E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           
Advertisement

Karthika Deepam 2 serial today Episode: ఇంట్లో ఖాళీగా ఉండటం బాగోదని జ్యోత్స్న జాబ్‌ చూసుకోవాలనుకుంటుంది. అందుకోసం జాబ్‌ సెర్చ్‌ చేస్తుంది. ఒక రెస్టారెంట్‌ దగ్గర బోర్డు చూసి వెళ్లి జాబ్‌ గురించి అడుగుతుంది. ఆ రెస్టారెంట్‌ ఓనరు జ్యోత్స్ను చూసి నువ్వు బాగా చదువుకున్నదానిలా ఉన్నావు గొప్పింటి అమ్మాయిలా ఉన్నావని తమ దగ్గర మేనేజర్‌ పోస్టులు లేవని చెప్తాడు. అందుకు జ్యోత్స్న మేనేజర్‌ జాబే కాదు సార్‌ ఏ జాబ్‌ అయినా చేస్తాను అని చెప్తుంది. అయితే మా రెస్టారెంట్‌లో వెయిటర్‌ జాబ్‌ ఖాళీగా ఉంది చేస్తావా అంటే చేస్తానని చెప్తుంది జ్యోత్స్న. అయితే వెయిటర్‌ గా జాబ్‌ చేయాలంటే చాలా ఓపిక ఉండాలని కస్టమర్స్‌ కొన్ని సార్లు తిడుతుంటారు. మన తప్పు లేకపోయినా సారీ చెప్పాలి.. అంటూ ఇంకా ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పి మీకు ఇష్టమైతే రేపే వచ్చి జాయిన్‌ కామని చెప్తాడు. జ్యోత్స్న హ్యాపీగా సరే అంటుంది.

కంపెనీ మీటింగ్‌లోకి మధ్యలో వెళ్లిన కార్తీక్‌. జ్యోత్స్న రెస్టారెంట్స్‌ శాశ్వత సీఈవో దీపేనని ఈ బోర్డు మెంబర్సే అందరూ సంతకాలు చేశారని ఆ సంతకాలు దగ్గరుండి మరీ సూరజే చేయించాడని చెప్తాడు. అందుకు మాలిని ఒప్పుకోదు. కంపెనీ లాయరును పిలిచి విషయం చెప్తుంది. లాయరు అగ్రిమెంట్‌ పేపర్స్‌ చూసి మొత్తం లీగల్‌గా ఉందని మీరు దీపను మార్చాలని చూస్తే.. దీపకు పది కోట్లు కట్టాలని చెప్తాడు. మాలిని ఏం చేయాలో అర్థం కాక తనకు కాస్త టైం కావాలని అడుగుతుంది. సాయంత్రం వరకు టైం తీసుకోమని కాదూ కూడదు అంటూ ఏదైనా చేయాలని చూస్తే.. తాము కోర్టుకు వెళ్తామని బెదిరించి దీపను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్‌.

Advertisement

మాలిని, సూరజ్‌ ఇద్దరూ కలిసి కాంచన ఇంటికి వెళ్తారు. అక్కడ ఉన్న సుమిత్ర, శివనారాయణలను చూసి వెటకారంగా మాట్లాడుతుంది. కూతురునే అనాథను చేశావనుకున్నాను.. మీరు కూడా ఇప్పుడు అనాథ ఇంట్లో ఆశ్రయం పొందుతున్నారు సిగ్గు లేదా బాబాయ్‌ అంటూ మాట్లాడుతుంది. మాలిని మాటలకు సుమిత్ర, కాంచన కోప్పడతారు. కాంచన కోపంగా మాలినిని ఇంట్లోంచి వెళ్లిపోమ్మని తిడుతుంది. అందుకు మాలిని తాను కార్తీక్‌, దీపలతో మాట్లాడటానికి వచ్చానని.. ఒకరకంగా చెప్పాలంటే నేను రావడానికి కారణం వాళ్లు నాకు ఇచ్చిన ఆఫరే అంటూ అగ్రిమెంట్‌ పేపర్‌, సూట్‌కేసు వాళ్ల ముందుకు తోస్తుంది.

అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు. ఇంటికి వచ్చిన జ్యోత్స్న బయట కారు దగ్గరే నిలబడిన సూరజ్‌ను చూసి మళ్లీ ఎందుకు వచ్చారని తిడుతుంది. ఇక్కడ కూడా మనఃశాంతిగా ఉండనివ్వరా..? మళ్లీ రోడ్డు మీదకు తోసేయాలని ప్లాన్‌ చేస్తున్నారా..? అంటే మా అమ్మకు తోడుగా వచ్చానని అమ్మ లోపల ఉందని సూరజ్‌ చెప్తాడు. అందుకు జ్యోత్స్న కోపంగా ఓహో లోపల మీ అమ్మ ఏదో తగులబెడుతుంటే.. బయట నువ్వు కాపలా ఉన్నావా..? అంటూ తిడుతుంది.

Advertisement

లోపల శివనారాయణ కోపంగా కార్తీక్‌ను పిలిచి మేము ఇక్కడ ఉండాలా వెళ్లిపోవాలా..? ఈ మనిషిని చూస్తుంటే నాకు ఒళ్లంతా మండిపోతుంది అంటూ తిడుతుంటే.. మాలిని తాను శివనారాయణను మీ ఇంటికి రాలేదని తనుక కావాల్సిన వ్యక్తి ఇంటికి వచ్చానని చెప్తుంది. దీప, కార్తీక్‌ మా ఆఫీసుకు వచ్చి అగ్రిమెంట్‌ ఇచ్చారు. అది మాట్లాడటానికే వచ్చాను అంటూ చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Ninnu kori Serial Today Episode September 24th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ తో కలిసి గణపతి పూజ చేసిన చంద్ర 

Intinti Ramayanam Today Episode: అవనికి నిజం తెలిసిపోతుందా? పల్లవికి దిమ్మతిరిగే షాక్.. ఆరాధ్య మిస్సింగ్…

Thursday Tv Movies : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode September 24th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభాకు షాక్ ఇచ్చిన అమర్   

Big Stories

Advertisement
×