E-Paper
Advertisement

చిగురుటాకులా వణికిన కొలంబియా.. భారీ భూకంపంతో కకావికలం, 110 మంది మృతి

చిగురుటాకులా వణికిన కొలంబియా.. భారీ భూకంపంతో కకావికలం, 110 మంది మృతి
Advertisement

Earthquake: దక్షిణ అమెరికాపై ప్రకృతి కన్నెర్ర చేస్తోంది. ఓ వైపు అగ్నిపర్వతాలు బద్దలుకావడం.. మరోవైపు భూకంపాలతో ఆ ఖండం అతలాకుతలం అవుతోంది. తాజాగా కొలంబియాను భారీ భూకంపం వణికించింది. భయంకరమైన భూకంపం దాటికి ఆ దేశం విలవిలలాడింది. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో అక్కడి ప్రజలు కళ్లారా చేశారు. తమను తాము కాపాడుకోలేక కొందరు, అయినవాళ్లు కళ్ల ముందు భవనాల్లో కూరుకుపోయారు. ఈ భూకంపం దాటికి ఇప్పటివరకు 110 మృతి చెందారు. ఈ సంఖ్య వేలకు చేరుకోవచ్చని అక్కడి అధికారులు చెబుతున్నారు.

దక్షిణ అమెరికాను వణకించిన భూకంపం

సోమవారం కొలంబియాను భారీ భూకంపం వణికించింది. పశ్చిమ కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రత నమోదు అయ్యింది. భూకంపం ధాటికి ఆస్తి, ప్రాణ నష్టం భారీగా జరిగింది. వేలాది భవనాలు కళ్ల ముందు కుప్పకూలాయి. కొన్ని ప్రాంతాల్లో భవనాలు దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు అందుతున్న సమచారం మేరకు 110 మంది మరణించారు. ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారుల అంచనా.

Advertisement

 

భూకంపం ధాటికి కొలంబియా కకావికలం

యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. ఈ భూకంపం అక్కడి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.34 గంటలకు సంభవించింది. కొలంబియాలోని శాన్ జోస్ డెల్ పాల్మార్‌కు తూర్పున సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రాంతంలో కేంద్రాన్ని కనుగొన్నారు. ఈ భూకంపం సుమారు 107 కిలోమీటర్ల లోతులో సంభవించింది. అందువల్ల తీవ్రత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. కొలంబియాలోని అనేక ప్రాంతాలలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

Advertisement

 

విమాన సేవలకు అంతరాయం

భూకంపం ధాటికి కొలంబియాలోని అనేక ప్రాంతాలలో విమాన, రోడ్ల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానయాన అధికారుల ప్రకారం.. పెరీరా, మనిజాలెస్, క్విబ్డో, అర్మేనియా, కార్టాగో, బ్యూనవెంచురాలోని పలు విమానాశ్రయాలు దెబ్బతిన్నాయి. విమానాల తనిఖీలు నిర్వహించే వరకు విమాన సర్వీసులను నిలిపివేశారు. ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో ఉండిపోయారు. జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి జాతీయ విపత్తు ప్రమాద నిర్వహణ విభాగం స్థానిక అధికారులతో కలిసి పని చేస్తోంది.

 

ఇప్పటివరకు 110 మంది మృతి.. ఇంకా పెరిగే ఛాన్స్

ఈ శక్తివంతమైన భూకంపం వల్ల ఈక్వెడార్, పనామా, వెనిజులాలో భూప్రకంపనలు చోటు చేసుకుంది. కొలంబియాతో పోల్చితే అక్కడ నష్టం చాలా తక్కువ.భూకంపానికి సంబంధించి జరిగిన నష్టం వివరాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. కాలి సిటీలో కనీసం 20 భవనాలు కూలిపోయాయి. అనేకమంది భవనాల్లో చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని కాలి మేయర్ అలెజాండ్రో ఎడర్ తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రెస్క్యూ బృందాలు ఘటనా స్థలంలో పని చేస్తున్నాయని తెలిపారు.

ప్రజలకు సురక్షితంగా అనిపించకపోయినా, భవనాలు పెద్ద పగుళ్లు ఏర్పడినా ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని హెచ్చరించారు. భూకంపం క్విబ్డో ప్రాంతంలో భవనాలకు భారీ నష్టాన్ని కలిగించిందన్నారు చోకో గవర్నర్ నుబియా కరోలినా కార్డోబా.  ఈ భూకంపం ధాటికి పెరీరా, క్విబ్డో, కాలి, మనిజాలెస్‌ సహా పలు నగరాలు ధ్వంసమయ్యాయి. ఆ దేశవ్యాప్తంగా దాదాపు 20 కి పైగా మునిసిపాలిటీలపై ప్రభావం చూపింది. గత దశాబ్దకాలంలో ఆ దేశంలో నమోదైన అత్యధిక తీవ్రత గల భూకంపంగా కొలంబియా భూగర్భ శాస్త్ర విభాగం చెబుతోంది. తొలి భూకంపం తర్వాత 2.8, 4.8 తీవ్రతతో రెండు ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. దీంతో మరిన్ని ప్రకంపనలు వస్తాయనే ఆందోళనలు ప్రజల్లో పెరిగాయి. జూన్ చివరిలో పొరుగు దేశం వెనిజులాలో భూకంపం ధాటికి దాదాపు 5 వేల మందికి పైగా మరణించారు. ఇప్పుడు కొలంబియా వంతైంది.

 

Related News

ఇరాన్ ఇష్యూలో ట్రంప్ వెనక్కి.. అణు ఒప్పందం లేకుండానే పుల్‌స్టాప్‌కు యత్నాలు, దీని వెనుక ఏం జరిగింది?

ఆగష్టు 12న నాలుగు ఖగోళ వింతలు.. ఆరు గ్రహాలు పరేడ్, అమావాస్యతోపాటు సూర్యగ్రహణం

రష్యా టు ఇండియా.. రైలు కనెక్టివిటీపై మాస్కో ప్రతిపాదన, అసలు కారణం అదే

అడవిలో కూలిన హెలికాప్టర్.. నలుగురి దుర్మరణం, ముగ్గురు టూరిస్టులు

మొజ్తబా ఖమేనీ బయటకు వచ్చారు.. ఇదిగో కొత్త వీడియో.. కొంతమందితో మాట్లాడుతూ

ట్రంప్ ప్రభుత్వం కొత్త పాలసీ.. టార్గెట్ H-1B వీసాదారులు, 60 రోజులు ఎత్తేసే అవకాశం

భారత్‌కు అమెరికా బిగ్ షాక్.. రష్యా నుంచి చమురు కొంటే 100% ట్యాక్స్.. బిల్లుకు సెనేట్ ఆమోదం!

Big Stories

Advertisement
×