Brahmamudi serial today Episode: ఐశ్వర్య బయటకు వెళ్లిందని తను ఏదో చేయబోయి ఇంకేదో చేసి తన లైఫ్ స్పాయిల్ చేసుకుంటుందేమోనని తనకు భయంగా ఉందని ఇందుతో చెప్తుంది స్వాతి. నువ్వేం భయపడకు స్వాతి అంతా నేను చూసుకుంటాను అని ఇందు చెప్పగానే.. అదెలా సాధ్యం అవుతుంది అక్కా తను ఎక్కడికి వెళ్లిందో కూడా చెప్పలేదు నువ్వెలా కాపాడతావు అని స్వాతి అడిగితే..
తను ఎక్కడికి వెళ్లిందే నాకు తెలుస్తుంది అని ఇందు చెబితే ఏం చెప్తున్నావు అక్కా ఎలా తెలుస్తుంది అని స్వాతి అడిగితే తన ఫోన్‌లో జీపీఎస్ ట్రాకర్ ఆన్ చేసి ఉంది. ఈ మధ్య ఐశ్వర్య అక్క పార్టీలు, పబ్బులు అంటూ తిరుగుతూ డ్రింక్స్ చేస్తుంది కదా అందుకే తన సేప్టీ కోసమని తన ఫోన్‌లో జీపీఎస్ ఆన్ చేయమని బావకు చెప్పాను.. తను ఇప్పుడు ఎక్కడికి వెళ్లింది నేను చూస్తాను అని చెప్తుంది. అయితే వెంటనే చూసి వెళ్లి అక్కను కాపాడు అక్క అని స్వాతి చెబితే.. సరే స్వాతి నేను చూసుకుంటాను నువ్వేం టెన్షన్ పడకు అంటూ వెళ్లిపోతుంది ఇందు.
వెంకీ, నందుకు ఫోన్ చేస్తాడు. నందు హ్యాపీగా ఫీలవుతూ.. ఇందు అక్క చెప్పిందే నిజం అవుతుంది… నన్ను అవైడ్ చేయడం తప్పు అనుకుని కాల్ చేస్తున్నాడేమోనని కాల్ లిఫ్ట్ చేస్తుంది. వెంకట్, నందుతో కాస్త మాట్లాడాలి అని చెప్తాడు. నువ్వు చాలా బిజీ కదా నాతో మాట్లాడితే నీ టైం వేస్ట్ అవుతుంది కదా..? అని వెటకారంగా మాట్లాడితే.. వెంకీ సారీ నందు.. నేను మొన్న ఏదో టెన్షన్‌లో అలా మాట్లాడాను.. కానీ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పగానే.. నందు మనసులో నాకు తెలుసురా నువ్వు నాతో మాట్లడకుండా ఉండవలేని అనుకుంటూ..
సరే కలుద్దాం అంటూ కాల్ కట్ చేస్తుంది. వెంకట్ నందుతో కాల్ మాట్లాడి కట్ చేయడం మొత్తం చూసిన లక్ష్మీ దగ్గరకు వెల్లి వెంకీని ఓదారుస్తుంది. నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నావా..? అని అడుగుతుంది. వెంకీ అవునమ్మా అందుకే తనతో మొన్న అలా మాట్లాడావు.. అని చెప్పగానే.. మరి ఎందుకు మళ్లీ ఫోన్ చేశావు అని అడిగితే తన మనసులో ఉన్న నా స్థానాన్ని తుడిచేయాలి. తను నన్ను పూర్తిగా మర్చిపోయేలా చేద్దామని రేపు తనను కలుద్దామని చెప్పాను అంటాడు. లక్ష్మీ బాధపడుతూ వెంకీ ఓదారుస్తుంది.
లక్కీ, రాజు మందు తాగుతుంటారు. లక్కీ కోపంగా రాజును తిడుతుంటాడు. నాకేమీ అర్తం కావడం లేదురా..? ఒక్కటి మాత్రం నాకు అర్థం అయింది. అందరితో నేను అవమానపడ్డాను.. అప్పటికీ నేను చెప్తూనే ఉన్నాను కానీ నీకు మీ అమ్మ కావాలా వద్దా అంటూ నా నోరు మూయించావు. ఆ ఆంటోని గాడు మా గురించి చెప్తానంటే వాడు ఏం చెప్తే అది చేశాను. వాడు నన్ను మోసం చేశాడు. నువ్వు కూడా నన్ను ఆ ఆంటోనీ గాడిలా మోసం చేస్తున్నావా..? అంటూ లక్కీ నిలదీస్తే… రాజు కోపంగా రేయ్ నేను మోసం చేసే వాడిలా కనిపిస్తున్నానా..? నన్ను చూసి మాట్లాడరా..? అనగానే.. లక్కీ సారీ చెప్తూ.. అరేయ్ మావ నీకు మా అమ్మ గురించి తెలుసారా..? తెలిస్తే ఎవరో చెప్పరా..? ఎక్కడుందో చెప్పరా.. అంటూ బాధపడుతుంటే.. రేయ్ నేను మీ గురించి తెలుసుకునే ప్రాసెస్‌లోనే ఉన్నాను తెలుసుకున్న వెంటనే చెప్తాను.. ఇంకొన్ని రోజులు నేను చెప్పినట్టు చేయ్.. మీ అమ్మను తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను అంటూ ఓట్టేసి చెప్తాడు రాజు.
ఇంట్లోంచి బయటకు వచ్చిన ఇందు తన ఫోన్‌లో ఐశ్వర్య ఎక్కడికి వెళ్తుందో చూడాలనుకుంటుంది. కానీ ఐశ్వర్య తన ఫోన్‌లో జీపీఎస్ ఆఫ్ చేసి ఉంటుంది. అది చూసి ఇందు కంగారు పడుతుంది. ఇప్పుడేం చేయాలి అనుకుంటూ రాజుకు ఫోన్ చేస్తుంది. బావ ఎక్కడున్నావు అని అడిగితే.. ఫుల్లుగా మందు తాగిన రాజు ఇక్కడే ఉన్నాను మరదలా అంటాడు. ఇందు అనుమానంగా తాగావా..? అని అడిగితే.. తాగాను అయితే ఏంటి పేమెంట్ కట్ చేస్తావా..? అని అడిగితే అదేం లేదు బావ ముందు నేను చెప్పేది విను అనగానే.. రాజు నేను వినను ఇన్ని రోజులు నా తల బరువెక్కింది అందుకే కొంచెం మెడిసిన్ తీసుకుంటున్నాను.. ఇప్పుడే కాస్త రిలాక్స్ గా ఉన్నాను అంటూ కాల్ కట్ చేస్తాడు రాజు.
ఇందు వెంటనే నందు దగ్గరకు వెళ్లి ఐశ్వర్య గురించి చెప్తుంది. మనం తొందరగా వెళ్లి ఐషును కాపాడుకోవాలి అని చెప్తుంది. నందు మాత్రం నీ గురించి పట్టించుకోని దాని గురించి నువ్వెందుకు బాధపడతావు వదిలేయ్ అంటుంది నందు. ఇందు కోపంగా నందును తిట్టి తనను మనమే మార్చుకోవాలి అని చెప్పగానే.. నందు సోషల్ మీడియాలో చెక్ చేసి ఐషు, శశికి కామన్ ఫ్రెండ్ రేణును కనిపెడుతుంది. అప్పుడే స్వాతి వచ్చి రేణు గురించి తనకు తెలుసని తన ఎక్కుడుంటుందో తెలుసని చెప్పి లోకేషన్ షేర్ చేస్తుంది. ఇందు, నందు ఇద్దరు కలిసి రేణు దగ్గరకు బయలుదేరుతారు.
ఐశ్వర్య, శశి దగ్గరకు వెళ్తుంది. బొకే ఇస్తూ.. బర్తుడే విషెస్ చెప్తుంది. ఇంకా ఏమైనా చెప్పేది ఉందా అని శశి అడిగితే.. తర్వాత చెప్తాను ఒకసారి కళ్లు మూసుకో అంటూ చెప్పగానే.. శశి కళ్లు మూసుకుంటే ఐశ్వర్య రింగ్ తీసి శశి వేలికి తొడుగుతుంది. శశి మనసులో మొత్తానికి పూర్తిగా నా వలలో పడిపోయావు ఇవాళ నీ అందం మొత్తం నాకే సొంతం అని అనుకుంటూ నవ్వుతాడు.. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.