E-Paper
Advertisement

ఆమెపై పగబట్టిన హౌస్ మేట్స్.. ఎలిమినేషన్ తప్పదా?

ఆమెపై పగబట్టిన హౌస్ మేట్స్.. ఎలిమినేషన్ తప్పదా?
Advertisement

Bigg boss 10:వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ (Bigg Boss) తెలుగులో 9 సీజన్లు పూర్తి చేసుకుని, 10వ సీజన్ ఊహించని టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఎవరి ఊహకందని ట్విస్టులు, ఎలిమినేషన్లు, లవ్ ట్రాక్లు అన్నీ షోపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఎప్పుడో బిగ్ బాస్ చివరాఖరిలో జరగాల్సినవన్నీ ప్రారంభంలోనే జరుగుతుండడంతో ఇక బిగ్ బాస్ సీజన్ ఎండింగ్లో ఇంకెన్ని ట్విస్ట్ లు ఉండబోతాయో అనే ఆసక్తి ఆడియన్స్ లో నెలకొంది. ఇకపోతే తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ని నిర్వాహకులు విడుదల చేశారు. అందులో అందరూ కట్టకట్టుకొని అపూర్వను నామినేట్ చేయడం వైరల్ గా మారింది.

బిగ్ బాస్ టాస్క్.. ఆమెను టార్గెట్ చేసిన హౌస్ మేట్స్..

అసలు విషయంలోకి వెళ్తే.. అమన్ , త్రిగుణ్ టాస్కులు ఆడి సేఫ్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం లీడర్ బోర్డులో నరేష్ -రాంప్రసాద్ టీం 220, అపూర్వ- చరణ్ టీం 200, ముఖేష్ -ఝాన్సీ టీం 160, శాలిని – రోహిత్ టీం 140 మార్కులతో కొనసాగుతున్నారు. ” ఫ్లిప్ చెయ్.. ఫేస్ చెయ్” అని టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఫ్లిప్ చేసినప్పుడు అందులో ఏం రాసి ఉంటుందో దానిని చేయాల్సి ఉంటుంది. మొదటగా ముఖేష్ ఫ్లిప్ చేయగా.. ఐదు రకాలుగా వియర్డ్ ఫేసులు పెట్టాలని రాసి ఉంది. ఆ తర్వాత అపూర్వ ఫ్లిప్ చేయగా.. హౌస్ ఓట్స్.. సమ్ వన్ అవుట్ అని రాసి ఉంటుంది. అంటే కంటెస్టెంట్స్ అందరూ కలిసి ఒకరిని బయటకి పంపించాలని వస్తుంది. దీనితో హౌస్ మేట్స్ అంతా డిస్కస్ చేసుకొని అపూర్వకి ఎక్కువ ఓట్లు వేసి ఆమెను బయటకు పంపిస్తారు.

పాపం అపూర్వ..

Advertisement

ఇకపోతే సంచాలక్ గా వ్యవహరించిన దేబ్ జానీ.. అపూర్వ మీరు బయటకు వెళ్లాలి అని చెప్పగానే.. కారణమడుగుతుంది అపూర్వ. దీంతో హౌస్ మేట్స్ అందరు మీకు ఎక్కువ ఓట్లు వేశారు.. అందుకే మీరు వెళ్లిపోవాలి అంటూ చెబుతుంది . అలా ఎక్కువ పాయింట్లు వల్ల .. హౌస్మేట్స్ కారణంగా ఆమె బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. మొత్తానికైతే కంటెస్టెంట్స్ అందరూ కూడా అపూర్వను టార్గెట్ చేస్తూ గేమ్ నుంచి తప్పించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దోమ గెటప్ లో ముఖేష్ కష్టాలు..

ఇక మిగిలిన ప్రోమో విషయానికి వస్తే.. నరేష్ ఫ్లిప్ చేయగా డైస్ రోల్ చేసినప్పుడు హైయెస్ట్ నంబర్ వచ్చిన వాళ్ళను ఎలిమినేట్ చేయాలని వస్తుంది.. దీంతో అందరూ డైస్ రోల్ చేయగా శాలినీకి ఐదు నెంబర్ వచ్చినట్లు చూపించారు. ఆమె గేమ్ నుండి వెళ్లిపోయింది. ఇక తర్వాత ముఖేష్ దోమలా నటించాలని రాగా.. దేబ్ జానీ దగ్గరకు వెళ్లి బ్లడ్ స్మెల్ కంటే బెటర్ స్మెల్ వస్తోంది అంటూ నవ్వించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత శాలిని వద్దకు వెళ్తాడు. ఈ దోమ ఏంటి.. మీద వాలి ఏం చేయడం లేదు షాలిని అనగా.. పక్కనే డేంజర్ ( రోహిత్)ఉందని చెబుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ముఖేష్. ఆ తర్వాత వర్షినితో ఫ్లర్టింగ్ చేస్తాడు.

Advertisement

also read:ఛాలెంజ్ యాక్సెప్టెడ్.. మరో వీడియోతో అదరగొట్టేసిన అనసూయ!

దోమలా మారిన నరేష్..

బిగ్ బాస్ మాట్లాడుతూ నరేష్ మీరే దోమ అయితే ఏం చేస్తారు అని ప్రశ్నించాడు. ఈ క్రమంలోని నరేష్ చేసిన కామెడీ అందరినీ ఆకట్టుకుంది. మొత్తానికైతే లేటెస్ట్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

ఛాలెంజ్ యాక్సెప్టెడ్.. మరో వీడియోతో అదరగొట్టేసిన అనసూయ!

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీస్?

సోషల్ మీడియాలో రెచ్చిపోయిన విష్ణు ప్రియ.. వీడియో వైరల్!

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన బిగ్ బాస్ విన్నర్..!

Telugu Tv Serials : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ రెండు అవుట్..

Gundeninda GudiGantalu Today episode: అయ్యో.. మనోజ్ కు ఏమైంది..రోహిణికి సపోర్ట్ మనోజ్..

Podarillu Today Episode : కన్నా తల్లి వచ్చేసింది.. మాధవ్ ఎమోషనల్.. నారాయణ సీరియస్..

Big Stories

Advertisement
×