E-Paper
Advertisement

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?
Advertisement

Sree Mukhi: అందాల తార శ్రీముఖి (Sree Mukhi) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకవైపు సినిమాలు, మరొకవైపు షోలు అంటూ బిజీబిజీగా గడిపేస్తున్న ఈమె.. అంతే అద్భుతంగా ఆ షోలను నడిపించడంలో ముందుంటోంది. అద్భుతమైన వాక్చాతుర్యంతో.. తనదైన కామెడీ టైమింగ్ తో పంచులు వేస్తూ అందరిని ఆకట్టుకుంటున్న శ్రీ ముఖి అనుకోకుండా అప్పుడప్పుడు ఇన్సల్ట్ కూడా అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏదో చేయబోయి బొక్క బోర్ల పడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటిదే ఇప్పుడు మరో సందర్భం అనే చెప్పాలి. బిగ్ బాస్ బోలే షావలి (Bigg Boss bhole shavali) ను ఒక ఆట ఆడుకుందాం అనుకుంది.. కానీ అతని దెబ్బకు సైలెంట్ అయిపోయిందని చెప్పాలి. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

బోలే రాక్.. శ్రీముఖి షాక్..

బుల్లితెరపై వరుస షోలతో సందడి చేస్తున్న శ్రీముఖి హోస్ట్ గా చేస్తున్న మరో షో ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’. తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని నిర్వహకులు విడుదల చేయగా.. ఫోక్ స్పెషల్ గా ఈ ఎపిసోడ్ ను నిర్వహించనున్నారు. ఇక ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమయ్యే ఈ లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని తాజాగా నిర్వహకులు విడుదల చేశారు. ఇందులో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రాము రాథోడ్, బోలె ఇద్దరూ తమ ఫోక్ సాంగ్ లతో అదరగొట్టేశారు. అమర్దీప్ ను ఆటపట్టించిన శ్రీముఖి ఆ తర్వాత బోలెతో మాట్లాడుతూ.. “బోలే అన్న.. అసలు ఈ ఆటకి మీరు ఏం చేయడానికి వచ్చారు?” అంటే ప్రశ్నించింది. వెంటనే బోలె “నువ్వు క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చెప్పడానికి నేను బిగ్ బాస్ కి రాలేదు “అంటూ తనదైన శైలిలో కౌంటర్ వేశాడు.

బోలే దెబ్బ.. శ్రీముఖి రియాక్షన్..

Advertisement

ఇకపోతే బోలె ఎప్పటిలాగే తనదైన శైలిలో షార్ప్ గా కౌంటర్ వేయడంతో శ్రీముఖి రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు బోలే అన్న మాటకు ఏం చెప్పాలో అర్థం కాక హాఫ్ స్మైల్ తో పక్కకు వెళ్ళిపోయింది శ్రీముఖి. ప్రస్తుతం శ్రీముఖికి కరెక్ట్ పర్సన్ దొరికాడు అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ:మా ఇంటి వాచ్‌మెన్ ఫోన్‌లో నా ఇంటిమేట్ సీన్స్.. నరకం చూశా – రాధిక ఆప్టే

సోలో సందడి చేసిన సంపూర్ణేష్ బాబు..

Advertisement

ఒకప్పుడు కొబ్బరి మట్ట, హృదయ కాలేయం వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన సంపూర్ణేష్ బాబు (Sampoornesh babu) తాజాగా నాని , శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాలో బిర్యానీ అనే క్యారెక్టర్ పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఆయన షోలో సందడి చేశారు. ఇక ఇందులో మాట్లాడుతూ.. “మళ్ళీ పదేళ్ల తర్వాత స్టార్ మా నన్ను గుర్తు పెట్టుకొని పిలవడం సంతోషంగా ఉంది” అంటూ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు సంపూర్ణేష్ బాబు. మొత్తానికి అయితే సినిమాలోని డైలాగులతో ,బాలయ్య బాబు డైలాగులతో ప్రోమోకి హైలెట్గా నిలిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.

Related News

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×