Muttiah Muralitharan Wife Madhi Malar: తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాప పెళ్లి ఇటీవల జరగగా.. మొన్న నవంబర్ 21వ తేదీన రిసెప్షన్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ రిసెప్షన్ వేడుక చెన్నైలో జరగగా చాలా మంది ప్రముఖులు వచ్చారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పనిచేసిన ముత్తయ్య మురళీధరన్ కుటుంబ సమేతంగా ఈ వేడుకకు హాజరయ్యాడు. దీంతో అతని భార్య ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అచ్చం హీరోయిన్ల ఆమె ఉండడంతో సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్ చేసి క్రికెట్ అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు.
శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ తన భార్య మధిమలర్ రామమూర్తితో కలిసి కావ్య పాప రిసెప్షన్ వేడుకకు హాజరయ్యాడు. ఈ క్రమంలో అతని భార్య మధిమలర్ రామమూర్తి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీంతో ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి అందరూ సెర్చ్ చేస్తున్నారు. మధిమలర్ రామమూర్తి మన భారతీయురాలే. తమిళనాడులోని చెన్నైలోనే మధిమలర్ రామమూర్తి పుట్టి పెరిగింది. ఆమె తండ్రి దివంగత డాక్టర్ ఎస్. రామమూర్తి. అతడు మలార్ ఆస్పత్రి గ్రూపు వ్యవస్థాపకుడు. ఆమె తల్లి నిత్యా రామమూర్తి కూడా వైద్యురాలే.
ఆమె శ్రీలంక మూలాలు కలిగి ఉంది. ఇక మధిమలర్ రామమూర్తి బిజినెస్ మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. కుటుంబ వ్యాపారాలను కూడా ఆమె చూసుకునేది. ఈ క్రమంలో తమిళనాడు వాగాయి చంద్రశేఖర్ ద్వారా ముత్తయ్య మురళీధరన్, మధిమలర్ రామమూర్తి వివాహం జరిగింది. వీళ్ళ వివాహం 2005 చెన్నైలో చాలా గ్రాండ్ గా నిర్వహించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా ఉన్నందున కావ్య పాప వెడ్డింగ్ రిసెప్షన్ కు ముత్తయ్య మురళీధరన్ ఫ్యామిలీ హాజరైంది.
1992 నుంచి 2011 వరకు అంటే 19 సంవత్సరాల పాటు శ్రీలంక జట్టుకు సేవలు ముత్తయ్య మురళీధరన్ అందించాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో 800 వికెట్లు పడగొట్టిన ముత్తయ్య మురళీధరన్ వన్డేల్లో 534 వికెట్లు తీశాడు. టి20 లలో 13 వికెట్లు పడగొట్టాడు. 1996 సంవత్సరంలో శ్రీలంక తొలిసారి వన్డే ప్రపంచ కప్ గెలవడంలో ముత్తయ్య మురళీ ధరన్ కీలక పాత్ర పోషించాడు.