Podarillu Today Episode September 24th :ఇక చక్రి మహాలక్ష్మి కి తనకు ఇష్టం ఉంది అని అందుకే విడాకులు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు అని చాలా సంతోషంగా ఉంటాడు చక్రి. బయటికి వచ్చి కేశవాణి తీసుకొని బాగా డాన్స్ చేస్తాడు. కేశవా ఎంతగా వద్దురా అని చెప్తున్నా సరే అసలు వినకుండా డాన్స్ చేస్తూ అడ్డంగా మహాలక్ష్మికి దొరికిపోతాడు. మహాలక్ష్మి ఏంటి ఈ సంతోషానికి ఏంటి కారణం అని అడుగుతుంది. నా గోపిక ఫోన్ చేసింది మాట్లాడుతున్నాను అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ చక్రి అబద్ధం చెప్పేస్తాడు. కానీ మహాలక్ష్మి మాత్రం చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక మొత్తానికి చక్రి మహాలక్ష్మి దెబ్బకు కాస్త భయపడిన కూడా తన ప్లాన్ సక్సెస్ అయింది అని సంతోషంగా ఉంటాడు..
మాధవ్ రాత్రిపూట అందరూ భోజనం చేయడానికి సిద్ధం చేస్తాడు. అయితే భోజనం దగ్గరకు రాగానే ఇంట్లోని వాళ్ళందరూ కూడా మాధవ్ ను ఒక ఆట ఆడుకుంటారు.. మాధవ్ మనిషి భోజనం తీసుకొని రావడం వెనక ప్రేమని అర్థం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. మనీషా కొసరి కొసరి వడ్డించడంతో మాధవ దాని గురించి చెప్పి చాలా సంతోషంగా ఉంటాడు ఆ విషయం తెలుసుకున్న ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఒక ఆట ఆడుకుంటారు.. ఇక మొత్తానికి మనీషా మాధవ్ లవ్ ట్రాక్ స్పీడ్ అవుతుంది. ముగ్గురు మగాళ్లు కూడా గర్ల్ ఫ్రెండ్ ల విషయంలో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా మహాలక్ష్మి వచ్చి ముగ్గురికి దిమ్మ తిరిగిపోయిన షాక్ ఇస్తుంది.
ఇంట్లోనే ఉన్న మగవాళ్ళు అందరూ కూడా తమ గర్ల్ ఫ్రెండ్ లతో ఫోన్ మాట్లాడుకుంటూ ఉండగా కన్నా అక్కడికి వచ్చి వదిన అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఫోన్లు మాట్లాడుకుంటున్నారు నాకు మాత్రం లేదు అని అనగానే ఒక్కసారిగా రెచ్చిపోతుంది మహాలక్ష్మి. కర్ర తీసుకొని వచ్చి కన్నాతో పాటుగా చక్రీని అలాగే కేశవని కూడా కొట్టేస్తుంది.. ఎందుకు కొడుతున్నారు అని ఎంతగా అడుగుతున్నా సరే చెప్పకుండా అందరూ ఫోన్లు మాట్లాడుకుంటున్నారా చిన్న పిల్లల్ని చెడగొడుతున్నారా అంటూ మహాలక్ష్మి అనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు. ముఖ్యంగా చక్రి గోపికతో మాట్లాడడం చూసి మహాలక్ష్మి ఇంకా కోపంగా కొట్టేస్తుంది. అయితే అటు కేశవ కూడా దెబ్బలు పడడంతో ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా అలర్ట్ అవుతారు..
మహాలక్ష్మికి అందని కొడుతుంది అని ముందుగా నారాయణ పడుకుంటాడు. ఇక మాధవ్ కూడా ఫోన్ పెట్టేసి లోపలికి వెళ్లి పడుకుంటాడు. అయితే చక్రి అలాగే కన్నా కూడా పెళ్లి మహా ఎక్కడ కొడుతుంది అని భయంతో పడుకుంటారు.. అయితే మహాలక్ష్మి చక్రి కొడుతుంది అని మాధవ్ కు చెప్తాడా? అయితే కేశవా అడ్డంగా దొరికిపోయాడు. వాడి పని ఈరోజు అయిపోయినట్టే అని చక్రి అనగానే ఇక కేశవ కూడా మహాలక్ష్మి దగ్గర సారీ అండి మీకు క్షమించండి నేను ఇంకెప్పుడు ఫోన్ మాట్లాడను అని ఎంతగా బతిమలాడిన కూడా మహాలక్ష్మి అసలు వినదు. అయితే కేశవ ఇంకెప్పుడూ ఫోన్ మాట్లాడడని చెప్తాడు. అయితే కేశవ దొరికిపోయాడు అని నారాయణ నవ్వుకుంటూ ఉంటాడు. అటు కేశవ దొరికిపోయాడు అని నారాయణ అనుకుంటాడు కానీ చివరికి మహాలక్ష్మి నారాయణ నువ్వు ఒక సీరియస్గా చూస్తుంది అక్కడితో కేశవ నేను ఇంకెప్పుడు ఫోన్ మాట్లాడను అని లోపలికి వెళ్ళిపోతాడు.
మాధవ్ లోపలికి వెళ్లిన తర్వాత ఉదయం లేవగానే మహాలక్ష్మికి క్షమించమ్మా నేను కావాలని మాట్లాడలేదు. మనిషా ఫోన్ చేస్తేనే మాట్లాడాను అని చెప్తాడు. అయితే మాధవ్ అనడంతో మహాలక్ష్మి మిమ్మల్ని అనలేదు పెద్ది. మీరు మాట్లాడుతున్నారని కాదు వీడు నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదు అని చాలా ఫీల్ అవుతున్నాడు అందుకే నేను అలా అన్నాను అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు అని మహాలక్ష్మి అంటుంది. చక్రీ అమ్మాయి తో మాట్లాడటం కూడా మీకు కోపంగా ఉంది కదా అని మాధవ అడుగుతాడు నాకేం కోపం లేదు పెద్ది తను ఎవరితో మాట్లాడుకుంటే నాకెందుకు అని అంటుంది.. ఇక పెద్ది కి చెప్పి కన్నా మహా ఇద్దరు కూడా స్కూటీ మీద బస్టాప్ కి వెళ్ళిపోతారు.
మహా కన్న ఇద్దరు బస్ స్టాప్ కి రాగానే అక్కడే ఉన్న గోపిక చక్రి ఇంకా రాలేదేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. చక్రి ఇంకా రాలేదు కదా ఒకసారి మహాలక్ష్మిని అడిగితే బాగుంటుందని సత్య సలహా ఇవ్వడంతో మహా అక్కడికి వస్తుంది. అయితే మహాలక్ష్మి దగ్గరికి వచ్చిన గోపిక చక్రి ఎందుకు రాలేదు అని అడుగుతుంది అప్పటికే కాలుతున్న మహా మీ దగ్గర ఫోన్ ఉంది నెంబర్ ఉంది కదా చేసుకోవచ్చు కదా.. మీరు చక్రి తో పాటు వాళ్ళింట్లో నుంచి వస్తుంటారు కదా చక్రీకి మీరు ఏమవుతారు పక్కనే కదా అని గోపిక అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది మహాలక్ష్మి. ఇక కాదు అత్త అనేసి కోపంగా అనడంతో గోపిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత వెంటనే చెక్రి రావడంతో కన్నా కచ్చితంగా దొరికిపోయాడు అని అనుకుంటూ ఉంటుంది. మహాలక్ష్మిని రెచ్చగొట్టిన చక్రి గోపికతో మాట్లాడడం చూసి చాలా కోపంగా ఉంటుంది. అయితే చక్రి చాలా కోపంగా ఉండడం చేసిన మహాన్నీ ఇంకా రెచ్చగొడతాడు . అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..