Brahmamudi Actress: బుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా ప్రసారమవుతున్న సీరియల్స్ లలో బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న అన్న విషయం తెలిసిందే.. ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ స్టార్ మా లో ఈ సీరియల్ ప్రసారమవుతుంది. ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ నైనిషా రాయ్.. ఇందులో మెయిన్ రోల్ లో నటిస్తున్న కావ్య చెల్లెలుగా అప్పు పాత్రలో నటించింది. నిజానికి ఈమె తెలుగమ్మాయి కాదు బెంగాలీ నుంచి వచ్చింది. అయినా కూడా తెలుగులో చక్కగా మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంటుంది. అయితే ఈమె బ్యాక్ గ్రౌండ్ గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. కాగా, ఈ అమ్మడు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆమె తన ప్రియుడ్ని పరిచయం చేసింది. అతను ఎవరు? ఏం చేస్తుంటారు? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
బ్రహ్మముడి అప్పు..
నైనిషా రాయ్ అనే పేరు గుర్తు పట్టడం కష్టం కానీ బ్రహ్మముడి అప్పు అనే పేరు వింటే టక్కున గుర్తు పడతారు. సీరియల్ మొదట్లో కాస్త అల్లర చిల్లరిగా తిరిగే రౌడీ బేబీ గెటప్‌లో నైనిషా కనిపించింది. కానీ తర్వాత పోలీస్ అయిపోయి ప్రేక్షకులకి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇప్పుడు ఈ సీరియల్ కథ, కథనంలో అప్పు పాత్రకి గట్టిగానే వెయిట్ ఉంది. ప్రస్తుతం సీరియల్లో అప్పు పోలీస్ పాత్రలో నటిస్తుంది. ఉద్యోగంలోకి చేరిన మొదటి రోజే కుటుంబాన్ని అప్పుల పాలవకుండా కాపాడింది. ఇక పర్సనల్ అప్పు తాజాగా ఓ గుడ్ న్యూస్ ని అందరితో షేర్ చేసుకుంది. అదేంటంటే..
AlSo Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ మూడు సినిమాలను మిస్ అవ్వకండి..
బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన అప్పు..
ఈ మధ్యకాలంలో సీరియల్లో నటిస్తున్న నటీనటులు ఒక్కొక్కరుగా తమ ప్రేమను బయట పెడుతూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తున్నారు. తాజాగా నైనిష కూడా తన అభిమానులకి గుడ్ న్యూస్ ని చెప్పింది. తన ప్రియుడ్ని పరిచయం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది.. నా జీవితం.. నా సర్వశ్వం.. నా బలం.. నా ఆనందం..అంటూ లవ్ ఎమోజీతో ఓ ఫొటో షేర్ చేసింది నైనిషా. ఇందులో తన ప్రియుడి హృదయంపై ఆనుకొని కిందకి చూస్తూ ఉంది నైనిషా. అయితే ఈ ఫోటోను చూడగానే ఫ్యాన్స్ అంతా కంగ్రాట్స్ పెళ్లి ఎప్పుడు, ఎవరీ అబ్బాయి, ఏం చేస్తుంటాడు అంటూ కామెంట్లు పెట్టారు. అయితే ఇప్పటివరకు నెటిజన్లు చేసిన కామెంట్లకు నైనిషా రిప్లై ఇవ్వలేదు. కానీ తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలను మాత్రం వరుసగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది. అయితే త్వరలోనే వీళ్ళిద్దరూ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. త్వరలోనే ఆ గుడ్ న్యూస్ ని కూడా చెప్తుందేమో చూడాలి.. ఇక ఆలస్యం ఎందుకు నైనిషా రాయ్ పోస్ట్ చేసిన ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఓ లుక్ ఇటు వేసుకోండి..