Chaitra Rai: చైత్ర రాయ్ పరిచయం అవసరం లేని పేరు. కన్నడ బుల్లి తెర సీరియల్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ అనంతరం అష్టాచమ్మా అనే సీరియల్ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇలా ఈ సీరియల్ తో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న చైత్ర అనంతరం తెలుగులో ఎన్నో అద్భుతమైన సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగు అమ్మాయిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా తెలుగు బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెర సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో నటించే అవకాశాలను అందుకున్న చైత్ర రాయ్ (Chaitra Rai)ఇటీవల ఇండస్ట్రీకి కొంచెం బ్రేక్ ఇచ్చారు.
ఇండస్ట్రీకి విరామం ఇచ్చిన చైత్ర రాయ్ ఏకంగా బిగ్ బాస్ 10 తెలుగు (Bigg Boss 10 Telugu)వేదికపై దర్శనం ఇచ్చారు. ఇలా బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన ఈమె చివరి వరకు హౌస్ లో ఉంటుందని భావించారు కానీ ఊహించని విధంగా మొదటి వారమే హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఇలా చైత్ర రాయ్ మొదటి వారమే ఎలిమినేట్ కావడంతో అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేశారు. ఇలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చైత్ర ఎక్కడ కూడా ఇంటర్వ్యూలకు హాజరు కాలేదు. బిగ్ బాస్ ఎలిమినేషన్ తర్వాత మొదటిసారి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె బిగ్ బాస్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ కార్యక్రమంలో తనకు గత సీజన్లకే అడిగారని తెలిపారు. ఇలా అడిగిన ప్రతిసారి తరువాత సీజన్ ట్రై చేస్తా అని చెప్పేదాన్ని. అప్పటి పరిస్థితుల కారణంగా బిగ్ బాస్ పాల్గొనలేకపోయాను కానీ ఈసారి తనకు అవకాశం రావడంతో కేవలం తన పిల్లల కోసమే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లానని తెలిపారు. తన పెద్దమ్మాయికి ఐదు సంవత్సరాలు తను కూడా నాతోపాటు అప్పుడప్పుడు బిగ్ బాస్ షో చూస్తుందని తనకు తెలుగు మాట్లాడటం లేకపోయినా అర్థం చేసుకుంటుందని తెలిపారు. తెలుగు మాత్రమే కాకుండా కన్నడ బిగ్ బాస్ కూడా చూస్తుందని తెలిపారు.
బిగ్ బాస్ గురించి అవగాహన ఉండటంతో తన కూతురు నన్ను కూడా బిగ్ బాస్ వెళ్లమనింది.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళన తర్వాత ప్రతి ఒక్క టాస్క్ బాగా ఆడాలని అలాగే కప్పుతోనే బయటకు తిరిగి రావాలని తన కూతురు తనకు చెప్పింది. ఇలా పిల్లల కోసం మీకు తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాను. వాళ్లు కోరుకున్న విధంగా కప్పు సాధించాలని అనుకున్నాను కానీ అలా జరగలేదు అంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు. మొదటి వారమే తాను బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడంతో తన కూతురి కోరిక తీర్చలేకపోయాననీ చైత్ర కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా బిగ్ బాస్ గురించి చైత్ర రాయ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read: 150 ఏళ్ల నాటి నిజ జీవిత కథ..రణబాలి ఫస్ట్ సిరీస్ డాక్యుమెంటరీ రిలీజ్!