E-Paper
Advertisement

మిథిలేష్ 15 లక్షలు తీసుకోవడం ఆ మాజీ కంటెస్టెంట్ ప్లానేనా? మిథిలేష్ కు మిగిలేది ఎంతంటే?

మిథిలేష్ 15 లక్షలు తీసుకోవడం ఆ మాజీ కంటెస్టెంట్ ప్లానేనా? మిథిలేష్ కు మిగిలేది ఎంతంటే?
Advertisement

Bigg Boss 10 Mithilesh: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కార్యక్రమం నాలుగవ వారం పూర్తి కాబోతోంది. ఇప్పటికే హౌస్ నుంచి ముగ్గురు కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గతవారం వైల్డ్ కార్డు ఎంట్రీ వెళ్ళిన సంగతి తెలిసిందే. వైల్డ్ కార్డు ద్వారా ముగ్గురు కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇందులో భల్లాలదేవగా గుర్తింపు పొందిన మిథిలేష్ రెడ్డి (Mithilesh Reddy) హౌస్ లోకి వెళ్లిన రెండు రోజులకే హౌస్ నుంచి 15 లక్షల రూపాయలతో బయటకు వచ్చారు.

మిథిలేష్ రూ.15 లక్షల వెనుక డెమోన్ పవన్..

ఈ విధంగా మిథిలేష్ 15 లక్షలు తీసుకొని బయటకు రావడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. 100 రోజులపాటు హౌస్ లో ఉన్నప్పటికీ వచ్చే ప్రైజ్ మనీ కంటే కూడా రెండు రోజులకి ఈ 15 లక్షల రూపాయలే ఎక్కువ అంటూ చాలామంది మిథిలేష్ నిర్ణయం పై చర్చలు జరుపుతున్నారు. అయితే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మిథిలేష్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తనకు ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన రెండు రోజులకే 15 లక్షలతో బయటకు వచ్చావు అచ్చం డెమోన్ పవన్(Demon Pawan) స్ట్రాటజీ ఫాలో అయ్యావు తనే ఈ సలహా ఇచ్చారా అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి.

మిగిలేది రూ.10 లక్షలు మాత్రమే…

Advertisement

ఈ ప్రశ్నకు మిథిలేష్ సమాధానం చెబుతూ.. తాను హౌస్ లోకి వెళ్లడానికి ముందుగా పవన్ అన్నను కలిసిన మాట నిజమే కానీ ఆయన మాత్రం హౌస్ లో చివరి వరకు ఉండేలాగే ట్రై చేయి అద్భుతంగా ఆడు అంటూ సలహా ఇచ్చారు కానీ ఇలా డబ్బులు తీసుకుని బయటికిరా అని మాత్రం చెప్పలేదని, అది పూర్తిగా నా నిర్ణయమే అంటూ మిథిలేష్ తెలిపారు. ఇలా తనకు 15 లక్షల రూపాయలు వచ్చినప్పటికీ కటింగ్స్, ట్యాక్స్ లు పోను మిగిలేది 10 లక్షలు మాత్రమే అంటూ మిథిలేష్ తెలిపారు.

రెండు రోజులకే కావలసినంత పబ్లిసిటీ..

ఇక ఈయన బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది కేవలం రెండు రోజులు అయినప్పటికీ భారీ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతూ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ కూడా మిథిలేష్ అని చెప్పాలి. రెండు రోజులకు 15 లక్షలు అంటే రోజుకు 7.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారని చెప్పాలి. తాను బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిందే గుర్తింపు కోసమని అయితే రెండు రోజులకే తనకు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసిందని ఈ సందర్భంగా మిథిలేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మిథిలేష్ గత శనివారం డబ్బులతో బయటకు రావడంతో ఆదివారం నామినేషన్ లో ఉన్నటువంటి వారు ఎవరు కూడా హౌస్ నుంచి బయటకు రాలేదు కానీ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తోంది. అదేవిధంగా నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డు ద్వారా మరి కొంతమంది హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Also Read: రష్మిక పిలిచినప్పుడు పలకకపోతే అలా అంటుందా? మొత్తం బయటపెట్టిన విజయ్!

Related News

ట్రోల్ చేయడం కోసం నెలకు రూ. 30 వేలు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన కృష్ణుడు!

బిగ్ బాస్ బూతు షో కాదా? మిథిలేష్ రియాక్షన్?

ముఖేష్ కాళ్లు మొక్కిన వర్షిణి.. వీడియో వైరల్!

ఒక్కపాటతో గూస్ బంప్స్ తెప్పించేసిన తెలుగు హీరోయిన్..ఏం టాలెంట్ భయ్యా!

అమన్ కెప్టెన్సీని లాగేసుకున్న వర్షిణి?

Nindu Noorella Saavasam Serial Today Episode October 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును మనోహరి చంపేస్తుందా..?   

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో రికార్డ్.. మీనాకు రింగ్ గిఫ్ట్.. రోహిణికి షాక్…

Big Stories

Advertisement
×