E-Paper
Advertisement

సుధీర్ పై సృష్టి ఫైర్.. మరీ అంత ఫ్లర్ట్ చేశాడా?

సుధీర్ పై సృష్టి ఫైర్.. మరీ అంత ఫ్లర్ట్ చేశాడా?
Advertisement

Bigg Boss 10 Srishti: బిగ్ బాస్ సీజన్ 10 సెప్టెంబర్ 6వ తేదీన ఘనంగా ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున ఎప్పటిలాగే ఈ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే మొత్తం 10 మంది సెలబ్రిటీలు , 6 మంది కామనర్స్ తో బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభమైంది. ఇక మొదటి వారంలో భాగంగా చరణ్ , చైత్ర ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. కానీ చరణ్ ను మళ్ళీ హౌస్ లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక రెండవ వారంలో కృష్ణుడు ఎలిమినేట్ అయ్యారు. ఇకపోతే కృష్ణుడు ఎలిమినేట్ అవ్వడంతో అభిమానులు కూడా కాస్త నిరాశ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే . సృష్టి, కృష్ణుడు ఇద్దరు ఎలిమినేషన్ దిశగా అడుగులు వేయగా.. ఎక్కువమంది కృష్ణుడికి ఓటు వేయడంతో ఆయన ఎలిమినేట్ అయ్యారు.

హీటెక్కిన నామినేషన్ ప్రక్రియ..

ఇకపోతే రెండవ వారం అసలు కనిపించలేదు.. ప్రేక్షకుడిలా చూసింది అంటూ సృష్టి పై పెద్ద ఎత్తున వార్తలు రావడమే కాకుండా హోస్ట్ నాగార్జున కూడా సృష్టి పైన మండిపడ్డారు. అయితే ఇప్పుడు మూడవ వారం ఎలిమినేషన్ కి సంబంధించి నామినేషన్ ప్రక్రియ మొదలయ్యింది. చెత్త ఒకరి తలపై ఒకరు వేసుకొని మరి నామినేట్ చేసుకోవడం చూడవచ్చు. ఇకపోతే తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని నిర్వహకులు విడుదల చేయగా.. అందులో సృష్టి సుధీర్ పై మండిపడడం చూస్తుంటే.. నిజంగా కొట్టేస్తుందేమో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సృష్టి బాధ చూస్తుంటే సుదీర్ ఈమెను అంతలా ఫ్లర్ట్ చేశాడా అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నారు.

సుధీర్ సృష్టిని ఫ్లర్ట్ చేస్తున్నాడా..

Advertisement

విషయంలోకి వెళ్తే.. లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. నామినేషన్ ప్రక్రియ మరింత రసవత్తరంగా ఉంటుంది . ముఖ్యంగా మీరు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి తలపై చెత్త వేసి సరైన కారణం చెప్పి నామినేట్ చేయాలి అని బిగ్బాస్ తెలిపారు. రోహిత్ సుధీర్ ను నామినేట్ చేస్తూ తన కారణాలు చెబుతూనే.. సృష్టి అంటే సుధీర్ , సుధీర్ అంటే సృష్టి అని చెప్పారు అని రోహిత్ చెబుతుండగానే.. మధ్యలో సృష్టి కలగజేసుకొని నువ్వు ఒక రెండు మూడు సార్లు అడిగి ఉంటావు.. నేను ఒక 1000 సార్లు అడిగాను. ఎప్పుడు అడిగినా సుధీర్ అంటే సృష్టి, సుధీర్ అంటే సృష్టి అని అంటున్నాడు.. ఏంటిది అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

also read:హైపర్ ఆదిని అంత మాట అనేసిన కామాక్షి భాస్కర్ల!

ఫ్రీడమ్ వచ్చేసింది అంటున్న సుధీర్..

Advertisement

దీనికి సుధీర్ ఇది నా స్ట్రాటజీ అంటూ సుధీర్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. తర్వాత అబద్ధం నీ మొహం లోనే తెలుస్తోంది అంటూ రోహిత్ చెప్పడంతో సుధీర్ మాట్లాడుతూ నేను, సృష్టి ఈ హౌస్ లో స్నేహితులం మాత్రమే అంటూ చెప్పాడు. దానికి సృష్టి అది కూడా కాదు ప్లీజ్ పక్కకెళ్ళిపో అని చెప్పగానే.. సుధీర్ కాస్త ఓవర్ చేసినట్టు అనిపించింది. బిగ్ బాస్ నేను ఇప్పుడు ఫ్రీ బర్డ్ ని, నాకు ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ చెప్పాడు.

సుధీర్ పై సృష్టి ఫైర్..

దీంతో ఫైర్ అయిపోయిన సృష్టి.. నీకు ముందే చెప్పాను నువ్వు నా టైపు కాదు అని.. మళ్లీ మాట్లాడావంటే మూతి మీద కొడతాను. పళ్ళు రాలిపోతాయి. నేను మాట్లాడేటప్పుడు నోరు మూసుకో అంటూ ఒక్కసారిగా సుధీర్ ని కొట్టే ప్రయత్నం చేసింది సృష్టి. వెంటనే మిగతా కంటెస్టెంట్స్ వచ్చి ఆపే ప్రయత్నం చేశారు. ఇక మళ్లీ సుధీర్ మాట్లాడుతూ త్రిగుణ్ మంచి మానుప్లేటర్ అనిపించుకున్నాడు అంటూ కామెంట్ చేశారు. మొత్తానికైతే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో సృష్టి , సుధీర్ మధ్య గొడవ హైలైట్ గా నిలిచింది.

Related News

డైలీ 10 కేజీల స్వీట్స్ తింటాను..నరకం చూసాను.. కన్నీళ్లు పెట్టిస్తున్న కృష్ణుడు మాటలు!

బిగ్ బాస్ నుంచి కృష్ణుడు అవుట్.. రెండు వారాల రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Gundeninda Gudigantalu Manoj : మనోజ్ క్యారక్టర్ అవుట్.. కొత్త యాక్టర్ ఎంట్రీ..

అయ్యో.. వంటలక్కకు ఏమైంది..? ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: ప్రభా దెబ్బకు రోహిణి ఫ్యూజుల్ అవుట్.. మీనా మాటతో షాక్.. అయ్యో పాపం మీనా..

Podarillu Today Episode : చక్రికీ నిజం తెలుస్తుందా..? ఇది కదా హైలెట్.. శైలు కు వార్నింగ్..

Karthika Deepam 2 Serial Today Episode September 21st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంటికి వెళ్లిన కార్తీక్, దీప – నిజం విన్న దక్షిణమూర్తి          

Big Stories

Advertisement
×