BigTV English

Telangana: లంచాల్లేవు.. ఆ వేధింపులు లేవు.. ఆర్టీఏ ఆఫీసుల్లో మారిన పరిస్థితి, రేవంత్ సర్కార్‌పై ప్రశంసలు

Telangana: లంచాల్లేవు.. ఆ వేధింపులు లేవు.. ఆర్టీఏ ఆఫీసుల్లో మారిన పరిస్థితి, రేవంత్ సర్కార్‌పై ప్రశంసలు

Telangana:  తెలంగాణలోని ఓ ఆర్టీఏ ఆఫీసులో ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. దాన్ని చూసి ఆయన ఎన్నాళ్ల కెన్నాళ్లకు అంటూ జరిగిన వ్యవహారాన్ని సోషల్‌మీడియా వేదికగా రాసుకొచ్చారు. ఏ ప్రభుత్వ ఆఫీసుకి వెళ్లినా ఏజెంట్లు కచ్చితంగా కనిపిస్తారు. ఒకవేళ ఏజెంట్లు లేకపోతే ఆ పని కాదు.  అనే భావన వ్యక్తుల మనసులోకి బలంగా నాటుకుపోయింది. కామన్‌మేన్ లేనిపోని విధంగా కొర్రీలు పెడతారు. అదే ఏజెంట్లు వెళ్తే క్షణాల్లో చేసి పెడతారు. ఆ విధంగా తయారయ్యారు అధికారులు.


తాజాగా హైదరాబాద్‌లోని ఓ వ్యక్తి వెహికిల్ రిజిస్ట్రేషన్ కోసం చాలాకాలం తర్వాత ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ పరిస్థితి చూసి షాకయ్యారు. ఇంతకీ తాను వచ్చింది ఆర్టీఓ ఆఫీసు.. లేక ఏదైనా ప్రైవేటు కంపెనీ అన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే అక్కడ పరిస్థితి చాలా తేడాగా కనిపించింది. ఒకప్పుడు ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లగానే ఈగలు మూసినట్టు మూగేవారు ఏజెంట్లు. ప్రస్తుతం ఒక్క ఏజెంట్ కూడా కనిపించలేదు. వెయ్యి.. రెండు వేలు అవుతుందని చెప్పే దళారీలు కనిపించేవారు. ఏజెంట్లకు బదులు ఆర్టీఏ సిబ్బంది ఎటు వెళ్లాలో.. ఏం చేయాలో క్లియర్‌గా చెప్పడం ఆయనకు కనిపించింది.

వాహనాల రిజిస్ట్రేషన్‌కు ఏయే డాక్యుమెంట్లు కావాలో ఓపిగ్గా చెప్పారట అధికారులు. అది చూసి ఆయనకు చాలాసంతోషం అనిపించింది. ఆఫీసులో పని ముగిశాక వెహికిల్ దగ్గరకు వచ్చి అన్నీ చెక్ చేసి మీ పనైపోయింది. ఇక మీరు వెళ్లిపోవచ్చు అని చెప్పడం ఆయనకు చాలా ముచ్చటేసింది. ప్రజలు చెల్లించే పన్నులతో జీతాలు తీసుకుని సేవ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు లంచాల రూపంలో వారిని వేధించే పరిస్థితిపై బాధ వేసేది. ఇదంతా ఒకప్పటి మాట. తాజాగా ప్రస్తుతం ఆ పరిస్థితిలో మార్పు చూసి ఎప్పటికీ ఇలాగే ఉండిపోతే బాగుండు అనిపించిందని సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు.


అక్కడకు వచ్చిన వారిలో చాలామందికి ఇంకా అవగాహన లేదని రాసుకొచ్చారు. వాళ్లు తెలిసిన వాళ్లను పట్టుకుని వచ్చిన సందర్భాలు కనిపించాయి తెలిపారు.  తెలిసిన ఏజెంట్ ఎవరైనా దొరుకుతారా అంటూ ఫోన్‌లో ఆరా తీస్తున్న సన్నివేశాలు కనిపించాయని రాసుకొచ్చారాయన. కొందరు ఏజెంట్లు ఆర్టీఏ ఆఫీసు లోపలికి రాకుండా ప్రహారీ బయటే ఫోన్ ద్వారా గైడ్ చేస్తోన్న పరిస్థితి గమనించానని ప్రస్తావించారు. మారిన పరిస్థితి‌పై ప్రజల్లో ఇంకా అవగాహన రావాల్సి ఉందనిపించిందని మనసులోని మాట బయటపెట్టారు. ఈ మార్పు వెనుక అసలు కారణం బయటపెట్టారాయన. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతి నుంచే ఈ పరిస్థితులు మారినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

ALSO READ: ఫోన్ ట్యాపింగ్ పై విస్తుపోయే నిజాలు, కవిత సంచలన విషయాలు

ఈ మధ్యకాలంలో ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పని చేసే సిబ్బంది ఒళ్లు దగ్గర పెట్టుకుని  పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.  వెహికిల్ చెక్ చేసిన తర్వాత వినియోగదారుల నుంచి ఏమీ తీసుకోవడానికి వాళ్లు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. వినియోగదారుల పని తర్వాత మన వైపే చూడకుండా అధికారులు వెళ్లి పోతున్నారు. అది చూసి తనకు ఆశ్చర్యంతో పాటు సంతోషం వేసిందన్నాడు. సిస్టమ్.. సిస్టమ్ లా నడుస్తోందని, ఈ మార్పుకు కారణమైన రేవంత్ సర్కారుకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఆయన.

Related News

Kukatpally Nallacheruvu: ముక్కు మూసుకొనే చెరువు.. రూపం మార్చుకుంది.. రమ్మని అంటోంది!

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా హర్పాల్ సింగ్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Job guarantee courses: ఇంటర్, డిగ్రీ అవసరం లేదు.. పదో తరగతి తర్వాతే డైరెక్ట్ జాబ్.. ఇలా చేయండి!

Govt savings plan: మీ పాప పేరు మీద ఈ స్కీమ్‌లో ఇంత పెట్టుబడి పెడితే.. పెళ్లికి సుమారు రూ.72 లక్షలు మీ చేతికి!

TG High Court: రామంతాపూర్ ఘటనపై హైకోర్టు సీరియస్.. నివేదక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం

Kaleshwaram Report: కాళేశ్వరం నివేదికపై పిటిషన్.. కోర్టులో వాడివేడి వాదనలు, తీర్పు ఎటు?

Big Stories

×