Gautam Gambhir On Vaibhav vs Sanju Samson: టీమిండియా కుర్రాళ్లు వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టీ20 సందర్భంగా సంజు శాంసన్ ను పక్కకు పెట్టి, వైభవ్ సూర్యవంశీని చాలా బలవంతంగా ఆడించానని వెల్లడించారు. దీంతో ఆ రోజున తనకు నిద్రకూడా పట్టలేదని షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు గౌతమ్ గంభీర్. సంజు శాంసన్ లాంటి ప్రపంచ కప్ హీరోను పక్కకు పెట్టడం అతి పెద్ద నిర్ణయం అన్నారు. కానీ, అప్పటి పరిస్థితుల నేపథ్యంలో వైభవ్ ను బరిలోకి దించామని వెల్లడించారు. తన కెరీర్ లో అత్యంత కఠినమైన నిర్ణయం ఇదేనని వ్యాఖ్యానించారు గంభీర్. దీంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య ఇటీవలే 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో చెత్త ప్రదర్శన చేసిన టీమిండియా ఘోరంగా ఓడిపోయి, సిరీస్ కోల్పోయింది. అయితే, ఈ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీని ఆడించాలని చాలా డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలోనే రెండో టీ20 సందర్భంగా సంజును పక్కకు పెట్టి, వైభవ్ ను తీసుకొచ్చారు గంభీర్. ఈ నిర్ణయంపై తాజా గంభీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సంజును కాదని వైభవ్ ను తీసుకోవడం కఠినమైన నిర్ణయమన్నారు. ఈ నిర్ణయం తనకు నిద్రలేకుండా చేసిందని గంభీర్ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. వరల్డ్ కప్ హీరోగా మారిన సంజును పక్కకు పెట్టాలని ఒత్తిళ్లు రావడంతో వైభవ్ ను తీసుకువచ్చినట్లు వివరించారు. ఆ నిర్ణయం తీసుకున్న రోజున అసలు, తనకు నిద్రపట్టలేదన్నారు. మళ్లీ సంజును తర్వాతి మ్యాచ్ లలో తీసుకొచ్చినట్టు తెలిపారు. దీంతో వైభవ్, సంజు ఎపిసోడ్ పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
సంజు శాంసన్ చాలా అనుభవం ఉన్న ఆటగాడు. మ్యాచ్ పరిస్థితులను బట్టి, ఆడతాడు. ఓపిక ఎక్కువ. జట్టుకు అవసరమైన సమయంలో ఇరదీసి, టీ20 వరల్డ్ కప్ తరహాలో రెచ్చిపోతూ ఉంటాడు. వికెట్ కీపర్ గా పనికి వస్తాడు. అదే వైభవ్ కు అనుభవం పెద్దగా లేదు. సిక్సర్లు కొట్టడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతడు టీమిండియా పూర్తి స్థాయిలో సభ్యుడిగా ఉండాలంటే కాస్త సమయం పడుతుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. టీమిండియా టీ20 ఓపెనర్ గా సంజు అయితేనే బెటర్ అంటున్నారు. అభిషేక్, సంజు ఓపెనర్లుగా దిగితే, లెఫ్ట్ అండ్ రైట్ కాంబో అదిరిపోతుందని స్పష్టం చేస్తున్నారు. అభిషేక్ స్థానంలో వైభవ్ వచ్చినా పర్లేదని పేర్కొంటున్నారు కానీ సంజును పక్కకు పెట్టొద్దని పేర్కొంటున్నారు.