E-Paper
Advertisement

బిగ్ బాస్ హౌస్లో స్పెషల్ సర్ప్రైజ్.. సందడి చేసిన ఇమ్మానుయేల్, సంజన!

బిగ్ బాస్ హౌస్లో స్పెషల్ సర్ప్రైజ్.. సందడి చేసిన ఇమ్మానుయేల్, సంజన!
Advertisement

Bigg Boss 10:బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ (Bigg Boss) ఎప్పటికప్పుడు ఆడియన్స్ కు మంచి వినోదాన్ని పంచుతోంది. ప్రతి ఏడాది ఓ కొత్త సీజన్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. వెండితెర సెలబ్రిటీలను మొదలుకొని టీవీ సీరియల్ నటీనటుల వరకు ఎంతోమంది సందడి చేస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో పాటు కామన్ పీపుల్స్ కూడా హౌస్ లోకి వచ్చి మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నారు. అలా ఇప్పటికే తెలుగులో 9 సీజన్లు పూర్తికాగా.. తెలుగులో పదో సీజన్ కూడా చివరి దశకు చేరుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా 12వ వారం 79వ రోజుకు సంబంధించి విడుదల చేసిన మొదటి ప్రోమోలో బిగ్ బాస్ హౌస్ లో మాజీ కంటెస్టెంట్స్ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. మరి లేటెస్ట్ గా విడుదల చేసిన ఆ ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం

కంటెస్టెంట్స్ కి బూస్ట్ ఇచ్చిన ఇమ్మానుయేల్, సంజన..

79వ రోజుకు సంబంధించి విడుదల చేసిన మొదటి ప్రోమోలో ఇంటి సభ్యులందరికీ బడ్డీ అప్ కి స్వాగతం అంటూ తెలిపారు బిగ్ బాస్. దీంతో కంటెస్టెంట్స్ అందరూ అయోమయంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. హౌస్ లోకి ఎవరు రాబోతున్నారు? అనే విధంగా ఎక్స్ప్రెషన్ ఇచ్చుకున్నారు. బిగ్ బాస్ మాట్లాడుతూ..” ఈవారం మీ ప్రయాణంలో మీకు చేయూతనివ్వడానికి…మీలో ఉత్సాహం నింపడానికి బడ్డీస్ సిద్ధంగా ఉన్నారు” అంటూ బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ అయ్యాయి. అందులోనే బిగ్ బాస్ సీజన్ 9లో తల్లీ కొడుకులుగా హౌస్ లో ఆకట్టుకున్న ఇమ్మానుయేల్ (Emmanuel), సంజన (Sanjana) హౌస్ లోకి వచ్చారు. వీరిద్దరిని చూడగానే కంటెస్టెంట్స్ సర్ప్రైజ్ అయిపోయారు.

ముఖేష్ కాళ్లపై పడిపోయిన ఇమ్మానుయేల్..

Advertisement

ఇక వీళ్లిద్దరిని చూడగానే వర్షిణి (Varshini)మాట్లాడుతూ.. ఎందుకు వచ్చారు అని అడగగా ఇమ్మానుయేల్ మాట్లాడుతూ.. “మీ ఇద్దరి గేమ్ చూశాక” అంటూ తన డైలాగ్ తో కంటెస్టెంట్స్ ని నవ్వుల్లో ముంచేశారు. చాలా బాగా ఆడుతున్నారు. మీ అందరికీ హింట్ లు ఇస్తాను అంటూ అప్పుడే కామెడీ చేయడం మొదలుపెట్టాడు ఇమ్మానుయేల్ . దేబ్జానీ మాట్లాడుతూ.. “అటు సైడ్ నుంచి స్టార్ట్ చేస్తారా? ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేస్తారా?” అని అడగగా మధ్యలో నుండి స్టార్ట్ చేస్తాను అంటూ ముఖేష్ దగ్గరకు వెళ్లి మీ బ్లెస్సింగ్స్ కావాలి అంటూ ముఖేష్ కాళ్ల పై పడిపోయాడు ఇమ్మానుయెల్.

also read:శర్వానంద్ భోగి ఫస్ట్ రివ్యూ.. అసలేముంది ఇందులో?

అఖిల్ , చైతూ తర్వాత ఈయనే..

Advertisement

ఆ తర్వాత సుధీర్ ని ఇమిటేట్ చేస్తూ.. త్రిగుణ్ అన్న ధూత ఏదో చేశాడన్న అంటూ సుధీర్ లాగా యాక్ట్ చేసి నవ్వించాడు ఇమ్మానుయేల్. వంశి అన్న మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లుంది. అప్పుడు మా అమ్మ ఏం చేసినా.. నేను సమాధానం చెప్పేవాడిని కానీ ఇప్పుడు త్రిగుణ్ అన్న ఏం చేసినా మీరు సమాధానం చెబుతున్నారు అంటూ నవ్వించాడు. నాకు తెలిసి అఖిల్ , నాగచైతన్య తర్వాత నాగార్జున గారు ఎక్కువగా పొగిడింది నరేష్ ను మాత్రమే అంటూ మరోసారి నవ్వించారు ఇమ్మానుయెల్. రామకృష్ణ హౌస్ లోకి రావాలని ఎంతమంది అయితే కోరుకున్నారో.. వాడు ఏదైనా చేస్తే బాగుండు అని ఎదురుచూసే వాళ్ళు కూడా అంతే ఉన్నారు అంటూ కౌంటర్ ఇచ్చాడు

Related News

లోపల త్రిగుణ్..బయట పీఆర్ టీం.. బిగ్ బాస్ వారి చేతుల్లోనే: నటరాజ్ మాస్టర్

నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న శ్రీవల్లి.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

రౌడీలను హౌస్ లోకి పంపించారు.. బిగ్ బాస్ పై నటరాజ్ మాస్టర్ ఫైర్!

Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై మనోజ్ కు డౌట్.. బాలు ఏడ్పించేసాడు.. పాపం మీనా..

Karthika Deepam 2 Serial Today Episode November 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను ఏం చేశావే అంటూ జ్యోత్స్ను నిలదీసిన మాలిని 

Podarillu Today Episode : విక్కీ పై చక్రీ సీరియస్.. మహాకు టెన్షన్.. చక్రీ కాపాడతాడా..?

Illu Illalu Pillalu Today Episodes: వల్లి ఎంట్రీతో అంతా షాక్.. రామారాజు ఫుల్ హ్యాపీ.. చందు మాటతో మైండ్ బ్లాక్..

Big Stories

Advertisement
×