Gundeninda GudiGantalu Today episode September 24th : మనోజ్ షోరూంలో ఉండగా రోహిణి తన కోసమని బాక్స్ తీసుకుని వస్తుంది కానీ మనోజ్ మాత్రం రోహిణిని చూసి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు. అయితే రోహిణి మనోజ్ వెనకాలే నీకోసం జ్వరం వచ్చింది అని బాక్స్ తీసుకొని వచ్చాను అని అంటుంది. ఇన్ని రోజులు నేను ఉప్పు కారం లేకుండా నేను తిన్నాను కదా ఇప్పుడు ఏంటి కొత్తగా నాకోసం బాక్స్ తెచ్చావు అని అడుగుతాడు మనోజ్. మాట వినగానే రోహిణి మన ప్రేమ గురించి మర్చిపోయావా అంటూ మళ్లీ పాత రోజులను గుర్తు చేసే పనిలో ఉంటుంది. ఇక తర్వాత రోహిణి మనోజ్ కి తన మీద ఉన్న ప్రేమను తెలుసుకొని చాలా సంతోషంగా ఉంటుంది. మనిద్దరం సంతోషంగా ఉండాలి అంటే నువ్వు ప్రతి విషయాన్ని మీ అమ్మకు చెప్పడం ఆపేయాలి రోహిణి అంటుంది.
ప్రభావతి వంటగదిలో కుస్తీ పడుతూ ఉంటుంది. వంటగది తన మీద పగ పట్టింది అంటూ ప్రభావతి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఏవి ఎక్కడ ఉన్నాయి కూడా నాకు తెలియట్లేదు నేను నీకు అవ్వంటే ఏం చేస్తాను అని ఆలోచిస్తూ ఉండగా చేయి కోసుకుంటుంది. అయితే ప్రభావతి వంటగదిలో కష్టపడుతున్న సమయంలో కామాక్షి ఏంటి వదిన ముగ్గురు కోడలు వచ్చినా కూడా నువ్వు వంట గదిలో ఇంతగా కష్టపడుతున్నావు అని అంటుంది. దానికి ప్రభావతి ఆ మీనా కింద పడి దెబ్బలు తగిలించుకున్నాను అని చెప్పింది ఇవాల్టికి నేనే వంట చేయాలి అని అనగానే కౌంటర్ల వర్షం కురిపిస్తుంది.. కామాక్షి మాటతో ప్రభావతి ఇంకాస్త షాక్ అవుతుంది.. కామాక్షి వచ్చింది అని ప్రభావతి కాఫీ తెచ్చి ఇస్తుంది కానీ ఇలాంటి కాఫీ ని నేను ఎప్పుడు తాగలేదు అని ప్రభావతి అనగానే కామాక్షి నిజంగానే చాలా బాగా ఉంది వదిన ఇలాంటి కాఫీ ని నేను కూడా ఎప్పుడు పెట్టలేదు అని అంటుంది.
కామాక్షి మీనా అని పిలవగానే తను వచ్చి ఏమైంది? ఏంటి పిన్ని ఇలా వచ్చారు అని అడుగుతుంది. నీ చేతిలోని డబ్బులు లాక్కొని వెళ్లి నిన్ను తోసేసి కింద పడేసారంట కదా అది తెలుసుకొని నిన్ను చూద్దామని వచ్చానమ్మా వాళ్ళ చేతులు ఊడిపోతాయి నిన్ను ఇలా చేసిన వాళ్ళు నాశనం అయిపోతారు అంటూ కామాక్షి శాపాలు పెడుతుంది. అయినా నువ్వు ఇంట్లో నుంచే వెళ్లావు కదా నీ చేతిలో డబ్బులు ఉన్నాయన్న సంగతి అక్కడక్కడ పుట్టిన దొంగలకు ఎలా తెలిసి ఉంటుంది ఎవరో కావాలని ఇదంతా చేసారు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. తనే చెప్పింది అని తెలిసిపోతుంది అని ప్రభావతి కూడా కంగారు పడిపోతూ ఉంటుంది. నీ దగ్గర తీసుకున్న వాళ్ళు ఎవరు బాగుపడరులే మీనా.. నాశనం అయిపోతారు నీ గురించి చెప్పిన వాళ్ళు వాళ్లకు పుట్టగతులు ఉండవు అంటూ కామాక్షి అనడంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకిలా మాట్లాడుతున్నావు వాళ్ళు ఎవరో వాళ్ళ పాపని వాళ్ళు పోతారులే నువ్వు గమ్మునుండు అనేసి అంటుంది ప్రభావతి.
ప్రభావతి ఈ కామాక్షి నన్ను ఇరికించేలా ఉంది దీని నుంచి ఎలాగైనా సరే మనం దూరంగా ఉండాలి అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత కామాక్షి వెళ్ళిపో కానీ బాలు ఆ డెకరేషన్ కోసం అని మీనా అని పిలిచిన చోటికి వెళ్తాడు. అక్కడ చింతామణి డబ్బులు కట్టేసింది ఇంకా ఎటువంటి అవకాశం లేదు అని చెప్పగానే బాలు షాక్ అవుతాడు. నిజంగా బాలు మీనాక్షి ఎలా జరగడం చాలా బాధగా ఉందండి ఎవరో ఇదంతా కావాలని చేశారు అని అనగానే తనకి చింతామణి మీద అనుమానం ఉన్న విషయాన్ని కన్ఫామ్ చేసుకుంటాడు. ఇదంతా చేసింది చింతామణిని అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత బాలు చెప్పిన విషయాలను మీ నాకు తెలియకూడదు అని అనుకుంటాడు.. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది సస్పెన్స్ గా మారింది.
మీనా పువ్వులు కడుతూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అయితే అప్పుడే ఇంట్లోకి వచ్చిన బాలువు అక్కడ పువ్వులే లేవు దేనికి కడుతున్నావు అని అడుగుతాడు. ఆ మాట వినగానే బాలు చూసి మీనా ఏమో అండి నాకు ఏమీ ఆలోచన రావడం లేదు అని చెప్తుంది. మనం ఎంతగా ఆలోచించినా సరే రోహిణి వీళ్ళిద్దరి సంతోషాన్ని చూసి కుళ్ళుకొని లోపలికి వెళ్ళిపోతుంది. మనోజ్ నీ మనిద్దరం సంతోషంగా ఉన్నాము అని అడిగితే నువ్వు చేసిన పనికి నీతో ఉండాలని లేదు. కాకపోతే ఇంటి పరువు పోతుందని ఉంటున్నాను అని మనోజ్ అంటాడు. ఆ మాట వినగానే రోహిణి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ప్రభావతి అలాగే సత్యం మీనా బాలు ను చూసి చాలా సంతోషంగా ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..