Medipally News: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 5 నెలల గర్భిణి స్వాతి అంత్యక్రియలు ముగిశాయి. నిన్న రాత్రి స్వాతి మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి నేరుగా వికారాబాద్ జిల్లాలోని కామారెడ్డిగూడకు తరలించారు. అయితే ఇంటికి తీసుకెళ్లకుండా గ్రామంలోని స్మశానవాటికలోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఇంట్లో మిగిలిపోయిన స్వాతి మొండేన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం ఆదివారమే పోస్టుమార్టం నిర్వహించారు.
భారీ బందోబస్తు మధ్య స్వాతి అంత్యక్రియలు..
ఎలాంటి ఆందోళనలు, గొడవలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు పూర్తిచేశారు. మృతురాలు స్వాతి తలా, చేతులు, కాళ్లు లేకుండానే అంత్యక్రియలు ముగించారు. స్వాతి హత్యకు గురైనప్పటి నుంచి మహేందర్ రెడ్డి కుటుంబం పరారీలోనే ఉన్నారు.
రెండు రోజులుగా వెతికిన దొరకని శరీరభాగాలు..
మరోవైపు స్వాతి శరీరభాగాల కోసం మూసీలో వలలు, గేలాలతో విస్తృతంగా గాలిస్తున్నారు.వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రెండు రోజులుగా గాలిస్తున్నా ఫలితం లేకపోయింది. వరద ప్రవాహం తగ్గితే ఎక్కడో ఒక చోట శరీరభాగాలను పెట్టిన ప్లాస్టిక్ కవర్ గానీ, హంతకుడు విసిరేసిన బ్యాగు కానీ దొరుకుతుందని భావిస్తున్నారు. స్వాతి శరీరభాగాల కోసం మూసీలో వలలు, గేలాలతో విస్తృతంగా గాలిస్తున్నారు. ఒకవేళ మృతురాలి శరీర భాగాలు దొరక్కపోతే ఏం చేయాలి? అనే దానిపై ఉన్నతాధికారులు, న్యాయనిపుణుల సలహా తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
వివాహ బంధం క్రమంగా విచ్ఛిన్నమవుతోందా?
ఈ ఘటన గురించి తెలుసుకున్నాకా.. వివాహ బంధంపైనే ప్రశ్నలు తలెత్తేలా చేస్తున్నాయ్. అనుమానంతో.. భార్యని చంపేయడమేంటనే చర్చ మొదలైంది. ఈ కాలంలో.. వివాహ బంధం ఎంత సులువుగా తెగిపోతోందనే విషయాన్ని.. ఈ ఘటనలు రుజువు చేస్తున్నాయ్.
Also Read: దారుణం.. మూడేళ్ల కూతుర్ని చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి..
ఆధునిక సమాజంలో వివాహ బంధానికి విలువ లేదా?
ఆర్థిక సమస్యలు, కమ్యునికేషన్ లోపాలు, కుటుంబాల జోక్యం, నమ్మక ద్రోహం, వివాహేతర సంబంధాలు, మానసిక ఒత్తిళ్లు.. ఇలా అనేక కారణాలు.. జీవిత భాగస్వామిని చంపేలా చేస్తున్నాయ్. చాలా మంది దంపతులు.. తమ వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తినప్పుడు.. వాటిని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక.. తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారికి.. సరైన కౌన్సిలింగ్ దొరకక.. ఇలాంటి ఘోరాలకు పాల్పడుతున్నారు. మేడిపల్లిలో స్వాతి హత్య ఘటన.. విషాదం మాత్రమే కాదు. మన సమాజంలో పెరుగుతున్న అనేక సమస్యలకు ఈ ఘటన అద్దం పడుతోంది.
కాళ్లు, చేతులు, తల లేకుండానే స్వాతి అంత్యక్రియలు
పోలీసు బందోబస్తు మధ్య కామారెడ్డిగూడకు చేరుకున్న స్వాతి మృతదేహం
భర్త చేతిలో అత్యంత క్రూరంగా హత్య చేయబడిన స్వాతి
భారీ పోలీసు బందోబస్తు నడుమ ముగిసిన స్వాతి అంత్యక్రియలు https://t.co/g0LokO78Rr pic.twitter.com/tYUhlhBfOV
— BIG TV Breaking News (@bigtvtelugu) August 26, 2025