Dragon movie:ఇటీవల కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకరి తర్వాత ఒకరు తమ సినిమా షూటింగ్లలో గాయపడుతూ.. ప్రస్తుతం సర్జరీలు చేయించుకొని, తమ సినిమాల షూటింగ్లకు బ్రేక్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే మరొకవైపు తాము లేకున్నా.. సినిమా షూటింగ్ ఆగిపోకుండా.. సినిమా లోని మిగతా సన్నివేశాలను చిత్రీకరించాలని దర్శకులను హీరోలు కోరుతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ (Balakrishna), గోపీచంద్ మలినేని(Gopichandh Malineni) దర్శకత్వంలో చేస్తున్న ‘NBK 111’ సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ కాలుజారి కింద పడ్డారు. ఇటీవలే ఆయన మోకాళ్ళకు సర్జరీ కూడా అయింది.6 వారాల పాటు వైద్యులు విశ్రాంతి తీసుకోమని చెప్పడంతో షూటింగ్ వాయిదా పడిందని, విడుదల తేదీ కూడా ఆలస్యం అవుతుందని అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. కానీ బాలయ్య.. గోపీచంద్ తో సినిమా షూటింగ్ ఆపకుండా మిగతా సన్నివేశాలను చిత్రీకరించాలని సూచించారట.
ఇక ఇప్పుడు తన బాబాయ్ బాటలోనే ఎన్టీఆర్ కూడా నడుస్తున్నారు అనే చెప్పాలి. విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR ) ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మరొకవైపు ఆయన భుజానికి గాయమైందని, సర్జరీ చేయాలి అని, ఎన్టీఆర్ ఆఫీస్ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఎట్టకేలకు సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో ఆగస్టు 12వ తేదీన ఎన్టీఆర్ కి వైద్యులు సర్జరీ చేశారు. కానీ సుమారుగా మూడు నెలల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో డ్రాగన్ సినిమా వాయిదా పడుతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త చెబుతూ డ్రాగన్ మూవీ షూటింగ్ కొత్త షెడ్యూల్ కి సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
also read:కలిసొచ్చిన లక్కీ భాస్కర్.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీకి భారీ బిజినెస్!
ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ భుజానికి జరిగిన సర్జరీ అనంతరం ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకున్నప్పటికీ.. సినిమా షూటింగ్లో ఎలాంటి బ్రేక్ ఉండకూడదని ఎన్టీఆర్ తో పాటు మేకర్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 3 నుంచి మొదలయ్యే షెడ్యూల్లో మిగతా పార్ట్ తో పాటు చిన్ననాటి సన్నివేశాలను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కి సంబంధం లేని ఈ బ్యాలెన్స్ పోర్షన్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత.. సెప్టెంబర్ నాలుగవ వారంలో ఎన్టీఆర్ స్వయంగా సినిమా షూటింగ్ సెట్స్ లో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే ఎన్టీఆర్ గాయం కారణంగా ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ కూడా పూర్తిగా అవాస్తవమని తెలుస్తోంది.. మరి దీనిపై మేకర్స్ ఎప్పుడు అధికారికంగా స్పందిస్తారో చూడాలి.
డ్రాగన్ సినిమా విషయానికొస్తే.. ఎన్టీఆర్ హీరోగా, రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రశాంత్ నీళ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వై.రవిశంకర్, నవీన్ ఎర్నేని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.