement
×