E-Paper
Advertisement

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?
Advertisement

Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 10 అప్పుడే రెండు వారాలు పూర్తయింది. మూడవ వారం కూడా చివరి దశకు చేరుకోబోతోంది. మూడవ వారంలో కని విని ఎరుగని రీతిలో హీటెక్కించిన నామినేషన్ ప్రక్రియ అనూహ్యంగా ఎలిమినేట్ కాబోతున్నారు అనే కంటెస్టెంట్లను టాప్ పొజిషన్లో నిలిపి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన వాళ్లు కూడా నామినేషన్ లోకి వచ్చి, ఇప్పుడు ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఎప్పుడు లేనిది బిగ్ బాస్ సీజన్ 10లో అనూహ్య మార్పులు, అంతు చిక్కని ట్విస్ట్ లు ఆడియన్స్ ను తికమక పెట్టేస్తున్నాయి.

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్..

ఇదిలా ఉండగా 18వ రోజుకు సంబంధించి మొదటి ప్రోమోను నిర్వహకులు విడుదల చేయగా.. అందులో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి నామినేషన్ లో నిలిచి , ఆడియన్స్ ఓట్లు అందుకోవడంలో విఫలం అవుతున్న ఝాన్సీ ని బిగ్ బాస్ ‘టెంప్టేషన్స్ వర్సెస్ టెన్షన్’ పేరిట ఇరకాటంలో పెట్టేశారనే చెప్పాలి. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో బిగ్ బాస్ ప్రత్యేకంగా ఝాన్సీకి ఫోన్ చేసి మాట్లాడుతూ.. “మీ మనసుకు దగ్గరైన ఆ టెంప్టేషన్ మీ చేతికి అందే ముందు మీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను. ఒకటి.. నరేష్ కి తన తమ్ముడు రాసిన ఉత్తరం దక్కకుండా చేయాలి.. రెండవది.. రాంప్రసాద్ కి కుటుంబంతో ఉన్న ఫోటో వచ్చింది. దానిని అతడికి దూరం చేయాలి.. ఎవరికి టెన్షన్ ఇవ్వాలనుకుంటున్నారో చెప్పండి ” అంటూ ఝాన్సీ ని ఇరకాటంలో పెట్టేశారు బిగ్ బాస్.

బిగ్ బాస్ టాస్క్ కి బలయ్యేది ఎవరు?

Advertisement

ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమంలో తమదైన పంచ్ డైలాగులతో అందరి దృష్టిని ఆకట్టుకున్న నరేష్, రాంప్రసాద్ స్నేహితులు గానే ఇప్పుడు హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక్కడ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూనే.. తమ ఆటను కొనసాగిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరిలో ఒకరికి టెన్షన్ ఇవ్వాలి అంటూ బిగ్ బాస్ చెప్పిన మాటకు ఝాన్సీ ఏం చేయాలో తెలియక ఫోన్ కట్ చేసి మరి బోరున ఏడ్చేసింది. ఇక బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో ఝాన్సీ తన టెన్షన్ ను నరేష్ కి ఇవ్వబోతోందా లేక ఫ్యామిలీ ఫోటో ను దూరం చేసి రాంప్రసాద్ కి దూరం అవుతుందా? అన్నది తెలియాలి అంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

ALSO READ:శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

త్రిగుణ్ పై అరిచేసిన నరేష్..

Advertisement

ఇక ఇదే ప్రోమోలో కెప్టెన్సీ కంటెండర్ షిప్ కోసం పోటీ పడుతున్న కంటెస్టెంట్స్.. ముందుగా ఎవరైతే బజర్ ప్రెస్ చేస్తారో వారికే పోటీపడే అవకాశం కల్పిస్తారు బిగ్ బాస్. అలా లివింగ్ రూమ్ లో ఉన్న బజర్ మోగగానే వంశీ, నరేష్ ఇద్దరు పోటీపడ్డారు. కానీ సంచాలక్ గా ఉన్న త్రిగుణ్ .. నరేష్ తన వేలు ఉందని చెప్పిన వినకుండా.. వంశీ పేరు చెప్పి ఆట ఆడే ఛాన్స్ కల్పించాడు. సారీ నరేష్ అని త్రిగుణ్ చెబితే.. నేను చెయ్యి పెట్టిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ వంశీ పేరు చెబితే నేనేం చెప్పాలి చెప్పు అంటూ ఒక్కసారిగా అరిచేసాడు.

Related News

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×