E-Paper
Advertisement

Brahmamudi Serial Today August 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కొత్త నాటకం మొదలు పెట్టిన రాజ్‌ – అయోమయంలో పడిపోయిన కావ్య  

Brahmamudi Serial Today August 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కొత్త నాటకం మొదలు పెట్టిన రాజ్‌ – అయోమయంలో పడిపోయిన కావ్య  
Advertisement

Brahmamudi serial today Episode: ధాన్యలక్ష్మీ పైకి కావ్య దగ్గరకు వెళ్లి నేను పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించగలవా..? అంటూ ప్రాధేయపడుతుంది. దీంతో అయ్యో చిన్నత్తయ్యా మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి..? అంటుంది. దీంతో ధాన్యలక్ష్మీ అయ్యో కావ్య నిన్ను నేను ఎన్నటికీ భరించలేని మాట అనేశాను. అయినా నన్ను ఎలా క్షమించగలుగుతున్నావు కావ్య.. ఇంత గొప్ప మనసు ఎలా వచ్చింది నీకు అంటుంది. దీంతో చిన్నత్తయ్యా ఇంట్లో అందరూ మీలో కోపాన్ని చూశారు. కానీ నేను మీరు ఆ కోపంలో అప్పు మీద చూపిస్తున్న ప్రేమను చూశాను. ఒకప్పుడు అప్పను  మీరు ఈ ఇంటి కోడలిగా అసలు ఒప్పుకోలేదు. ఒక అత్తగా నా చెల్లెలి  కడుపులో పెరుగుతున్న మీ వారసుడిని మీరు పడుతున్న తపన ముందు ఆ కోపం ఏ పాటిది చెప్పండి అంటుంది కావ్య.

అయితే నువ్వు కూడా తల్లివి కాబోతున్నావు కావ్య. ఒక బిడ్డను కడుపులో మోస్తున్నావు.. కానీ అప్పులాగా నువ్వు ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావు. ఏ ఆడది అయినా ముందుగా తన భర్తకు చెప్పుకుంటుంది. కానీ నువ్వు మాత్రం కళ్ల ముందు భర్త కనిపిస్తున్నా…? ఆ నిజాన్ని తనకు చెప్పుకోలేక నీలో నువ్వే బాధపడుతూ ఇన్ని రోజులుగా ఎంత నరకాన్ని అనుభవించావో నాకు అర్థం అవుతుంది అంటూ ధాన్యలక్ష్మీ బాధపడుతుంది. దీంతో కావ్య చిన్నత్తయ్యా ఆ దేవుడు నా తలరాతను అలా రాసి ఉంటే మీరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి..

Advertisement

అయినా తెలిసి చేస్తే పాపం అవుతుంది. మీకు నిజం తెలియక అలా మాట్లాడారు. ఇందులో మీ తప్పేం లేదు చిన్నత్తయ్యా.. అనగానే కానీ నా మనసు ఒప్పుకోవడం లేదు కావ్య నేను చేసిన తప్పుకు నాకు శిక్ష పడాలి అనగానే.. సరే మీరు కోరుకున్నట్టు గానే మీకు శిక్ష వేస్తాను.. అనుభవించడానికి మీరు సిద్దంగా ఉంటారా..? అని కావ్య అడగ్గానే.. సరే నువ్వు ఏ శిక్ష వేసినా  అనుభవించడానికి రెడీగా ఉంటాను కావ్య చెప్పు ఏం చేయమంటావు అని ధాన్యలక్ష్మీ అడగ్గానే.. చిన్నత్తయ్యా అప్పును చూసుకున్నట్టుగానే నన్ను కూడా చూసుకుంటారా..? అప్పు మీద చూపిస్తున్న ప్రేమని నా మీద కూడా చూపిస్తారా..? అంటూ కావ్య ఎమోషనల్‌ అవుతుంది.

డోర్‌ దగ్గర నుంచి చూస్తున్న రుద్రాణి వీళ్ల ఓవరాక్షన్‌ చూడలేకపోతున్నానురా అంటుంది. నువ్వు ఒకటి అనుకుంటే ఇంకోకటి జరిగింది. రాజ్ కు నిజం తెలిసేలా చేసి వాణ్ని దూరం చేద్దామనుకున్నావు.. ఇప్పుడు ఆ విషయం ఇంట్లో వాళ్లకు తెలిసి కావ్యను నెత్తిన పెట్టుకుని చూసేలా ఉన్నారు. నువ్వు ఎన్ని ప్లాన్స్‌ వేసినా.. ఎన్ని  ప్రమాదాలు సృష్టించినా చివరికి కావ్యకే మంచి జరుగుతుంది అంటూ రాహుల్‌ చెప్పగానే.. ఇక జరగదురా..? అంటుంది రుద్రాణి. ఇంట్లో అందరికీ తెలిసిపోయాక ఇంక నువ్వేం చేయగలవు మామ్‌ అంటాడు రాహుల్. లేదురా యామిని ఇందిగా తన వైపు నుంచి నరుకొద్దాం అంటుంది రుద్రాణి.

Advertisement

మరోవైపు కావ్య మనసులో ఏముందో తెలుసుకోవాలంటే నేను డోస్‌ పెంచాలి. డోస్‌ పెంచాలి అంటే నేను అన్ని వదిలేసి అమెరికా వెళ్లిపోతున్నట్టు నాటకం ఆడాలి. అప్పుడు కావ్యకు నా మీద ప్రేమ ఉంటే నన్ను ఆపడానికి ప్లాన్‌ చేస్తుంది. అప్పుడు మరి నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారని అడగొచ్చు అనుకుంటూ తన ఫ్రెండ్‌కు కాల్ చేసి అమెరికాకి టికెట్‌ బుక్‌ చేయమంటాడు.  ఇక రుద్రాణి, యామినికి కాల్‌ చేసి ధాన్యలక్ష్మీ, కావ్యను క్షమించేసిందని ఇక ఆలస్యం చేయకుండా కావ్య ప్రెగ్నెంట్‌ అనే విషయం రాజ్‌కు చెప్పమంటుంది. యామిని  సరే అంటూ వెళ్తుంది. అక్కడే రాజ్‌ ఫోన్‌ చార్జింగ్‌ ఉంటుంది. అప్పుడే రాజ్‌ ఫోన్‌కు అమెరికాకు టికెట్‌ కన్‌ఫం అయినట్టు మెసేజ్‌ వస్తుంది. యామిని ఆ మెసేజ్‌ చూసి రాజ్‌ను అడుగుతుంది. అవునని ఇక కళావతి తనను లవ్ చేయడం లేదని అదంతా మర్చిపోవడానికే అమెరికా వెళ్తున్నట్టు రాజ్‌ చెప్పి వెళ్లిపోతాడు. వెంటనే ఈ విషయం రుద్రాణికి ఫోన్‌ చేసి విషయం చెప్తుంది యామిని.

మరుసటి రోజు అందరూ హాల్లో కూర్చుని ఉండగా రుద్రాణి  వచ్చి రాజ్‌ అమెరికా వెళ్లిపోతున్నాడట అని చెప్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. దీంతో అందరూ కావ్యను మీ మధ్య ఏమైనా గొడవ జరిగిందా అంటూ అడుగుతారు. రాజ్ పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే నేన వద్దని వారించాను అని చెప్తుంది కావ్య. దీంత అందరూ కలిసి ఎలాగైనా రాజ్‌ను ఆపాలని అనుకుంటారు. కానీ ఎవరు చెప్పినా రాజ్‌ వినడని కావ్యే వెళ్లి ఆపాలని చెప్తారు. దీంతో కావ్య బాధపడుతూ నేను వెళ్లి తీసుకొస్తాను కానీ నాకొచ్చిన కడుపు గురించి ఏం చెప్పాలి. ఈ నిజం చెబితే ఆయన ఆగుతారు. కానీ నిజం చెప్పాక ఆయన పరిస్థితి ఏంటి..? అంటూ కావ్య బాధపడుతూ పైకి వెళ్లిపోతుంది. ఇక ఇంద్రాదేవి, అపర్ణ ఇద్దరూ కలిసి రాజ్ ను ఆపడానికి వెళ్తారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×