E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode August 7th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందుకు వార్నింగ్ ఇచ్చిన ఐశ్వర్య  

Brahmamudi Serial Today Episode August 7th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందుకు వార్నింగ్ ఇచ్చిన ఐశ్వర్య  
Advertisement

Brahmamudi serial today Episode: ఐశ్వర్యకు అప్పు ఇచ్చిన వ్యక్తి నేరుగా ఇంటికి రావడంతో అందరూ షాక్‌ అవుతారు. ఐషును పిలిచి ఆయనతో నిజంగానే అప్పు చేశావా అని అడిగితే ఐషు చేశానని చెప్తూ.. అప్పు ఇచ్చిన వ్యక్తిని తిడుతుంది. నేరుగా ఇంటికి రావడమేనా..? అంటూ కోప్పడుతుంది. అప్పు ఎందుకు చేశావని ఇందు అడిగితే.. ఇంట్లో వాళ్ల వల్లే తాను అప్పు చేశానని ముఖ్య కారణం ఇందునేనని చెప్తుంది. నాకు అవసరం ఉందని రేఖ ఆంటీని డబ్బులు అడిగితే లేవని చెప్పారు.. ఇందును అడిగినా తాను ఇవ్వలేదు అందుకే అప్పు చేశానని చెప్తుంది. దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తి మీరు మీరు ఏమైనా మాట్లాడుకోండి నా అప్పు ఎవరు తీరుస్తారు.. చెప్పండి అని అడగ్గానే.. రాజు మేమెందుకు ఇస్తాం నువ్వు ఎవరికి డబ్బులు ఇచ్చావో వాళ్లను అడగండి అని చెప్తాడు. అయితే కారు కీస్‌ ఇవ్వండి.. కారు పేపర్స్‌ తనఖా పెట్టి అప్పు తీసుకుంది అని ఆ వ్యక్తి చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు.

అపర్ణ కోపంగా ఏంటి రేఖ ఏం మాట్లాడవేంటి..? దాన్ని అతి గారాబం చేసింది నువ్వే కదా..? ఇప్పుడేం చేయాలో నువ్వే చెప్పు అనగానే.. రేఖ మౌనంగా ఉంటుంది. భ్రమరాంబ కల్పించుకుని రేఖను అడిగితే తనేం చెప్తుంది. ఇప్పుడు బాధ్యతలు తీసుకుంది ఇందునే కదా తననే చెప్పమను అనగానే.. రాజు కల్పించుకుని ఏంటి అత్తయ్యా అటూ ఇటూ తిప్పి నా పెళ్లాం మెడకే చుట్టాలి అనుకుంటున్నారా..? మాకేం సంబంధం లేదు ఇక్కడ అని చెప్పగానే.. సంబంధం ఉంది రాజు అంటూ ఇందు వెళ్లి డబ్బులు తీసుకొచ్చి అతనికిచ్చి కారు  పేపర్స్‌ తీసుకుని పంపిచేస్తుంది. కారు పేపర్స్‌ తీసుకుని ఇందు లోపలికి వెళ్తుంటే.. ఐశ్వర్య కోపంగా నువ్వేం నన్ను కంట్రోల్‌ చేయాలని చూడకు నా లైఫ్‌ ఎప్పుడూ నేను అనుకున్నట్టే ఉండాలి. మీరు అనుకున్నట్టు కాదు.. ఒకవేళ నువ్వు జోక్యం చేసుకోవాలని చూస్తే.. ఇంతకు మించి చేస్తాను అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది.

Advertisement

అప్పు ఇచ్చిన అంటూ ఇంటికి వచ్చిన వ్యక్తి దగ్గరకు వెళ్లి ఆయనకు కమీషన్‌ ఇరవై వేలు ఇచ్చి మిగతా డబ్బులు తీసుకుంటుంది ఐశ్వర్య. తన యాక్టింగ్‌ వల్లే ఇంత డబ్బు వచ్చిందని ఇంకో పది వేలు ఇవ్వమని అడిగితే.. ఆ ఇరవై వేలు ఇవ్వు.. తర్వాత పదివేలు ఇస్తాను అంటూ ఐషు చెప్పగానే.. ఆయన వెళ్లిపోతాడు. వెనక నుంచి లక్కీ అంతా గమనిస్తాడు. లక్కీని చూసి ఐశ్వర్య షాక్‌ అవుతుంది. లక్కీ దగ్గరకు వెళ్లి నువ్వింత కన్నింగ్‌ ఫెలో అనుకోలేదు.. నీలాంటి దాన్ని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు.. అనగానే.. అదేంటి ఇంతకు ముందు ఇందును డబ్బుల కోసమే మీ చేత కిడ్నాప్‌ చేయించాను మర్చిపోయావా..? అంటుంది. తన మాటలతో లక్కీని కూల్‌ చేసి కన్వీన్స్‌ చేసి ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు అని చెప్తుంది. చెప్పనని కానీ తనకు పార్టీ ఇవ్వాలని అడుగుతాడు. ఇస్తానని ఐశ్వర్య చెప్పగానే.. హ్యాపీగా ఫీలవుతాడు లక్కీ.

ఇందు, రాజు ఇద్దరూ ఐశ్వర్య గురించి ఆలోచిస్తారు. నువ్వెందుకు ఐశ్వర్య విషయంలో అంత డెప్త్‌గా తీసుకుంటున్నావు అని రాజు అడిగితే.. తను మా అక్క అందుకోసమే ఇలా చేస్తున్నాను అని ఇందు చెప్తుంది. అయితే దాని కన్నా ముందే మనం లక్కీని తన కొడుకేనని రేఖ ఆంటీ చెప్పేలా చేయాలనుకున్నాం కదా..? అది ముందు కంప్లీట్‌ చేయాలి అని చెప్తాడు రాజు. అసలు రేఖ నిజం ఒప్పుకుంటుంది అంటావా..? అని ఇందు అడిగితే.. ఏమో చూద్దాం.. మన ప్లాన్‌ ప్రకారం మనం చేద్దాం ఏమవుతుందో తర్వాత కదా అని రాజు చెప్పగానే.. సరే బావ ఇక మన నాటకం మొదలుపెడదామా..? అంటుంది. సరే అంటాడు రాజు.

Advertisement

ఇంటికి వచ్చిన నందు ఒంటరిగా చీకటి రూంలో కూర్చుని ఏడుస్తుంది. సేమ్‌ వెంకీ కూడా ఒంటరిగా కూర్చుని బాధపడుతుంటాడు. లక్ష్మీ వెళ్లి వెంకట్‌ను విషయం అడిగితే నందును తాను తిట్టిన విషయం చెప్తాడు. నందు గురించి బాధపడుతూ.. తన జీవితం అయినా హ్యాపీగా ఉంటుంది. అయినా జీవితంలో మనం ఆశపడ్డవి అన్ని దక్కుతాయా..? అంటూ ఏడుస్తుంటే.. లక్ష్మీ ఓదారుస్తుంది. మరోవైపు రాజు, లక్కీని పిలిచి రేపు నీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను.. నీకు పెళ్లి చేయబోతున్నాను నువ్వు వెళ్లి మంచిగా ప్రెషప్‌ అవ్వు అని చెప్తాడు. లక్కీ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతాడు. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×