Bigg boss 10 : బిగ్ బాస్.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ షో తెలుగులో 9 సీజన్లు పూర్తిచేసుకుని, పదవ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. రేపటితో మూడవ వారం కూడా ముగియబోతోంది. ఇప్పటికే రెండు వారాలకు గానూ మొదటి వారం చైత్ర , రెండవ వారం కృష్ణుడు ఎలిమినేట్ కాగా, మూడవ వారం సృష్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కానీ రేపటి ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే వార్త తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా మరొకవైపు బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా అగ్నిపరీక్ష సీజన్ 2 లో తమ పెర్ఫార్మెన్స్ తో జడ్జెస్ ను మెప్పించిన అపూర్వ , మిథిలేష్ రెడ్డి అడుగు పెట్టారు.
మొదటివారం కెప్టెన్ గా బిగ్ బాస్ సీజన్ 10 లో తొలి కెప్టెన్ గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది ఝాన్సీ. అదే వారం స్టార్ ఆఫ్ ద వీక్ గా ముఖేష్ బాధ్యతలు చేపట్టారు. అయితే నిన్నటి ఎపిసోడ్లో వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన అపూర్వ , మిథిలేష్ రెడ్డి లు కూడా కెప్టెన్సీ కంటెండర్ షిప్ కోసం పోటీపడ్డారు. అయితే బిగ్ బాస్ ఈసారి అనూహ్యంగా జంటలుగా గేమ్ నిర్వహించారు. అందులో అపూర్వ – ముఖేష్ జంటగా పోటీ పడగా, ఝాన్సీ – మిథిలేష్ రెడ్డి జంటగా పోటీపడ్డారు. అయితే చివరి కెప్టెన్సీ కంటెండర్ షిప్ కోసం పోటీ పడగా.. పలు ప్రయత్నాల తర్వాత అపూర్వ – ముఖేష్ పోటీలో గెలిచారు. అలా బిగ్ బాస్ సీజన్ 10 లో రెండవ కెప్టెన్ గా ముఖేష్ బాధ్యతలు చేపట్టారు.
అయితే ఇక్కడ ముఖేష్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టడంతో.. అపూర్వకి కూడా స్పెషల్ బెనిఫిట్స్ లభిస్తాయని చెప్పాడు బిగ్ బాస్. ఎందుకంటే ఆటలో ఇద్దరి ఎఫర్ట్ ఉంది. పైగా ఇద్దరి వల్లే ఆ గేమ్ లో వాళ్లు విజయం సాధించగలిగారు. అందుకే ముఖేష్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినా.. వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన అపూర్వ కూడా ఈక్వల్ బెనిఫిట్స్ పొందుతారని చెప్పడంతో ఆమె సంతోషంతో ఉప్పొంగిపోయారు. అలా మొత్తానికైతే ఈసారి ఏకంగా కెప్టెన్గా బాధ్యతలు ముఖేష్ చేపట్టినా.. సమాన బాధ్యతలను అపూర్వ సొంతం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది.
also read: రేబీస్‌తో బాలుడు మృతి.. అధికార వర్గాలను ప్రశ్నించిన యాంకర్ రష్మి గౌతమ్!
బిగ్ బాస్ సీజన్ 10 విషయానికి వస్తే మొత్తం పదిమంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. అందులో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. 14 మంది హౌస్ లో ఉండగా మరో ఇద్దరు వచ్చి చేరారు . ఇప్పుడు మళ్లీ 16 మందితో హౌస్ కళకళలాడుతోంది . కానీ ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అని ఉత్కంఠ అందరిలో నెలకొంది అని చెప్పాలి. మరి బిగ్ బాస్ సీజన్ 10 మూడవ వారం ఎలిమినేట్ అయ్యే ఆ కంటెస్టెంట్ ఎవరో తెలియాల్సి ఉంది.