E-Paper
Advertisement

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..
Advertisement

Nirupam Paritala : ఒకప్పుడు సినిమా హీరోలను చూడ్డానికి జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవారు. కానీ ఈ మధ్యకాలంలో సినిమా హీరోల కన్నా సీరియల్ హీరోలకు మంచి డిమాండ్ ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గత కొద్ది రోజులుగా సినిమా హీరోల కన్నా ఎక్కువగానే సీరియల్ హీరోలు సోషల్ మీడియాలో బిజీగా ఉండడంతో వీళ్లకు ఉన్న క్రేజ్ రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్లలో ఎక్కువగా వినిపించే పేరు డాక్టర్ బాబు అలియాస్ నిరూపం పరిటాల.. కార్తీకదీపం సీరియల్ తో మంచి క్రేజ్ను సంపాదించుకున్న ఈ హీరో గురించి సోషల్ మీడియాలో ఏ చిన్న వార్త వచ్చినా ఇట్టే వైరల్ అవుతూ వస్తుంది. ఇటీవల కాలంలో డాక్టర్ బాబు ఏం చేసినా కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఈయన షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతుంది.. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

మంచుకొండల్లో డాక్టర్ బాబు కేక..

బుల్లితెర హీరో నిరూపమ్ పరిటాల గురించి  ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. సినిమాల్లో నటించి నటుడు గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బుల్లితెర పై వరుసగా అవకాశాలు అందుకుంటూ సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. సీరియల్ హీరోలు లేదా హీరోయిన్లు ఈమధ్య సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు డిఫరెంట్ లొకేషన్ లోకి వెళుతూ ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు. తాజాగా కార్తీకదీపం ఫేమ్ హీరో నిరూపం పరిటాల మంచు కొండల్లో దిగిన ఫోటోలను అలాగే ఒక వీడియోను షేర్ చేశారు. బ్లాక్ అండ్ బ్లూ జీన్స్ లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకొని అదిరిపోయే లుక్కులో కనిపించడంతో బుల్లితెర అభిమానులు తమ హీరో చాలా బాగున్నాడు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఇక అమ్మాయిలు ఏమున్నాడు రా బాబు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లతో వీడియోని మరింత ట్రెండ్ ఎలా చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అందులో డాక్టర్ బాబు ఎలా ఉన్నాడు మీరు కూడా ఒకసారి చూసేయండి..

Advertisement

?stkn=bHA3aWZsMXQ2cDJr

డాక్టర్ బాబు సీరియల్స్ విషయానికొస్తే..

బుల్లితెర పై టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న హీరోలల్లో నిరూపమ్ పరిటాల ఒకరు. గతంలో ఎన్ని సీరియల్స్ చేసినా కూడా కార్తీకదీపం వచ్చిన ఫేమ్ ఏ సీరియల్ కు రాలేదు. అతనికి సీరియల్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఒక్కో సీరియల్ తో తన క్రేజ్ ని పెంచుకుంటూ వచ్చినా ఇది డాక్టర్ బాబు ప్రస్తుతం వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. సీరియల్‌ నటుడిగా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే బుల్లితెర ద్వారా సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న నటుడు ఇతనే.. ఈ మధ్య బుల్లితెర పై ప్రసారం అవుతున్న షోలలో సందడి చేస్తున్నాడు. ఇకపోతే సీరియల్స్ లలో హీరోగా మాత్రమే కాదు.. అటు సీరియల్ నిర్మాతగా కూడా మారాడు. ఇప్పటికే ఎన్నో సీరియల్స్ కి నిర్మాతగా చేసి సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం పొదరిల్లు సీరియల్ కు నిర్మాతగా చేస్తున్నారు.. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటారు. లేటెస్ట్ ఫోటోలను, ఫ్యామిలీ ఫోటోలను కూడా షేర్ చేస్తూ వస్తున్నాడు.. ఆయన షేర్ చేసే ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అవుతుంటాయి. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేశాడు.. కాశ్మీరు లోయల్లో అంటూ మంచు కొండల్లో దిగిన ఒక వీడియోని ఆయన షేర్ చేశారు అదే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.. సీరియల్స్ విషయానికి వస్తే ప్రస్తుతం కార్తీకదీపం 2 లో నటిస్తున్నాడు దీంతో పాటుగా పలు సీరియల్స్ కి నిర్మాతకు కూడా వ్యవహరిస్తున్నారు..

Advertisement

Also Read :Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Related News

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Ninnu kori Serial Today Episode September 24th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ తో కలిసి గణపతి పూజ చేసిన చంద్ర 

Intinti Ramayanam Today Episode: అవనికి నిజం తెలిసిపోతుందా? పల్లవికి దిమ్మతిరిగే షాక్.. ఆరాధ్య మిస్సింగ్…

Big Stories

Advertisement
×