Gully Boy Bhaskar: వెండితెర మొదలుకొని బుల్లితెర వరకు సెలబ్రెటీలు ఒకరి తరువాత ఒకరు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. కొంతమంది తమ ప్రేమ బంధాన్ని బయట పెడితే.. మరి కొంతమంది పెళ్లి విషయంపై అభిమానులతో క్లారిటీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా ప్రేక్షకులను తనదైన కామెడీ డైలాగ్ తో ఆకట్టుకుంటున్న గల్లీ భాయ్ భాస్కర్.. ఎట్టకేలకు ప్రేమలో పడ్డారు. నిజానికి గత నాలుగు సంవత్సరాలుగా ఆయన ప్రేమలో ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ తాజాగా యాదమ్మ రాజు సడన్ సర్ప్రైజ్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.
విషయంలోకి వెళ్తే.. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో గత తొమ్మిది సంవత్సరాల క్రితం గల్లీ భాయ్ భాస్కర్, ప్రవీణ్ కలసి యాదమ్మ రాజు గర్ల్ ఫ్రెండ్ స్టెల్లాను స్టేజ్ పై పరిచయం చేసి యాదమ్మ రాజుకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు రివేంజ్ అంటూ యాదమ్మ రాజు గల్లీబాయ్ భాస్కర్ గర్ల్ ఫ్రెండ్ ను స్టేజ్ పైకి తీసుకొచ్చి అతడు సర్ప్రైజ్ ఇచ్చారు. ఎట్టకేలకు గల్లీ భాయ్ భాస్కర్ ప్రేమలో పడ్డ విషయం అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలకు కూడా తెలిసిపోయింది. ఇక ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
పటాస్ షోలో స్టాండ్ అప్ కమెడియన్ గా కెరియర్ ప్రారంభించిన భాస్కర్.. సద్దాం, యాదమ్మ రాజుతో కలిసి స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అదిరింది, కామెడీ స్టార్స్ వంటి షోలతో భారీ పాపులారిటీ అందుకున్న గల్లీ భాయ్ భాస్కర్ జబర్దస్త్ లో కూడా పనిచేశాడు. వీటితో పాటు పలు ఈవెంట్లలో పాల్గొంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. 2024లో మూడంతస్తుల సొంత ఇంటిని కూడా కట్టుకొని తన డ్రీమ్ ఫుల్ ఫిల్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రేమ విషయాన్ని బయటపెట్టారు..
ప్రోమోలో భాగంగా గల్లీ భాయ్ భాస్కర్ మాట్లాడుతూ.. “తను నా ప్రేయసి మానస.. 2022లోనే నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది. ఈ విషయం నాకు కూడా తెలియదు. తనే ప్రపోజ్ చేసే వరకు ఈ విషయం నాకు తెలియదు. నిజంగా తాను బంగారం.. 2024 లో నేను గృహప్రవేశం చేయాలనుకున్నప్పుడు నాకు ఫోన్ చేసింది. చుట్టాలు అందరూ వస్తున్నారు చేతిలో డబ్బు లేదు. గృహప్రవేశం ఎలా చేయాలి అని మదన పడుతున్న సమయంలో నా టెన్షన్ తాను గమనించింది. ఫోన్ కట్ చేయగానే వెంటనే 2 లక్షలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది. నా కష్టాన్ని అర్థం చేసుకున్న దేవత . నా తల్లి తర్వాత తల్లి అంటూ తన ప్రేయసి మానసపై ప్రశంసలు కురిపించారు గల్లీ బాయ్ భాస్కర్.
also read: ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి..హోస్ట్ గా కొత్త బాధ్యతలు?
మొత్తానికి అయితే గల్లీ బాయ్ భాస్కర్ తన ప్రేయసి మానసను పరిచయం చేయడంతో మరి పెళ్లెప్పుడు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే పెళ్లి ఎప్పుడు అనే విషయం పై గల్లీ బాయ్ భాస్కర్ స్పందించలేదు. ఏది ఏమైనా ఈ జంట చూడముచ్చటగా ఉంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.