Better Sleep Tips: రోజంతా పనులతో అలసిపోయిన శరీరానికి రాత్రిపూట మంచి నిద్ర చాలా అవసరం. కానీ చాలామందికి పడుకునే ముందు ఫోన్ వాడటం ఒక అలవాటుగా మారిపోయింది. సోషల్ మీడియా చూడటం, నోటిఫికేషన్లు చెక్ చేయడంతో నిద్ర సమయం తగ్గిపోతుంది. దీనివల్ల పొద్దున్నే లేచేసరికి నీరసంగా అనిపిస్తుంది. సాధారణంగా సైలెంట్‌గా ఉండటానికి లేదా డిస్టర్బెన్స్ లేకుండా ఉండటానికి చాలామంది Do Not Disturb మోడ్ వాడుతుంటారు. అయితే దీనికంటే అద్భుతమైన మార్గం మరొకటి ఉంది.
డూ నాట్ డిస్టర్బ్ మోడ్ నోటిఫికేషన్లను ఆపుతుంది కానీ పూర్తిగా నెట్‌వర్క్‌ను బంద్ చేయదు. ఎవరైనా వరుసగా కాల్స్ చేసినా లేదా అత్యవసరం అని మెసేజ్ పంపినా మీకు సౌండ్ వస్తుంది. దీనివల్ల మధ్యలో నిద్ర పాడయ్యే అవకాశం ఉంది. కానీ ఏరోప్లేన్ మోడ్ వేస్తే ఫోన్ నెట్‌వర్క్ పూర్తిగా ఆగిపోతుంది. వైఫై, బ్లూటూత్ కూడా బంద్ చేస్తే ఎలాంటి మెసేజ్‌లు లేదా నోటిఫికేషన్లు రావు.
Also Read: స్నాప్‌డ్రాగన్ X2 ప్లస్‌తో Microsoft Surface.. 22.5 గంటల బ్యాటరీ, ధరెంతో తెలిస్తే?
ఏరోప్లేన్ మోడ్ పెట్టడం వల్ల నిద్రతో పాటు ఫోన్ బ్యాటరీ కూడా ఆదా అవుతుంది. రాత్రిపూట నెట్‌వర్క్ సిగ్నల్స్ కోసం ఫోన్ నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. దీనివల్ల బ్యాటరీ త్వరగా డ్రైన్ అవుతుంది. ముఖ్యంగా సిగ్నల్ సరిగ్గా లేని ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువ. అదే ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేస్తే సిగ్నల్ వెతకడం ఆగిపోయి, ఉదయానికి బ్యాటరీ ఛార్జింగ్ తగ్గకుండా ఉంటుంది.
చాలామందికి ఉండే పెద్ద అనుమానం ఏమిటంటే.. ఏరోప్లేన్ మోడ్ పెడితే ఉదయాన్నే అలారమ్ మోగుతుందో లేదో అని. కానీ నెట్‌వర్క్ ఆగిపోయినా ఫోన్‌లోని అలారమ్ టైమర్ యథావిధిగా పనిచేస్తుంది. కాబట్టి.. ఆందోళన లేకుండా ప్రశాంతంగా పడుకోవచ్చు. డిజిటల్ డిటాక్స్ కోసం ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.
పడుకునే కనీసం గంట ముందు ఫోన్ పక్కన పెట్టడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మొదట్లో ఫోన్ చూడకుండా ఉండటం కాస్త కష్టంగా అనిపించినా.. ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేయడం వల్ల నెమ్మదిగా ఆ అలవాటు మారుతుంది. రాత్రి వేళ స్క్రీన్ టైమ్ తగ్గించుకుని, ప్రశాంతమైన నిద్రపోవడానికి ఈ చిన్న ట్రిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
Also Read: 20 ఏళ్ల ఐఫోన్ జర్నీకి గ్రాండ్ ట్రీట్.. iPhone 20లో ఈ మార్పులు చూస్తే పిచ్చెక్కిపోతారండి బాబూ!