Mehar Ramesh : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న డైరెక్టర్స్ లో మెహర్ రమేష్ ఒకరు. కంత్రి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు మెహర్. మెహర్ కెరియర్ లో ఇప్పటివరకు ఒక సరైన హిట్ సినిమా కూడా లేదు అని చెప్పాలి. అయితే మెహర్ చేసిన అన్ని సినిమాలలో కంటే బిల్లా సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం. ఈ సినిమాలో ప్రభాస్ ని చూపించిన విధానం చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో ఆడకపోయిన కూడా పరవాలేదు అని అనిపించింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమాలో అనుష్క బికినీలో కనిపిస్తుంది అని అప్పట్లో వార్తలు వినిపించడంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్
ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు కృష్ణంరాజు కీలకపాత్రలో కనిపించారు. అనుష్క తో పాటు నమిత, హన్సిక ప్రధాన పాత్రలగా ఈ సినిమాలో కనిపించడంతో ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ మొదలయ్యాయి. అయితే ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు నిరాశ మాత్రం తప్పలేదు. కానీ ప్రభాస్ లో ఉన్న కామెడీ టైమింగ్ ను పర్ఫెక్ట్ గా చూపించాడు మెహర్. ఇక ఒకప్పుడు రిలీజ్ అయిన సినిమాలు సరైన ఆదరణ దక్కించుకోకపోయినా కూడా రీసెంట్ టైమ్స్ లో రీ రిలీస్ అవుతున్నప్పుడు మాత్రం ఆ సినిమాకి మంచి ఆదరణ దక్కుతుంది. అలానే బిల్లా సినిమా కూడా మంచి ఆదరణ లభించింది. ప్రభాస్ అభిమానులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు.
Also Read : Vankkantham Vamsi: నా పేరు సూర్య సినిమా ప్లాప్ అయిన తర్వాత అరవింద్ గారి పిలిచి ఏం చెప్పారంటే.?
డూపు లేకుండా చేశారు
ఇక ఒక సినిమా కోసం హీరోలు ఎంత కష్టపడతారు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సాధించుకున్నాడు. బిల్లా సినిమా చేసిన తరుణంలో కార్ చేజింగ్ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ అన్నీ కూడా డూప్ లేకుండా ప్రభాస్ చేశాడు అని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు దర్శకుడు మెహర్ రమేష్. మామూలుగా హీరో డూప్, ప్రొఫెషనల్ డ్రైవర్స్ అలాంటి చేజింగ్ లు చేస్తూ ఉంటారు. కానీ సినిమా నేచురాలిటీ దెబ్బతినకుండా ఉండటానికి ప్రభాస్ ఆ రిస్క్ చేశారు. ఆ రిస్క్ అప్పట్లో పెద్దగా వర్కౌట్ కాకపోయినా కూడా తన కెరీర్ లో బాహుబలి సినిమా కోసం ఐదు సంవత్సరాలు కేటాయించడానికి ఫిక్స్ అయిన రిస్క్ మాత్రం అద్భుతంగా వర్కౌట్ అయింది.
Also Read : Kubera : వీళ్ళ కెరియర్ లోనే భారీ బడ్జెట్, వర్కౌట్ అయితే అదే సంతోషం