E-Paper
Advertisement

ట్రోల్ చేయడం కోసం నెలకు రూ. 30 వేలు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన కృష్ణుడు!

ట్రోల్ చేయడం కోసం నెలకు రూ. 30 వేలు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన కృష్ణుడు!
Advertisement

Bigg Boss 10 Krishnudu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కార్యక్రమం ప్రారంభమై అప్పుడే నెల రోజులు పూర్తి అయింది. ఇలా నాలుగు వారాలను ఎంతో విజయవంతంగా ఈ కార్యక్రమం పూర్తి చేసుకుంది. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా రెండవ వారం హౌస్ నుంచి సినీ నటుడు కృష్ణుడు (Krishnudu)ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈయన హౌస్ నుంచి ఎనిమినేట్ అయినప్పటి నుంచి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెడుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణుడు తనపై వచ్చిన ట్రోల్స్ గురించి స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తిండి కోసమే నేను బిగ్ బాస్ వెళ్లలేదు..

తాను హౌస్ లో ఉన్నప్పుడు తినడానికే హౌస్ లోకి వెళ్ళానని, నిద్రపోతున్నానని కూడా చాలామంది కామెంట్లు చేసినట్లు గుర్తు చేసుకున్నారు అయితే తాను హౌస్ లో ఉన్నప్పుడు నిద్రపోయింది కేవలం ఒక్కసారి మాత్రమేనని తెలిపారు. అదేవిధంగా తిండికోసమే తాను బిగ్ బాస్ హౌస్ కి వెళ్లలేదంటూ కూడా తనపై వచ్చిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఇక బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్ రోహిత్ (Rohit)గురించి కూడా కృష్ణుడు షాకింగ్ విషయాలను బయటపెట్టారు.

ట్రోల్ చేయటం కోసం నెలకు 30వేలు..

Advertisement

ఒకసారి తన భార్య హౌస్ లో ఉన్న తనకోసం బట్టలు పంపించడం కోసం అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చిన సమయంలో రోహిత్ కోసం కూడా ఒక వ్యక్తి వచ్చారని అయితే అక్కడ జరిగిన సంభాషణ గురించి తన భార్య తనకు కొన్ని విషయాలు చెప్పిందని తెలిపారు. బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న రోహిత్ గురించి కంటెస్టెంట్లు ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడితే ఆ నెగిటివ్ గా మాట్లాడిన వారిని ట్రోల్ చేయడం కోసం బయట ఒక్కో మనిషికి నెలకు 30000 రూపాయలు చొప్పున డబ్బులు ఇస్తున్నారనే విషయాన్ని కృష్ణుడు ఈ సందర్భంగా బయటపెట్టారు.

పీఅర్ టీమ్ ఉంటుందని నాకు తెలియదు..

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లకు పీఅర్ టీమ్ ఉంటుందని నాకు తెలియదు. తాను ఏ విధమైనటువంటి ప్రణాళికలు లేకుండా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళానని ఈ సందర్భంగా కృష్ణుడు తెలియజేశారు. తాజాగా ఈయన రోహిత్ కోసం నెలకు 30000 రూపాయలు తీసుకుంటూ ట్రోల్ చేస్తున్నారనే విషయాన్ని బయట పెట్టడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక మనిషిని ట్రోల్ చేయడం కోసం నెలకు 30 వేలా ? ఇలా కూడా చేస్తారా? అంటూ కృష్ణుడి వ్యాఖ్యలపై నేటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమం విజయవంతంగా నాలుగు వారాలను పూర్తి చేసుకోబోతుంది. మరి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తోంది. మరి హౌస్ నుంచి బయటకు వచ్చే ఆ ఇద్దరు కంటెస్టెంట్లు ఎవరా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: మిథిలేష్ 15 లక్షలు తీసుకోవడం ఆ మాజీ కంటెస్టెంట్ ప్లానేనా? మిథిలేష్ కు మిగిలేది ఎంతంటే?

Related News

మిథిలేష్ 15 లక్షలు తీసుకోవడం ఆ మాజీ కంటెస్టెంట్ ప్లానేనా? మిథిలేష్ కు మిగిలేది ఎంతంటే?

బిగ్ బాస్ బూతు షో కాదా? మిథిలేష్ రియాక్షన్?

ముఖేష్ కాళ్లు మొక్కిన వర్షిణి.. వీడియో వైరల్!

ఒక్కపాటతో గూస్ బంప్స్ తెప్పించేసిన తెలుగు హీరోయిన్..ఏం టాలెంట్ భయ్యా!

అమన్ కెప్టెన్సీని లాగేసుకున్న వర్షిణి?

Nindu Noorella Saavasam Serial Today Episode October 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును మనోహరి చంపేస్తుందా..?   

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో రికార్డ్.. మీనాకు రింగ్ గిఫ్ట్.. రోహిణికి షాక్…

Big Stories

Advertisement
×