Priyanka Jain: బిగ్ బాస్ కంటెస్టెంట్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రముఖ సీరియల్ నటి ప్రియాంక జైన్ (Priyanka Jain).. తాజాగా ఒక వీడియో విడుదల చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన పుట్టినరోజు సందర్భంగా తన తల్లి ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని తన అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేయడంతో అభిమానులే కాదు నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. “నువ్వు తల్లి అయ్యే సమయంలో మీ అమ్మ తల్లి అవడం ఏంటి?” అంటూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ప్రియాంక తల్లి బేబీ బంప్ ఫోటోషూట్ నిర్వహిస్తూ చేస్తున్న ఈ వీడియోపై పలు రకాల కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
బేబీ బంప్ తో దర్శనమిచ్చి ప్రియాంక జైన్ తల్లి..
తాజాగా ప్రియాంక షేర్ చేసిన వీడియోలో ప్రియాంక తల్లి బేబీ బంప్ తో కనిపించేసరికి అటు ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ్ (Shiv ) కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆయన అక్కడి నుంచే తన తల్లికి వీడియో కాల్ చేయగా.. ఆమె కూడా ఈమె బేబీ బంప్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
నేనెప్పుడు తల్లి అవుతానో – ప్రియాంక జైన్
ఇక ఈ వీడియో తీస్తూ శివ్ మాట్లాడుతూ.. పరి మీ అమ్మ బేబీ బంప్ తో దర్శనమిస్తోంది కదా.. ఈ వయసులో ఆమె ఇలా ప్రెగ్నెంట్ అవ్వడంతో తమ్ముడు రావాలని కోరుకుంటున్నావా? లేక చెల్లి కోసం ఎదురు చూస్తున్నావా? ఈ వయసులో ఆమె ప్రెగ్నెంట్.. అసలు నీ ఫీలింగ్ ఏంటి? అని ప్రశ్నించగా.. “నేనెప్పుడూ ప్రెగ్నెంట్ అవుతానో” అని సడన్ షాక్ ఇచ్చింది ప్రియాంక. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
వీడియో వెనుక ఇంత కథ ఉందా..
అయితే ఈ వీడియో తీయడం వెనుక అసలు నిజం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం జూలై 2 ముందు రోజు తాను పుట్టకముందు తన తల్లి బేబీ బంప్ తో ఎలా ఉంది? అనే విషయాన్ని ఇప్పుడు రీ క్రియేట్ చేసాము అని ప్రియాంక చెప్పుకొచ్చింది. అంతేకాదు తన తల్లి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు పలు పరిస్థితుల వల్ల తన తల్లికి సీమంతం కూడా జరగలేదని, అసలు ఫోటోషూట్ కూడా చేయలేదు అని, ఇప్పుడు ఆ విషయాలను రీ క్రియేట్ చేసి తన తల్లి ముఖంలో సంతోషాన్ని చూడడం కోసమే ఇలా చేస్తున్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక ఇది చూసిన తర్వాత ఇదా అసలు మ్యాటర్ అంటూ నెటిజన్స్ తెగ నవ్వుకుంటున్నారు.
ALSO READ:HHVM Trailer : లైఫ్ ఇచ్చినోడినే తిట్టావా సత్య రాజ్… ఎంతైనా పవన్ మంచోడు సామి!