E-Paper
Advertisement

డబ్బులు కట్ అయ్యి మనీ పడలేదా?ఈ తప్పులు అస్సలు చేయెద్దు!

డబ్బులు కట్ అయ్యి మనీ పడలేదా?ఈ తప్పులు అస్సలు చేయెద్దు!
Advertisement

UPI payments:  డిజిటల్ ఇండియాలో గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, భీమ్ యూపీఐ వంటి యాప్‌లు మన ఆర్థిక జీవితాన్ని ఎంతగానో ఈజీ చేశాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, క్షణాల్లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం రోజూ జరిగే పనులైపోయాయి. అయితే .. టెక్నాలజీ ఎంత వేగంగా పని చేస్తున్నప్పటికీ, కొన్నిసార్లు నెట్‌వర్క్ సమస్యల వల్ల లేదా సర్వర్ డౌన్ కావడం వల్ల ట్రాన్సాక్షన్స్ లో అప్పుడప్పుడూ ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొన్ని సార్లు ఇతరులకు డబ్బులు పంపినప్పుడు మన అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయినట్టు మెసేజ్ వస్తుంది.. కానీ అవతలి షాప్ యజమానికి లేదా స్నేహితులకు డబ్బులు అందవు. ఆ సమయంలో మనలో చాలా మందికి గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. మరి ఈ సమస్య ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి? ఏ పొరపాట్లు అస్సలు చేయకూడదో ఇక్కడ చూద్దాం.

మొదటగా చేయాల్సిన పనులు :

1.వెయిట్ చేయాలి:

ఎన్‌పీసీఐ నిబంధనల ప్రకారం, చాలా వరకు టెక్నికల్ సమస్యల వల్ల ఆగిపోయిన ట్రాన్సాక్షన్స్ ఆటోమేటిక్‌గా కొన్ని గంటల్లో లేదా గరిష్టంగా 24 నుంచి 48 గంటల్లోగా పరిష్కారమవుతాయి. డబ్బులు రివర్స్ అయ్యి మీ అకౌంట్‌కు వెనక్కి వస్తాయి. కాబట్టి మొదట కాస్త ఓపిక పట్టడం చాలా ముఖ్యం.

2. ఐడీ సేవ్ చేసుకోండి:

Advertisement

మీ యాప్‌లోని హిస్టరీ సెక్షన్‌కి వెళ్లి ఆ ఫెయిల్ అయిన లేదా పెండింగ్‌లో ఉన్న ట్రాన్సాక్షన్ కు సంబంధించిన 12 లేదా అంతకంటే ఎక్కువ అంకెల యూటీఆర్ నంబర్ లేదా ట్రాన్సాక్షన్ ఐడీని స్క్రీన్‌ షాట్ తీసి పెట్టుకోండి. బ్యాంకులను సంప్రదించేటప్పుడు ఇది కచ్చితంగా అవసరం అవుతుంది.

3. బ్యాంక్ లేదా యూపీఐ యాప్‌:

ఒకవేళ 24 గంటలు గడిచినా డబ్బులు వెనక్కి రాకపోతే.. మీరు వాడిన యూపీఐ యాప్ (ఉదాహరణకు ఫోన్‌పే లేదా గూగుల్ పే) లోని ‘हेल्प’ లేదా ‘రైజ్ ఇష్యూ’ఆప్షన్‌ను ఉపయోగించి కంప్లైంట్ చేయొచ్చు. నేరుగా మీ బ్యాంకు కస్టమర్ కేర్‌ను సంప్రదించి వివరాలు చెప్పొచ్చు.

Advertisement

Also Read: బోర్‌ నీళ్లకు ఏ వాటర్ ప్యూరిఫైయర్ బెస్ట్? RO మోడల్స్ ఎందుకు ఎంచుకోవాలి?

అస్సలు చేయకూడని పొరపాట్లు :

వెంటనే అదే వ్యక్తికి డబ్బు పంపొద్దు:
డబ్బులు అందలేదని తెలిసిన వెంటనే కంగారు పడి మీ సొంత పాకెట్ నుంచి లేదా వేరే పద్ధతిలో మళ్లీ అదే మొత్తాన్ని అవతలి వ్యక్తికి పంపకండి. మొదటి ట్రాన్సాక్షన్ కూడా కాసేపట్లో క్లియర్ అయి డబుల్ అమౌంట్ కట్ అయ్యే ప్రమాదం ఉంది.

ఎవరికీ యూపీఐ పిన్ చెప్పొద్దు:
సమస్య పరిష్కారం కోసం సోషల్ మీడియాలో లేదా ఆన్‌లైన్‌లో కనిపించే ఫేక్ కస్టమర్ కేర్ నంబర్లకు ఫోన్ చేసి మీ యూపీఐ పిన్, ఏటీఎం కార్డ్ వివరాలు లేదా ఓటీపీని ఎప్పుడూ చెప్పకండి. సైబర్ నేరగాళ్లు ఇలాంటి సమయాల్లోనే మోసాలకు పాల్పడే అవకాశం ఉంది.

యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు డబ్బులు ఇరుక్కుపోవడం అనేది ప్రస్తుతం సర్వసాధారణమైన సమస్యే. దీనికి ఎవరూ భయ పడాల్సిన అవసరం లేదు. ఎన్‌పీసీఐ , రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం కస్టమర్ల డబ్బుకు పూర్తి సేఫ్టీ ఉంటుంది. ఒకవేళ డబ్బులు రాకపోతే.. 3 నుంచి 5 పనిదినాలలోగా ఆటోమేటిక్‌గా రీఫండ్ వస్తుంది.

Related News

ఫేక్ ఇ-ఇన్‌వాయిస్ మెసేజ్‌లతో మోసపోకండి..అసలు,నకిలీ బిల్లులను ఇలా గుర్తించండి!

సమయాన్ని కొలవడంలో సరికొత్త విప్లవం.. న్యూక్లియర్ క్లాక్ ఎలా పనిచేస్తుందో తెలుసా?

షాపింగ్ ప్రియులకు పండుగ బొనాంజా.. టీవీ నుంచి ల్యాప్‌టాప్ వరకు.. మిస్ చేసుకోలేని డీల్స్!

బోర్‌ నీళ్లకు ఏ వాటర్ ప్యూరిఫైయర్ బెస్ట్? RO మోడల్స్ ఎందుకు ఎంచుకోవాలి?

రూ.16,300 వరకు ఆదా.. అమెజాన్ సేల్‌లో Vivo X300 Ultraపై సెన్సేషనల్ ఆఫర్!

ఐఫోన్ Siriలో ఈ ఒక్క సెట్టింగ్ ఆఫ్ చేయకపోతే.. మీ వ్యక్తిగత డేటా డేంజర్‌లో పడ్డట్టే!

అమెజాన్ సేల్‌లో..టాప్ 5 గేమింగ్ మానిటర్లపై భారీ డిస్కౌంట్లు!

Big Stories

Advertisement
×