Gundeninda GudiGantalu Today episode November 11th: మనోజ్ షాప్ లో అన్ని చూసుకుంటూ ఉండగా మణికంఠ అక్కడికి వస్తాడు. ఏంటి బ్రో నువ్వు ఒక్కడివే ఉన్నావు మా సిస్టర్ రాలేదా అని అడుగుతాడు. రోహిణి పంపించడానికి అమ్మ ఒప్పుకోలేదు అని మణికంఠతో మనోజ్ చెప్పగానే నీ భార్యని నువ్వు తెచ్చుకోవడానికి మీ అమ్మ పర్మిషన్ ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ బ్రో ఈ రోజుల్లో ఆడవాళ్లు ఎలా ఉన్నారో తెలుసా అని మణికంఠ క్లాస్ పీకుతాడు.. అయితే ఎందుకు మీ ఆవిడ కోసం మీ అమ్మ పర్మిషన్ తీసుకోవాలి అని మణికంఠ చెప్పగానే మనోజ్ మా అమ్మ ఇష్టమైతేనే ఏదైనా చేస్తాను అని అంటాడు. ఇక మొత్తానికి తన ఫ్రెండ్ స్టోరీని చెప్తాడు మనికంట. ఈరోజుల్లో భార్యలను పట్టించుకోకుండా ఉంటే ఆ భార్యలు వేరే వాళ్ళని చూసుకుంటున్నారు లేదంటే భర్తలని చంపేస్తున్నారు అది గుర్తుపెట్టుకుంటే మంచిది అని చెప్పగానే మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఆ పిచ్చోడు ఎవరో కాదు నా ఫ్రెండు వాడి భార్యను మొదట్లో పట్టించుకోవడం మానేశాడు ఆ తర్వాత ఆవిడ వాడిని పట్టించుకోవడం మానేసి వేరే వాడితో వెళ్లిపోయింది అప్పటి నుంచి అలా పిచ్చోడిలాగా తిరుగుతున్నాడు అని చెప్పగానే మనోజ్ భయపడిపోతాడు. అంతేకాదు మనోజ్ పిచ్చోడి లాగా మారిపోయినట్లు ఊహించుకొని ఒక్కసారిగా షాక్ అవుతాడు
అయితే మనోజ్ రోహిణి వదిలేస్తుందా లేదా అన్నది మాత్రం ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇక రాత్రి రవి శృతి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ శృతి అప్పుడే ఇంట్లోకి వస్తూనే చాలా కోపంగా రావడంతో ఏంటి నీ ఆవేశం ఏంటి అసలు అని రవి అంటాడు. నీకు విలువ లేని చోట నువ్వు పని చేస్తానని అన్నా కూడా నా భర్తకు విలువలేదు అని నేను చాలా ఫీల్ అయిపోయాను. నీకు ఆ మాత్రం కూడా లేదు అని శృతి రవి ఇద్దరు కాసేపు గొడవపడతారు. అయితే మధ్యలో వచ్చిన ప్రభావతికి రోహిణి మాటలు కోపాన్ని తెప్పిస్తాయి.
రాత్రి బాలు రాగానే మేన ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఏంటి దేని గురించి ఆలోచిస్తున్నావు అని బాలు అడుగుతాడు.. అయితే నేను మీతో మాట్లాడాలి అని అనగానే బాలు ఏంటి ఇప్పుడు ఇక్కడే మాట్లాడాలా సరే ఏంటి చెప్పు అని అడుగుతాడు. సుమతి చాలా బాధపడుతుందండి మీరు ఇంటికి వెళ్లి ఇలా మా అమ్మకు చెప్పగానే మా అమ్మ కూడా చాలా బాధపడిపోతుంది అని మీనా అనగానే బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు. నేను వాళ్ళింటికి పెద్దది కన్నారు కదా ఖచ్చితంగా నేను ఆ బాధ్యతను తీసుకోవాలి కదా అని అన్నారు కదా ఆ దాని ప్రకారం నేను ఇలా చేస్తున్నాను అని బాలు అంటాడు. సుమతికి పెళ్లి సంబంధాలు కూడా చూశాను అని చెప్పగానే మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది..
అరుణ్ గాన్ని సుమతి చేసుకుంటే ఖచ్చితంగా చలాన్లు పట్టుకుంటూ వాడు ఎక్కడకి చోట దొరికిపోతూ ఉంటాడు మల్ల తర్వాత సుమతిని బాధ పడిపోతూ ఉంటుంది. అందుకే నేను సుమతి కోసమని బ్రోకర్ని కలిసి మంచి సంబంధాన్ని తీసుకొని వచ్చాను వీటి గురించి నువ్వు సుమతి కూడా చెప్పు అని వాళ్ళు చెప్పగానే సుమతి మనసేంటో అర్థం చేసుకోరా మీరు అని మీ నాన్నగానే నా మాట కాదని మీరు సుమతినిచ్చి వాడికి పెళ్లి చేస్తే ఖచ్చితంగా అల్లుడ్ని మర్చిపోవాలి అలాగే నువ్వు కూడా మీ పుట్టింటిని మర్చిపోవాలి అని అనగానే.. మీనా చాలా బాధపడిపోతుంది ఆ మాటని ప్రభావతి వింటుంది. మీనా వచ్చి ప్రభావతిని అడగగానే ప్రభావతి మాత్రం ఏమైంది అని టెన్షన్ పడుతుంది కానీ మీనా ఏమి చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతుంది..
మనోజ్ ఉదయం లేవగానే.. భయంకరమైన పేరు కల వస్తుంది రోహిణి మనోజ్ ని వదిలేసి పోయింది అని ఒక్కసారిగా షాక్ అయ్యే లేస్తాడు రోహిణి కోసం వెతుకుతూ ఊరంతా పిచ్చోడిలాగా తిరుగుతున్నట్లు ఊహించుకుంటాడు అయితే ఇక పక్కనే లెటర్ కనిపించడంతో రోహిణి రాశి వెళ్లిపోయిందని కంగారు పడిపోతూ ఆ లెటర్ ని చదువుతాడు అయితే మనోజ్ కంగారు పడినట్టుగానే అందులో నేను రావడం లేట్ అవుతుంది నేను వెళ్ళిపోతున్నాను అని రాసి ఉంటుంది అది చూసి ఏడుస్తూ ప్రభావతి దగ్గరికి వెళ్తాడు ఆ మాట చెప్పగానే ప్రభావతి మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఏంటి రోహిణి వెళ్ళిపోయిందా ఈ ఇంటికి పట్టిన దరిద్రం కూడా పోయింది అని అంటుంది కానీ మనోజ్ మాత్రం నా భార్య వెళ్ళిపోయింది అంటే నీకు ఎందుకు అంత సంతోషం అని అంటాడు. ఎక్కడికి పోతుంది లేరా ఆ గోడకు రంగులేసుకునే దానికి వెళ్ళిందేమోలే ఎక్కడో ఒక చోట ఉంటుందిలే అని ప్రభావతి చెప్తుంది కానీ మనోజ్ మాత్రం రూమ్ లోకి వెళ్లి తన భార్య తనని వదిలేసి వేరే వాడితో వెళ్లిపోయింది అని చాలా బాధపడిపోతూ ఉంటాడు పక్క నుంచి రోహిణి రావడంతో నువ్వు వెళ్ళిపోలేదా ఎవరితోనూ వెళ్ళిపోలేదా అని అడుగుతాడు.. మొత్తానికి మనోజ్ అయితే కాస్త హ్యాపీగా ఫీల్ అవుతాడు.
రవి తో ఎలాగైనా సరే రెస్టారెంట్ ని పెట్టాలి అని శృతి గట్టిగా నిర్ణయించుకుంటుంది. ఇక శృతి రవిని ఆ రెస్టారెంట్ నుంచి బయటకు తీసుకునే వచ్చేంతవరకు నేను నిద్రపోను అని అనుకుంటుంది. రవికి ఫోన్ చేసి బయటికి రమ్మని చెప్తుంది. కానీ రవి మాత్రం నేను ఈ రెస్టారెంట్లో చాలా పని ఉంది.కాబట్టి నేను ఇప్పుడు బయటకు రాలేను అని అంటాడు. ఆ మాటతో స్తుతి చాలా సీరియస్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడే నీతూ వచ్చి శృతి తో మాట్లాడుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది సస్పెన్స్ గా మారింది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Podarillu Today Episode : కన్నా పై మహా సీరియస్.. ఇది కదా పండగ.. చక్రీ మాస్టర్ ప్లాన్..