E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: ఫ్యామిలీ పార్టీ అదుర్స్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అవని.. పల్లవికి అశ్విన్ షాక్..

Intinti Ramayanam Today Episode: ఫ్యామిలీ పార్టీ అదుర్స్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అవని.. పల్లవికి అశ్విన్ షాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode august 7th : అవని అక్షయ్ దగ్గరికి వెళ్లి కమల్ ఖాళీగా ఉన్నాడు కదా తనకి ఏదో ఒకటి చెప్పొచ్చు కదా అని అంటుంది. ఇప్పుడు బిజినెస్ ఇప్పుడు సక్సెస్ అయ్యాం కదా ఆఫీస్ పెడుతున్నప్పుడు వాడిని మేనేజ్ ని చేస్తాను అని అవని తో అక్షయ్ అంటాడు ఆ మాట వినగానే చాలా సంతోషంగా ఉంటుంది అవని. ఇక రాత్రి అందరు పడుకునే తర్వాత ముగ్గురు అన్నదమ్ములు పార్టీ చేసుకోవాలని అనుకుంటారు. అంత ఏర్పాటు చేసుకున్న తర్వాత అవని స్టఫ్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇస్తుంది.అందరూ అడ్డంగా దొరికిపోయామని అనుకుంటారు. కానీ ఆడవాళ్లు మా పార్టీ మాకు ఉంటుంది కదా అని అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు..

ఫ్యామిలీ పార్టీ టైమ్..

మీరు పార్టీ చేసుకుంటున్నారు సరే మేము కూడా పార్టీ చేసుకోవాలి కదా అని అవని వాళ్ళు అనడంతో ఒక్కసారిగా ఆ బ్రదర్స్ అందరూ షాక్ అవుతారు. వీళ్లు పార్టీ చేసుకోవడం ఏంటి అసలు దేని గురించి మాట్లాడుతున్నారు అని అందరూ నోరులు వెళ్ళబెట్టుకుని చూస్తూ ఉంటారు. అసలు వీళ్ళకి ఏమైంది వీళ్లు పార్టీ చేసుకోవడం ఏంటి దేని గురించి మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదు అని అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు.. మీ పార్టీ మీకు ఉంటే మా పార్టీ మాకు ఉంటుంది అని వాళ్లంతా చెప్పగానే మొదట కంగారుపడిన కూడా ఆ తర్వాత జ్యూస్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. జ్యూస్ తాగుతూ లేడీస్.. మందు తాగుతూ జెంట్స్ బాగానే ఎంజాయ్ చేస్తారు. రాత్రి పొద్దుబోయే అంతవరకు కూడా అందరూ కూర్చొని తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒక ఉదయం లేవగానే వాళ్ళని చూసిన ఆడవాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు.

అవని దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Advertisement

ఉదయం లేవగానే పల్లవి అందరికీ కాఫీ పెడుతూ కనిపిస్తుంది. ఏం చేస్తున్నావ్ పల్లవి అని అవని వంటగదిలోకి వచ్చి అడుగుతుంది. లేదక్కా ముగ్గురు బావ వాళ్ళకి కాఫీ కలుపుతున్నాను అని అనగానే నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సింది కాఫీ కాదు పల్లవి హ్యాంగ్ ఓవర్ తగ్గడానికి మజ్జిగ అని అంటుంది అవని. అక్క నువ్వు ఎలా చెప్తే అలానే వాళ్లకి మజ్జిగ చేసి ఇస్తాము అని పల్లవి అంటుంది. ఆ తర్వాత శ్రేయ కూడా వాళ్ళకి మజ్జిగ ఇస్తేనే బాగుంటుంది అని అనడంతో ఇక అందరూ కూడా మజ్జిగనివ్వాలి అని అనుకుంటారు. అసలు వాళ్ళ అవతారం రూమ్ లో ఎలా ఉందో ఒకసారి చూస్తే షాక్ అవుతారు అని అవని అనగానే ముగ్గురు ఒకరి మీద ఒకరు పడుకొని కలవరిస్తూ ఉంటారు.. అది చూసినా అవని ఒక్కసారిగా చూసావా ఎలా కలవరిస్తున్నారో నిద్రలో కూడా వీళ్ళకి మందు పోలేదు అని అంటుంది.. ఇక ముగ్గురిని లేపగానే ఆ ముగ్గురు కూడా ఏదో తప్పు చేసాము అని అనుకుంటారు.. కానీ ముగ్గురు లేచి మజ్జిగ తాగి భార్యలతో రొమాన్స్ చేస్తారు.. ఇదే సీన్ హైలైట్ గా నిలుస్తుంది.

పల్లవితో కమల్ రొమాన్స్..

పల్లవి కమల్ దగ్గరకొచ్చి ఏంటి బావా గ్రీజర్ ఆన్ చేస్తున్న స్నానం చేయలేదు అని అంటుంది. ఏం లేదు పల్లవి స్నానం చేయడానికి వెళుతున్నాను కాకపోతే నాకు చాలా తలనొప్పిగా ఉంది కొంచెం తలనొక్కు అని అడుగుతాడు. ఇక పల్లవి తల నొక్కుతూ ఉండగా కమల్ నువ్వు ఇలా రోజు నొక్కుతూ ఉంటే నాకు స్వర్గంలో ఉన్నట్లే ఉంది అని తనపై ప్రేమతో రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిపోతాడు. ఇక పల్లవి పై రొమాన్స్ కురిపిస్తూ ఉండగా అశ్విన్ ఫోన్ చేయడంతో పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ఈ అశ్విని గాడు నన్ను చావకొడుతున్నాడు అని ఫీల్ అవుతుంది. వీడు బాధ నుంచి ఎలాగైనా సరే బయటపడాలి అని పల్లవి అనుకుంటుంది. కమల్ మళ్లీ ఫోన్ చేయగానే ఎవరు అని అడుగుతాడు.. ఏదో రాంగ్ కాల్ బావ అని చెప్పి మేనేజ్ చేస్తుంది. కానీ అశ్విన్ మాత్రం పల్లవిని ఎలాగైనా సరే టార్చర్ చేయాలి అని అనుకుంటాడు..

అవనితో హ్యాపిగా ఉన్న అక్షయ్..

Advertisement

అక్షయ్ స్నానం చేసి రాగానే అవని ఏంటి మీకు ఇంకా తాగింది దిగలేదా అని అడుగుతుంది. ఒకటి రెండు అని చెప్పేసి ఇలా పీకలు దాకా తాగే ఒళ్ళు తెలియకుండా పడిపోయారు. మీకు కొంచెం కూడా లేదు కదా ఇవాళ పూజిందన్న సంగతి మీకు తెలియదా అని సీరియస్ అవుతుంది. కానీ అక్షయ మాత్రం నువ్వు సీరియస్ అవ్వాల్సిన పనిలేదు మీరు రాత్రి పార్టీ ఇచ్చారు కాబట్టి ఇంకాస్త ఎక్కువ తాగేమో అంతే తప్ప రోజు ఇలా తాగుతామని మేము చెప్పలేదు కదా అని అంటాడు అక్షయ్. అటు శ్రీకర్ కూడా శ్రేయతో మాట్లాడుతూ ఉండగా నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఆరాధ్య బాబు దగ్గరికి వచ్చి నేను అన్ని రెడీ చేస్తాను అని చెప్పగానే వాళ్ళిద్దరూ కూడా నువ్వు ఎంత పెద్ద దానివి అయిపోయావు అని మురిసిపోతూ ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :క్యాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్ చాందిని షాకింగ్ కామెంట్స్.. అసలేం జరిగిందంటే..?

Related News

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×