Chaitra Rai: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అష్టా చమ్మా సీరియల్ ద్వారా పరిచయమయ్యారు నటి చైత్ర రాయ్(Chaitra Rai). కన్నడ బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ అనంతరం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగులో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా తెలుగులో చైత్ర అత్తారింట్లో అక్క చెల్లెలు, దట్ ఈజ్ మహాలక్ష్మి, ఒకరికి ఒకరు, మనసున మనసై వంటి సీరియల్స్ లో నటించి తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో చైత్ర సీరియల్స్ కి చిన్న విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈమె పెళ్లి తర్వాత పిల్లలు పుట్టిన కారణంగా ఇండస్ట్రీకి కొంచెం విరామం ఇచ్చారు. ఇలా గ్యాప్ తర్వాత చైత్ర బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు అయితే ఈమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే చివరి వరకు ఉంటుందని అందరూ భావించారు కానీ చైత్ర మాత్రం ఊహించని విధంగా మొదటి వారమే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇలా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత మొదటిసారి ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా చైత్ర కెరియర్ కి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలు గురించి కూడా మాట్లాడారు.
ఈ నేపథ్యంలోనే యాంకర్ ఈమెను ప్రశ్నిస్తూ మీరు మొదట్లో చూసిన చైత్ర ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి అంటూ ప్రశ్నించారు దీంతో ఈమె సమాధానం చెబుతూ.. సోషల్ మీడియాలో వచ్చిన నెగిటివ్ కామెంట్స్ కారణం అని తెలిపారు. సాధారణంగా ఒక అమ్మాయి అమ్మగా మారిన తర్వాత వారి శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఈ విషయాలు అబ్బాయిలకు బహుశా క్లుప్తంగా తెలియకపోయినా అమ్మాయిలకు చాలా బాగా తెలుసు. తను కూడా పిల్లలు పుట్టిన తర్వాత చాలా శరీర బరువు పెరిగిపోయానని చైత్ర తెలిపారు.
ఇలా పిల్లలు పుట్టిన తర్వాత తాను సోషల్ మీడియాలో ఒక రీల్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాను. అయితే ఆ వీడియో పై మహిళలే సిగ్గు లేదా ఇలా ఉండి రీల్స్ చేయడానికి అంటూ చాలా దారుణంగా బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారని చైత్ర ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి కామెంట్లు అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలే ఎక్కువగా పెడతారని మహిళలకు మహిళలే శత్రువులని ఈమె తెలిపారు. నెగిటివ్ కామెంట్లు చూస్తూ తాను చాలా ఏడ్చానని అయితే అమ్మ, మా ఆయన మాత్రం దీనిని ఛాలెంజ్ గా తీసుకొని నువ్వేంటో ప్రూఫ్ చేసుకో అంటూ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారని చైత్ర తెలిపారు. ఇలా తన గురించి వచ్చిన బాడీ షేమింగ్ కామెంట్స్ పై చైత్ర ఎమోషనల్ అవుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read: గంగా హాస్పిటల్ డాక్టర్స్ కు రామ్ చరణ్ కృతజ్ఞతలు..!