E-Paper
Advertisement

బాడీ పెరిగింది కానీ బుర్రలేదా.. ముఖేష్ షాకింగ్ కామెంట్!

బాడీ పెరిగింది కానీ బుర్రలేదా.. ముఖేష్ షాకింగ్ కామెంట్!
Advertisement

Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 10.. 12 వారంలో భాగంగా.. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ ఇద్దరేసి చొప్పున హౌస్ లోకి అడుగుపెడుతూ సందడి చేస్తున్నారు. అందులో భాగంగానే 79వ రోజుకు సంబంధించి విడుదల చేసిన మొదటి ప్రోమోలో ఇమ్మానుయేల్ , సంజన హౌస్ లోకి వచ్చి సందడి చేశారు. త్రిగుణ్ , రామకృష్ణ మధ్య టాస్క్ నిర్వహించగా.. అందులో రామకృష్ణ టాస్క్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్ గా అవకాశం అందుకున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన మూడవ ప్రోమోలో బిగ్ బాస్ సీజన్ 9 విజేత కళ్యాణ్ పడాల, కామనర్ విభాగంలో వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్ దివ్య నిఖిత హౌస్ లోకి వచ్చి సందడి చేశారు. అక్కడ పెట్టిన టాస్క్ లో భాగంగా ముఖేష్..అమన్ పై చేసిన కామెంట్లు కాస్త వివాదానికి దారితీసాయి. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

హౌస్ లోకి అడుగు పెట్టిన కళ్యాణ్ పడాల, దివ్య..

బిగ్ బాస్ సీజన్ 10.. 12వ వారం 79వ రోజుకు సంబంధించి విడుదల చేసిన 3వ ప్రోమోలో కళ్యాణ్ పడాల, దివ్య హౌస్ లోకి అడుగుపెట్టారు. దివ్య మాట్లాడుతూ.. ఇక్కడ కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి. అందులో ఏ వెజిటబుల్ ఎవరికి సూట్ అవుతుందో చెప్పండి అంటూ దివ్య టాస్క్ వివరించింది. అందులో కాకరకాయ గురించి చెప్పగానే త్రిగుణ్ ఆ కాకరకాయను తీసుకొచ్చి ముఖేష్ మెడలో వేస్తూ.. కాకరకాయ చేదు మనస్తత్వం ఎవరి కంటే.. ఓడిపోయినప్పుడు తీసుకోలేకపోవడం మా ముఖేష్ మనస్తత్వం అంటూ ఆ ట్యాగ్ ముఖేష్ మెడలో వేశారు త్రిగుణ్. టాస్క్ ఓడిపోయాక సరిగ్గా తీసుకోరు అంటే ఏం చేస్తారు అని దివ్య అడగగా.. నాలో నేను బాధపడతాను అని ముఖేష్ చెబుతుండగానే అయ్యబాబోయ్ అంటూ త్రిగుణ్ కౌంటర్ ఇచ్చాడు.

ఒళ్ళు పెరిగింది కానీ బుర్ర లేదా?

Advertisement

ఇక తర్వాత బంగాళదుంప.. బద్ధకం ఎక్కువ.. పని తక్కువ అని దివ్య వివరిస్తుండగానే.. రాంప్రసాద్ ఆ ట్యాగ్ ను తీసుకెళ్లి నరేష్ మెడలో వేశారు. చేసేది చిన్న పని.. కూరగాయలు కట్ చేస్తానని వస్తాడు. ఒక పచ్చిమిర్చి అరగంట తరిగి అబ్బో నేను చాలా పని చేశానని చెబుతాడు అంటూ నరేష్ గురించి చెప్పి నవ్వులు పూయించారు. ఆ తర్వాత కళ్యాణ్ మాట్లాడుతూ..” ఒళ్ళు పెరిగింది కానీ బుర్ర తక్కువ ” అంటూ చెప్పగానే ఆ ట్యాగ్ తీసుకెళ్లి ముకేశ్ అమన్ మెడలో వేశారు. వర్షిని కూడా ముఖేష్ కి వత్తాసు పలికింది. హౌస్మెట్స్ అందరూ కూడా నవ్వుకున్నారు.

also read:ఓటీటీలోకి నయనతార మహాశక్తి.. అక్కడే స్ట్రీమింగ్!

మరీ ఇంత దుర్మార్గుడా?

Advertisement

అమన్ మాట్లాడుతూ.. ఒరేయ్ దుర్మార్గుడా అని అంటుండగానే.. సౌమ్య మాట్లాడుతూ బ్రెయిన్ లేదంటే ఎందులో లేదు అని ప్రశ్నించింది. మిథిలేష్ విషయంలో చూడలేదా?అని చెప్పాడు.. దీనికి దివ్య మాట్లాడుతూ.. అదెప్పుడో క్రీస్తుపూర్వం అని చెప్పింది. అమన్ మాట్లాడుతూ.. నిజం చెప్పనా.. మనోడు ఏదో కప్పు కొట్టేశానని బిల్డప్పు.. కానీ ఏం చేయలేడు.. గోట్ నేనే అయ్యా.. ఫైవ్ స్టార్ నాకే వచ్చింది.. అంటూ అలా ఇద్దరి మధ్య గొడవ గట్టిగానే సాగింది. ఇక చివర్లో శివ, రాంప్రసాద్, ముఖేష్, దేబ్జానీ.. నలుగురిలో కెప్టెన్సీకి చేరువ చేసి ఎవరికి మీ చెయ్యి అందించి.. పెయిర్ గా ఏర్పడాలనుకుంటున్నారు అని అడగగా. నలుగురు కూడా తమ వాదనలను వినిపించారు. మరి ఈ ఇద్దరు ఎవరితో పెయిర్ అవుతారో తెలియాలి అంటే నెక్స్ట్ ప్రోమో చూడాల్సిందే.

Related News

అప్పుడు గాజులు.. ఇప్పుడు గజ్జెలు.. ప్రతిసారీ అదే పాట ఫార్ములానా?

మా బాండింగ్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది.. శాలినితో రిలేషన్ పై రోహిత్ ఓపెన్ కామెంట్స్!

బిగ్ బాస్ 10 లో పొలిటికల్ గేమ్స్.. సీక్రెట్ బయట పెట్టిన శివాజీ!

బిగ్ బాస్ హౌస్లో స్పెషల్ సర్ప్రైజ్.. సందడి చేసిన ఇమ్మానుయేల్, సంజన!

లోపల త్రిగుణ్..బయట పీఆర్ టీం.. బిగ్ బాస్ వారి చేతుల్లోనే: నటరాజ్ మాస్టర్

నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న శ్రీవల్లి.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

రౌడీలను హౌస్ లోకి పంపించారు.. బిగ్ బాస్ పై నటరాజ్ మాస్టర్ ఫైర్!

Big Stories

Advertisement
×