E-Paper
Advertisement

జూహీ చావ్లా ఆస్తులు డబుల్.. ఒక్క ఏడాదికి అన్ని కోట్లా..?

జూహీ చావ్లా ఆస్తులు డబుల్.. ఒక్క ఏడాదికి అన్ని కోట్లా..?
Advertisement

Juhi Chawla : బాలీవుడ్ నటి జూహీ చావ్లా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు కుర్కురే పేరు వినగానే టక్కును గుర్తుకు వచ్చే పేరు ఈమెనే. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య సినిమాలలో పెద్దగా కనిపించలేదు కానీ.. ఆస్తులు మాత్రం ప్రతి ఏడాదికి అంతకు అంత పెంచుకుంటూ పోతుంది. అత్యంత రిచెస్ట్ హీరోయిన్లలో ఎక్కువగా వినిపించే పేరు ఈమెదే. చేతిలో సినిమాలు సీరియల్స్ లేకపోయినా 7 వేల కోట్లకు పైగా సంపాదించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈమె ఆస్తులు డబల్ అవడం ఒకింత షాక్ కు గురించేస్తుంది. మరి ఆలస్యం ఎందుకు ఈమె ఆస్తుల గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఒక్కఏడాదికి అన్ని వేల కోట్లా..?

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను తన నటనతో మెప్పించిన జుహీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సినిమాలు కన్నా ఎక్కువగా స్నాక్స్ కి సంబంధించిన యాడ్లతో ప్రేక్షకులను మెప్పించింది.. ఇటీవల కాలంలో ఈమె పెద్దగా యాడ్లలో కూడా కనిపించలేదు. మొదటి నుంచి పలు వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆస్తులను పెంచుకునే పనిలోని ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. భారతదేశంలో కల్లా అత్యంత రిచెస్ట్ హీరోయిన్ అంటే ఈమె అని ఇటీవల సర్వేలు కూడా కన్ఫార్మ్ చేశాయి. ఒక్క ఏడాదిలోని 4వేల కోట్ల నుంచి ఎనిమిది వేల కోట్లకు ఆస్తులను కూడబెట్టింది అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఈమె ఆస్తుల విలువ చూస్తే .. ఒక్క ఏడాదిలోనే రెట్టింపు సంపాదించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే ప్రస్తుతం డబ్బున్న హీరోయిన్ల పేర్ల లిస్టులో ఈమె పేరే మొదటగా వినిపిస్తుంది. వ్యాపారాలు చేయడం మాత్రమే కాదు ఎలాంటి వ్యాపారాలు చేస్తే డబ్బులు రెట్టింపు అవుతాయి అన్నది తెలుసుకుంటే మాత్రం ఎవరైనా సక్సెస్ అవుతారని ఈమె పలు సందర్భాలలో చెప్పిన విషయం తెలిసిందే.

ఆస్తులు & వ్యాపారాలు..

Advertisement

బాలీవుడ్ నటి జూహీ చావ్లా తన వ్యాపార సామ్రాజ్యాన్ని గణనీయంగా పెంచుకుంటూ వస్తున్నారు. ప్రతి ఏడాది ఆమె ఆస్తులు కూడా అంతకుమించి పెరుగుతున్నాయి. గత కొన్నిరోజులు ఆమె పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ కోట్లకు కోట్లు సంపాదిస్తుంది. గత ఏడాది కాలంలో ఆమె మొత్తం నికర ఆస్తి విలువ రూ. 4,600 కోట్ల నుండి రూ. 7,790 కోట్లకు పెరిగింది. అంటే సుమారు 880 మిలియన్ డార్లకు సమానం. ‘హురున్ ఇండియా రిచ్ లిస్ట్’ తాజా గణాంకాల ప్రకారం.. ఈ వృద్ధి ఆమెను ఇండియాలోనే అత్యంత సంపన్న నటిగా కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత సంపన్న నటీనటుల జాబితాలోనూ చేర్చింది.. ఈమె సంపదలు ఇంతగా పెరగడానికి కారణం ఆమెకు సినిమా రంగంలో కాకుండా బయట ఉన్న వ్యాపారాలు. అలాగే పెట్టుబడులే.. తన భర్త జై మెహతాతో కలిసి, ఆమె తన వ్యాపార కార్యకలాపాలను పెంచుకుంటూ పోతుంది. షారుఖ్ ఖాన్‌తో కలిసి స్థాపించిన ‘రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్’ సంస్థకు ఆమె సహ-వ్యవస్థాపకురాలిగా ఉన్నారు.. అలాగే ‘నైట్ రైడర్స్’ క్రీడా వ్యాపారంలోనూ ఆమె చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 2022 నాటికి ‘కోల్‌కతా నైట్ రైడర్స్’ విలువ దాదాపు 1.1 బిలియన్ డార్లకు చేరుకోవడం, క్రీడా వ్యాపారంలో ఆమెకున్న బలమైన భాగస్వామ్యాన్ని తెలియజేస్తుంది. వీటితో పాటుగా ఇటీవలి కాలంలో చావ్లా ‘గులాబ్ గ్యాంగ్’, ‘చాక్ ఎన్ డస్టర్’, ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’, ‘శర్మజీ నమ్‌కీన్’, ‘ఫ్రైడే నైట్ ప్లాన్’ వంటి చిత్రాలలో కనిపించారు. వెండితెర పై లేదా బుల్లితెరా పై వచ్చే ఆదాయం కన్నా వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువే.. వచ్చే ఏడాది ఆమె ఆస్తులు ఎన్ని కోట్లు ఉంటాయో చూడాలి..

Also Read : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. రామరాజు గుడ్ బై..

Related News

మరో వివాదంలో ది ప్యారడైజ్..సమ్మక్క పాత్రను అవమానించారంటూ?

ఈ సంక్రాంతి మనదే.. కాకా పై చిరు అప్డేట్!

నాని పై ఇండస్ట్రీలో కుట్ర జరుగుతుందా? సక్సెస్ ను జీర్ణించుకోలేకపోతున్నారా?

నన్ను తొక్కేయాలని చూస్తున్నావా? ఫరియా పై చిరు కామెంట్స్ వైరల్!

సినిమా చేయాలంటే హీరోల భార్యలకు నచ్చాలి.. తాప్సీ సెన్సేషనల్ కామెంట్స్!

‘ది ప్యారడైజ్’ సినిమా పై వేణు స్వామి రివ్యూ .. సమస్యలు తెచ్చుకోవద్దంటూ!

నైజాంలో నాని మేనియా..రెండు రోజులకే బ్రేక్ ఈవెన్?

Big Stories

Advertisement
×