BigTV English

YCP Letter: ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ.. ఆ గుర్తు కావాలంటూ, దేశ చరిత్రలో తొలిసారి కావచ్చేమో

YCP Letter: ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ.. ఆ గుర్తు కావాలంటూ, దేశ చరిత్రలో తొలిసారి కావచ్చేమో

YCP Letter: దేశ రాజకీయాల్లో వైసీపీ ట్రెండ్ సెట్ చేస్తోందా? ఆ పార్టీ ఎందుకు గుర్తు మార్చాలని డిసైడ్ అయ్యింది? ఫ్యాన్ కంటే ‘గొడ్డలి’ గుర్తు మాంచి స్పందన వస్తుందా?  ఫ్యాన్ గుర్తుకు కాలం చెల్లినట్టేనా? రాబోయే కాలమంతా గొడ్డలిదేనని అనుకుంటోందా? గొడ్డలి గుర్తుతో ప్రజలను భయపెట్టడం ఖాయమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


వైసీపీ ఫౌండర్ శివకుమార్ పేరిట సోషల్‌మీడియాలో ఓ లేఖ హంగామా చేస్తోంది. దాని సారాంశం ఏంటంటే.. గొడ్డలి గుర్తు కావాలంటూ ఎలక్షన్ కమిషన్‌కు వైసీపీ లేఖ రాసింది. ప్రస్తుతం ఫ్యాన్ సింబల్‌కి బదులు ‘గొడ్డలి’ గుర్తు కేటాయించాలన్నది దాని సారాంశం. పార్టీ భవిష్యత్, ఐటెంటిటీ, రాజకీయ వ్యూహం నేపథ్యంలో గుర్తు మారుస్తున్నట్లు అందులో పేర్కొంది.

వైసీపీ రాసిన లేఖ నిజమేనా? ఆ పార్టీలో వీరాభిమానులు ఎవరైనా రాసిన లేఖను సోషల్‌మీడియాలో పోస్టు చేశారా? అనే డౌట్ అప్పుడే ఆ పార్టీలో కొందరు నేతలు, కార్యకర్తల్లో మొదలైంది. ఉన్నట్లుండి హైకమాండ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటంటూ ఇంటా బయటా చర్చ మొదలైపోయింది.


వైసీపీకి ఫ్యాన్ గుర్తు సాఫ్ట్‌గా ఉందని, అదే గొడ్డలి గుర్తు అయితే సరిపోతుందని హార్డ్‌కోర్ అభిమానుల మాట. జగన్ టూర్‌లో ‘ తాము అధికారంలోకి వస్తే.. రప్పారప్పా నరుకుతా’ అంటూ కటౌట్లు హంగమా చేశాయి. మీడియా సమావేశంలో పదేపదే రప్పా రప్పా అంటూ జగన్ గుర్తు చేశారు.  మాజీమంత్రులు, కొందరు నేతలు సైతం రప్పా రప్పా అంటూ అధికార పార్టీపై డైలాగ్స్ పేల్చుతున్నారు.

ALSO READ: సామాన్యులకు అందుబాటులో డ్రోన్ సేవలు.. పోర్టల్ ప్రారంభించి ఏపీ ప్రభుత్వం

ఈ క్రమంలో వైసీపీ హైకమాండ్ గుర్తు మార్చాలని డిసైడ్ అయ్యిందని కొందరు నేతలు ఆఫ్ ద రికార్డులో చర్చించుకోవడం మొదలైంది. అదే నిజమైతే తాము అధికారంలోకి  వస్తే ‘రప్పా రప్పా’ ఖాయమని ముందుగానే సంకేతాలు ఇస్తోంది ఆ పార్టీ.  మా పాలన ఈ విధంగా ఉండనుందని చెప్పే ప్రయత్నం చేస్తోంది.

నార్మల్‌గా రాజకీయ పార్టీల నేతలు గుర్తులు మార్చడానికి ఏ మాత్రం ఇష్టపడరు. వీటి విషయంలో న్యాయస్థానాలను ఆశ్రయించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.  మహారాష్ట్రలో శివనేన, ఎన్‌సీపీ పార్టీలు గుర్తులపై న్యాయపోరాటం చేశాయి.  పార్టీలు గుర్తు మార్చితే ఎన్నికల్లో ఓటర్లు వాటిని మరిచిపోయే అవకాశముందని భావించి, పాత గుర్తు కోసం పోరాటం చేస్తుంటాయి.

అన్నట్లు గత నెల 25న టీడీపీ మాజీమంత్రి సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పేరు మార్చి రప్పా రప్పా అని పెట్టుకోవాలన్నారు. గుర్తుగా గొడ్డలిని మార్చుకోవాలని హితవు పలికారు. గతేడాది మార్చిలో టీడీపీ అధికార ప్రతినిధి నాగూల్ మీరా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ఫ్యాన్ గుర్తు రద్దు చేసి గొడ్డలి గుర్తు కేటాయించాలన్నారు.  ప్రత్యర్థులు మాత్రమేకాదు వైసీపీ హార్డ్‌కోర్ అభిమానులు సైతం  గుర్తు మార్చాలని పట్టుబడుతున్నారు. మరి పార్టీ గుర్తు వ్యవహారంపై వైసీపీ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.

 

Related News

Srikakulam News: లవ్ మ్యారేజీకి ఒప్పుకోవడం లేదని.. సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్.. చివరకు?

YSR CSO John Wesley: కొడుకు వర్ధంతి.. తల్లి అదే రోజు మృతి.. ఈ ఫ్యామిలీకి జగన్ కు సంబంధమేంటి?

Nellore Politics: కాకాణితో భేటీ.. నెల్లూరు నగర మేయర్ స్రవంతికి పదవీగండం

Smart Kitchen: సీకే దిన్నె ప్రభుత్వ పాఠశాలలో దేశంలోనే తొలి స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన మంత్రి లోకేష్

Jagan-Vijayamma: కలసిపోయిన జగన్, విజయమ్మ.. కొడుకు, కోడల్ని ముద్దు పెట్టుకుని..

Lokesh vs Jagan: ఓరి నీ పాసుల గోల.. జగన్‌పై లోకేష్ సెటైర్లు, మేటరేంటి?

Big Stories

×