Oil Companies Daily Losses: ఆయిల్ కంపెనీలు ధరలు పెంచేందుకు కంపెనీలు రెడీ అవుతున్నాయా? ప్రతీ రోజూ వందల కోట్లు నష్టాలు వస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయా? ఈ నేపథ్యంలో అక్టోబర్ నెలలో ఆయిల్ ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయా? నాలుగైదు రూపాయాలు పెరిగే ఛాన్స్ ఉందా? అవుననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు.
అంతర్జాతీయ మార్కట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్యారెల్ ధర 100 డాలర్లు అటు ఇటు మధ్య ఊగిసలాడుతోంది. ముడి చమురు ధరల్లో వచ్చిన భారీ పెరుగుదల దేశంలోని ప్రభుత్వ రంగ చమురు కంపెనీల ఆదాయాలపై కనిపిస్తోంది. రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ ప్రకారం.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలు రోజుకు రూ.530 కోట్లు నష్టపోతున్నాయి. ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్‌పై లీటరుకు సుమారు రూ.8, డీజిల్‌పై లీటరుకు సుమారు రూ.9 నష్టాన్ని చవిచూస్తున్నాయి. దేశీయ మార్కెట్లో పెట్రోల్-డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ పెరుగుతున్న ముడి చమురు ధరలు ఆయా కంపెనీల మార్జిన్లపై పడుతున్నాయి.
మూడు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పిసీఎల్ సంస్థలు రోజువారీ నష్టం సుమారు రూ. 530 కోట్లకు చేరవచ్చని ఐసీఆర్ఏ అంచనా. ముడి చమురు ధరలు అధికంగా ఉన్నప్పుడు దేశీయ ఇంధన ధరలలో మార్పు లేకపోతే కంపెనీలపై ఒత్తిడి పడుతుంది. దేశీయ ఎల్‌పిజి కంపెనీలకు ఆందోళన కలిగిస్తోంది. సెప్టెంబర్‌లో ప్రతి దేశీయ ఎల్‌పిజి సిలిండర్‌పై సుమారు రూ. 300 మేర వసూళ్లు తగ్గుతాయన్నది ఓ అంచనా.
ముడి చమురు ధరల పెరుగుదలకు పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, సరఫరా సమస్యలు, అమెరికా-ఇరాన్ ఘర్షణ తీవ్రతరం కావడం, సౌదీ అరేబియా తూర్పు-పశ్చిమ పైప్‌లైన్ మూసివేత, ఎర్ర సముద్ర ప్రాంతంలో హౌతీల కార్యకలాపాలు చమురు సరఫరాపై ఆందోళనలను పెంచినట్టు ఆ సంస్థ సారాంశం. దేశీయంగా దిగుమతి చేసుకునే ముడి చమురు బాస్కెట్ ధర 2025-26లో బ్యారెల్‌కు సుమారు 66 డాలర్లు ఉండేది. సెప్టెంబర్ 21, 2026 నాటికి బ్యారెల్‌కు 117 డాలర్లకు చేరింది. రిఫైనింగ్ మార్జిన్లు ఇంకా పూర్తిగా బలహీనపడలేదు.
ఐసీఆర్ఏ ప్రకారం.. పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి సింగపూర్ స్థూల రిఫైనింగ్ మార్జిన్లు బ్యారెల్‌కు 10 డాలర్లు కంటే స్థిరంగా ఉన్నట్లు చెబుతోంది. రిఫైనరీల మూసివేతల కారణంగా ఏర్పడిన సరఫరా పరిమితులు, నిల్వల కొరత రిఫైనింగ్ మార్జిన్లకు మద్దతునిచ్చాయి. ఎల్‌పిజి రంగంలో ఒత్తిడి మరింత పెరిగింది. 2026 జూన్ 30 నాటికి దేశీయ ఎల్‌పిజి సుమారుగా రూ. 61,940 కోట్లకు చేరుకుంది. ఐసీఆర్ఏ ప్రకారం.. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశీయ ఎల్‌పిజిపై ప్రతి సిలిండర్‌పై నష్టం సుమారు రూ. 500గా ఉంది.
ALSO READ: చదివింది ఇంటర్మీడియట్ మాత్రమే.. కట్ చేస్తే నేడు వేల రూ.కోట్లకు అధిపతి
సెప్టెంబర్‌లో సుమారు రూ. 300గా అంచనా. డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పై విధించిన ఎగుమతి సుంకాలు కంపెనీల వ్యయం, నగదు ప్రవాహ సమీకరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి నష్టాల నుంచి గట్టెక్కేందుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే ద్రవ్యోల్భణంపై ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నాయి. మరో ఆరు నెలలో కొత్త నెల రాబోతోంది. మరి దేశీయ ఆయిల్ కంపెనీలు ఏం చేస్తాయో చూడాలి.