Matthew Hayden On Vaibhav Sooryavanshi : ఇండియన్ ప్రీపెయర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ఇరగదీసిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Sooryavanshi ) గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే, వైభవ్ కు సంబంధించిన పోస్టులు, అతని రికార్డులు కనిపిస్తూ ఉంటాయి. ఐపీఎల్ 2026 టోర్నమెంటులో అద్భుతంగా రాణించిన నేపథ్యంలో టీమిండియాలో కూడా చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ తో జరిగిన టి20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం కూడా చేశాడు వైభవ్ సూర్యవంశీ. ఇంగ్లాండ్ గడ్డపై విఫలమైనప్పటికీ, జింబాబ్వే పైన ఇరగదీశాడు. రెండు అర్థ సెంచరీలు చేసి రెచ్చిపోయాడు. అయినప్పటికీ వైభవ్ సూర్య వంశీ బ్యాటింగ్ పై కొంత మంది విమర్శలు చేస్తూనే ఉన్నారు.
15 ఏళ్ల ఇండియన్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ టోర్నమెంట్ కు తప్ప, దేనికి పనికి రాబోడని హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. వైభవ్ సూర్య వంశీ వయస్సు 15 సంవత్సరాలు కాదని, 20 నుంచి 25 మధ్యలో అతని వయసు ఉంటుందని ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాళ్లందరికీ ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్ ( Matthew Hayden) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన బ్యాటర్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేవలం టి20 లేదా ఐపీఎల్ లాంటి పొట్టి ఫార్మాట్ కు మాత్రమే వైభవ్ పనికి వస్తాడని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. టి20 లే కాకుండా సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్టుల్లో కూడా వైభవ్ అద్భుతంగా ఆడతాడని స్పష్టం చేశారు. అతడు టెస్టులు ఆడితే చూడాలని తనకు కూడా ఉందని వ్యాఖ్యానించారు మాథ్యూ హేడెన్.
బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకొని టెస్టుల్లోకి కూడా వైభవ్ సూర్యవంశీని తీసుకురావాలని డిమాండ్ చేశారు ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్ ( Matthew Hayden). ఒకవేళ టెస్టుల్లోకి అతడు వస్తే మాత్రం, ఒక రోజే 500 పరుగులు చేస్తాడని సంచలన కామెంట్స్ చేశారు. బ్రియన్ లారా చేసిన 400 పరుగుల రికార్డును కూడా కేవలం ఒకే రోజులో బద్దలు కొట్టే, కెపాసిటీ వైభవ్ ఉందని పేర్కొన్నారు. అయితే టెస్టుల్లో రాణించాలంటే ఫిట్నెస్ చాలా ఉండాలని సూచనలు చేశారు. ప్రస్తుత సమయంలో ఫిట్నెస్ పైన వైభవ్ దృష్టి పెట్టాలని కోరారు. అప్పుడే మంచి భవిష్యత్తు వైభవ్ ఉంటుందని స్పష్టం చేశారు మాథ్యూ హేడెన్. ఫిట్‌నెస్ ను మాత్రం వైభవ్ కోల్పోతే కష్టమేనని హెచ్చరించారు.