E-Paper
Advertisement

ఇండస్ట్రీలోకి రాకపోయుండుంటే చైత్ర రాయ్ ఏం చేసేవారో తెలుసా?

ఇండస్ట్రీలోకి రాకపోయుండుంటే చైత్ర రాయ్ ఏం చేసేవారో తెలుసా?
Advertisement

Chaitra Rai: ప్రముఖ సీరియల్ నటి చైత్ర రాయ్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. అష్టా చమ్మా సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ఆ తర్వాత రాధా కళ్యాణం, ఒక్క క్షణం, తథాస్తు వంటి సీరియల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అత్తారింట్లో అక్కాచెల్లెళ్ళు సీరియల్ లో ఏకంగా ద్విపాత్రాభినయం చేసి మెప్పించింది. కేవలం సీరియల్స్ కే పరిమితం కాకుండా ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’ చిత్రంలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. అలాంటి చైత్ర రాయ్ బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లోకి 6వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది.

ఇండస్ట్రీలోకి రాకపోయి ఉండుంటే.. అక్కడ సెటిల్ అయ్యేదాన్ని..

అయితే హౌస్ లోకి వచ్చి వారం కూడా గడవలేదు. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ఎలిమినేట్ అయ్యి.. అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా చైత్ర రాయ్ ది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వెలువడిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ బిగ్ బాస్ లోకి వెళ్లే అవకాశం వచ్చినా.. చైత్ర రాయ్ తోపాటు ఎలిమినేట్ అయిన ఆర్జె చరణ్ కు అవకాశం కల్పించడంపై కూడా బిగ్ బాస్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇకపోతే సోషల్ మీడియా కామెంట్లకు స్పందించని చైత్ర తాజాగా ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను పంచుకున్న ఈమె.. అందులో భాగంగానే తాను ఇండస్ట్రీలోకి రాకపోయి ఉండుంటే ఏం చేసేదో కూడా చెప్పుకొచ్చింది.

హోటల్ మేనేజ్మెంట్లో..

Advertisement

చైత్ర మాట్లాడుతూ..” నేను హోటల్ మేనేజ్మెంట్లో కోర్స్ చేస్తున్నప్పుడే.. మాకు వేరే ప్లేస్ కి ట్రైనింగ్ కి వేశారు. ఒకవేళ నేను ట్రైనింగ్ పూర్తి చేసి ఉంటే కనుక నాకు ఏదో ఒక పోస్ట్ దొరికి ఉండేది. ఒకవేళ పోస్ట్ కొట్టి ఉంటే హోటల్ మేనేజ్మెంట్ లో ఉండేదాన్ని అంటూ తాను ఇండస్ట్రీకి రాకపోయి ఉండుంటే హోటల్ మేనేజ్మెంట్లో సెటిల్ అయ్యుండేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది చైత్ర రాయ్.

అమ్మ వల్లే ఇండస్ట్రీలోకి..

తనకు సినిమాలలో అవకాశం ఎలా వచ్చింది అనే విషయంపై మాట్లాడుతూ.. “నన్ను ఎక్కడికైతే ట్రైనింగ్ కి వేశారో.. అక్కడికి ఒక ప్రొడ్యూసర్ ఏదో పనిమీద వచ్చి నన్ను చూశారు. ఆ సమయంలో నేను చాలా అల్లరి. అందరితో సరదాగా ఉంటూ అల్లరి చేస్తూ ఆడుతూ ఉండేదాన్ని. అలాంటి సమయంలో ఆయన అక్కడ నన్ను చూశారు. దూరం నుంచి నన్ను ఫోటో తీసి.. ఆయన ఎవరితో అయితే సినిమా చేస్తున్నారో.. ఆ మూవీ డైరెక్టర్ కి నా ఫోటో పంపించి, ఈ అమ్మాయి మన మూవీకి హీరోయిన్గా సూట్ అవుతుంది.

Advertisement

also read: వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు..బలవంతపు ప్రేమ అక్కర్లేదు.. రాశి ఖన్నా

మొదటి సినిమా ఆగిపోయింది.. అందుకే సీరియల్స్..

ఒకసారి వెళ్లి అప్రోచ్ అవ్వండి అని చెప్పారంట. ఆ నెక్స్ట్ డే ఆయన వచ్చి మా మేనేజర్ తో ఈ అమ్మాయిని ఇలా మూవీకి అనుకుంటున్నాము అని అడిగారు. మేనేజర్ అయ్యో మాకు అవన్నీ తెలియదు.. మీరు కావాలంటే ఆ అమ్మాయితోనే వెళ్లి మాట్లాడండి అన్నారు.ఆయనను చూడగానే ఎక్కడో చూసినట్టు అనిపించింది. కానీ ఈ ఫీల్డ్ తో నాకు ఐడియా లేదు కదా.. మా అమ్మతో మాట్లాడండి అని చెప్పాను. నిజంగానే వాళ్ళు మా అమ్మకి ఫోన్ చేశారు. మా అమ్మ అప్పుడు మన ఇంట్లో ఎవరికీ ఇలాంటి ఛాన్స్ రాలేదు. ట్రై చేద్దాం.. నేను తోడుగా ఉంటాను కదా అని చెప్పింది. అలా నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. అయితే ఆ సినిమా ఆర్థిక సమస్యల వల్ల మొదలు కాలేదు. కానీ వేరే వాళ్ళు సీరియల్స్ లో తీసుకున్నారు. అలా ఒకదాని తర్వాత ఒకటి సీరియల్స్ చేస్తూ వచ్చాను అంటూ తెలిపింది చైత్ర.

Related News

ఎట్టకేలకు లవ్ లో పడ్డ గల్లీ బాయ్ భాస్కర్.. గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేస్తూ!

బిగ్ బాస్ 10 సుధీర్ బర్త్డే.. గొప్ప పనికి శ్రీకారం చుట్టిన ఫ్యాన్స్!

ముఖేష్ కెప్టెన్సీ ఉష్.. కొత్త కెప్టెన్ గా అపూర్వ.. అప్పుడే మొదలుపెట్టేసిందే?

అలాంటి అమ్మాయే భార్యగా రావాలంటున్న బిగ్ బాస్ పవన్.. గొప్ప కోరికే!

Telugu Serials : ఈ వారం టాక్ ఆఫ్ ది సీరియల్.. అస్సలు ఊహించలేదు కదా..

భార్యాభర్తల్లో ఎవరు గొప్ప.. అదిరిపోయే సమాధానం ఇచ్చిన సోనియా భర్త!

Gundeninda GudiGantalu Today episode: పాపం మీనా.. బాలు ప్లాన్ అదిరిపోలే.. ఇది కదా అసలు ట్విస్ట్..

Big Stories

Advertisement
×