BigTV English

Brahmamudi Serial Today August 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ను రెచ్చగొట్టిన యామిని – కావ్యను నిజం చెప్పమన్న రాజ్‌

Brahmamudi Serial Today August 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ను రెచ్చగొట్టిన యామిని – కావ్యను నిజం చెప్పమన్న రాజ్‌

Brahmamudi serial today Episode: వీలైనంత తొందరగా రాజ్‌ను వాళ్ల నుంచి తీసుకురావాలని అపర్ణ అంటుంది. కానీ ఇప్పుడు రాజ్‌, కావ్య మీద కోపంగా ఉన్నాడు ఎలా వస్తాడు అని స్వప్న అడుగుతుంది. దీంతో ఎలాగైనా వాడికి నచ్చజెప్పాలి అంటుంది అపర్ణ. ఎలా నచ్చజెప్తావు వదిన రాజ్‌ ఏమైనా చిన్న పిల్లాడా..? బుజ్జగించడానికి అంటుంది రుద్రాణి. అలాగని రాజ్‌ను అలాగే వదిలేయమంటావా..? అంటాడు ప్రకాష్‌.


అలాగని పట్టుకుని ఇంటికి తీసుకువస్తామా..? ఒకవేళ నువ్వు తీసుకొచ్చినా రాజ్‌ వస్తాడా..? అసలు రాడు. రాజ్‌ ఇప్పుడు ఈ ఇంట్లో అందరూ తనను మోసం చేశారన్న కోపంలో ఉన్నారు. ఆ కోపం పోవాలంటే దారి ఒక్కటే ఉంది. కావ్య ఇప్పుడు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి రాజ్‌ అని చెప్పాలి. అలా చెప్పాలంటే రాజ్‌ మరచిపోయిన గతం గురించి చెప్పాలి. అలా చేప్పే సిచువేషన్‌ లో ఉన్నామా..? సరే కొంచెం ధైర్యం చేసి చెబుదామంటే.. చెప్పిన తర్వాత పరిస్థిలులు ఎలా ఉంటాయో ఏమో కనీసం ఇప్పుడు కావ్యన అపార్థం చేసుకుని దూరం ఉంటున్నాడు.

అదే నిజం చెప్పాక మన అదృష్టం బాగోక అందరికీ దూరం అయితే అంటుంది. దీంతో ఇంద్రాదేవి కోపంగా రుద్రాణి అంటూ తిడుతుంది.  నేను ఎలాగైనా వాణ్ని దారిలోకి తెచ్చుకుంటాను. అవసరం అయితే కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వేరా అని చెప్తాను అంటుంది అపర్ణ. దీంతో కావ్య వద్దు అత్తయ్యా ఆయన మారకపోయినా పర్వాలేదు కానీ మీరేం నిజం చెప్పకండి. మా ఇద్దరిని ఒక్కటి చేసిన కాలమే మళ్లీ మమ్మల్ని కలుపుతుంది. అప్పటి వరకు ఎలా జరగాలని రాసి పెట్టి ఉంటే అలా జరగుతుంది. మీరు మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పి కావ్య వెళ్లిపోతుంది.


యామిని కోపంతో రగిలిపోతూ బావకు ఏమైనా జరిగితే నన్ను చంపేస్తానని వార్నింగ్‌ ఇచ్చి వెళ్లావు కదా..? ఇప్పుడు చూడండి బావను మీకు శాశ్వతంగా ఎలా దూరం చేయబోతున్నానో అని మనసులో అనుకుంటూ రాజ్‌ దగ్గరకు వెళ్తుంది. ఏంటి బావ ఇది నువ్వేదో బాధను మర్చిపోతావనుకుంటే.. నువ్వేంటి ఇలా మందుకు బానిస అయిపోతున్నావు అంటుంది. ఎంత తాగినా బాటిల్స్‌ అయిపోతున్నాయి కానీ బాధ మాత్రం పోవడం లేదు యామిని అంటాడు రాజ్‌. కానీ నిన్ను ఇలా చూస్తుంటే నాకు బాధగాఉంది బావ. ఎప్పుడో చిన్నప్పుడు బుక్స్‌ లో చదువుకున్నాను. పార్వతి వల్ల దేవదాసు పిచ్చోడు అయిపోయాడని.. ప్రేమిస్తే ఇంత పిచ్చిగా ఉంటారా అనుకున్నాను.. ఇప్పుడు నీ ప్రేమని చూశాకే నాకు అర్తం అయింది. అందుకే నీకొక సలహా చెబుదామని వచ్చాను బావ అంటుంది. ఏంటి యామిని అది అని రాజ్‌ అడగ్గానే.. నాకెందుకో నిన్ను కళావతి కూడా ప్రేమించింది అనిపిస్తుంది బావ అంటుంది.

నిజంగానే తను నన్ను ప్రేమించి ఉంటే ఇలా ఎందుకు మోసం చేస్తుంది యామిని. నన్ను ఎందుకు ఇంతలా బాధపెడుతుంది. ప్రేమించిన వాళ్లు బాధపడతారు కానీ బాధపెట్టరు యామిని. కళావతి గారి మనసులో నేను లేను అంటాడు. లేదని నువ్వెలా అనుకుంటున్నావు బావ. తను నిన్ను ప్రేమించి ఉండకపోతే ఎందుకు నువ్వు తన చుట్టు తిరిగినా ఊరికే ఉన్నది. అంటూ యామిని చెప్పగానే.. ఒక ఫ్రెండ్‌గా అదంతా చేశానని తనే చెప్పింది కదా అంటాడు రాజ్‌. దీంతో అదంతా అబద్దం బావ నేను ఒక ఆడపిల్లను కాబట్టి చెప్తున్నాను. కళావతి కచ్చితంగా నిన్ను ప్రేమించింది. ఇన్ని రోజులు తనకు కడుపు అని తెలియదు అందుకే నీతో అలా తిరిగింది. సడెన్‌గా ప్రెగ్నెన్సీ రాగానే ఇలా మారిపోయింది. అందుకే ఇప్పుడే వెళ్లు బావ నీ కడుపులో ఉన్న బిడ్డకు కారణం ఎవరో చెబితే నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ అడుగు అంటూ రాజ్‌ను రెచ్చగొడుతుంది. దీంతో రాజ్‌ ఈరోజే వెళ్లి అడిగేస్తాను ఆ నిజం ఏంటో తెలుసుకుంటాను అంటాడు రాజ్‌.

రాత్రికి పుల్లుగా తాగి దుగ్గిరాల ఇంటికి వెళ్తాడు. గట్టిగా ఓసేయ్‌ కళావతి ఎక్కడున్నావే రావే అంటూ పిలుస్తాడు. అందరూ వచ్చాక రాజ్‌ ఆవేశంలో నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్‌ అయిపోయాను అంటాడు. అందరూ షాక్‌ అవుతారు. నాకు తెలుసు నువ్వు కడుపుతో ఉన్నావని నాకు తెలుసు.. అయినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్‌ అయిపోయాను. నువ్వు నన్ను ఎంత మోసం చేసినా కడుపులో ఒక బిడ్డ పెరుగుతుందన్న నిజాన్ని దాచినా నీ మీద ప్రేమను చంపుకోలేకపోతున్నాను. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని కూడా నేనే అవుతాను. ఆ బిడ్డ బాద్యతను నేనే తీసుకుంటాను అంటాడు. రుద్రాణి షాకింగ్‌గా వీడేంటిరా ఇంత పెద్ద ట్విస్టు ఇచ్చాడు. అంటుంది. నాకు మాత్రం ఏం తెలుసు మమ్మీ అంటాడు రాహుల్‌.

కానీ ఒక్క కండీషన్‌ ఇప్పటి వరకు నువ్వేంటో నీ గతమేంటో.. నేను ఎప్పుడూ అడగలేదు. ఇక భవిష్యత్తులో కూడా అడగాలనుకోవడం లేదు. నీ మీద నమ్మకంతో లైఫ్‌లాంగ్‌ నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. అలా జరగాలంటే నాకో నిజం తెలియాలి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు..? నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావా..? లేకపోతే నువ్వే మోసపోయావా… ఈ రెండు ప్రశ్నలకు నాకు సమాధానం చెప్పు చాలు. కళ్లు మూసుకుని నీకు తాళి కట్టి జీవితాంతం నీకు తోడుగా నిలబడతాను అంటాడు రాజ్‌. ఇది కదా అసలైన ట్విస్టు అంటే దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి వీడే అని అది చెప్పలేదు. ఆ నిజం తెలిసే వరకు వీడు పెళ్లి చేసుకోడు.. అంటుంది రుద్రాణి. ఇప్పుడు అసలు కథ మొదలైంది మమ్మీ వీళ్లు అందరూ కలిసి ఇప్పుడు ఏం సమాదానం చెప్తారో చూద్దాం అంటాడు రాహుల్‌. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Illu Illalu Pillalu Today Episode: దూరమైన నర్మద, ప్రేమలు.. వేదవతికి దిమ్మతిరిగే షాక్.. భాగ్యం మాస్టర్ ప్లాన్?

Intinti Ramayanam Today Episode: అబద్దం చెప్పిన అక్షయ్.. పల్లవి, శ్రీయలకు పార్వతి షాక్.. అక్షయ్ వ్రతానికి వస్తాడా..?

Nindu Noorella Saavasam Serial Today August 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు కోసం త్యాగం చేసిన అమర్‌

GudiGantalu Today episode: ప్రభావతికి దిమ్మతిరిగే షాకిచ్చిన సత్యం.. రోహిణికి మీనా వార్నింగ్..

Intinti Ramayanam Akshay : ‘ఇంటింటి రామాయణం ‘ అక్షయ్ గురించి ఎవరికి తెలియని నిజాలు..!

Big Stories

×