E-Paper
Advertisement

Brahmamudi Serial Today December 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అప్పుకు కండీషన్ పెట్టిన ధాన్యలక్ష్మీ  

Brahmamudi Serial Today December 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అప్పుకు కండీషన్ పెట్టిన ధాన్యలక్ష్మీ  
Advertisement

Brahmamudi serial today Episode:  

అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటుండగా.. ధాన్యలక్ష్మీ వస్తుంది. ధాన్యలక్ష్మీని అందరూ అనుమానంగా చూస్తుంటే.. అందరూ కూలబలుక్కున్నట్టు ఎందుకు అలా చూస్తున్నారు.. మీరేం నన్ను శత్రువులా చూడనక్కర్లేదు.. నా కోడలితో నేను ఒక విషయం మాట్లాడాలి అని చెప్తుంది. దీంతో ఇంద్రాదేవి అంటే మమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మంటావా..? నీ కోడలితో అంత రహస్యం ఏముంది మాట్లాడటానికి అని అడుగుతుంది. దీంతో అంత లేదు.. మీరు ఎవ్వరూ వెళ్లాల్సిన అవసరం లేదు. నా కోడలితో నేను మాట్లాడే విషయం మీరందరూ వినాలి అంటుంది. దీంతో ప్రకాష్‌ కోపంగా ఇంకా ఏం చెప్పాలో ఇంకా ఏముంది చెప్పడానికి కోడలిని ఉద్యోగం వద్దన్నావు.. ఇంట్లోనే ఉండాలి అన్నావు. నీ మాట నెగ్గించుకున్నావు.. అది చాలదా..? అంటాడు.

దీంతో దాన్యలక్ష్మీ అది కాదు నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే.. అంటూ ఏదో చెప్పబోతుంటే అప్పు దగ్గరకు వెళ్తుంది. నన్ను క్షమించండి అత్తయ్యా నా వైపు తప్పు జరిగింది. నాకు మీకన్నా మీ మాట కన్నా ఏది ముఖ్యం కాదు అంటూ అప్పు చెప్తుంటే.. ధాన్యలక్ష్మీ నీ మనసు తెలిసిన దాన్ని.. ఆ మనసు ఏం ఆలోచిస్తుందో.. దేని కోసం పరితపిస్తుందో నాకు తెలియదా..? అనగానే.. చెప్తున్నాను కదా అత్తయ్యా నాకు అన్నింటికన్నా.. మీ మాటే ముఖ్యం అంటుంది అప్పు. దీంతో ధాన్యలక్ష్మీ నాకు తెలుసు నీకు నా మాటే ముఖ్యం అని కానీ వాటితో పాటు నువ్వు నమ్మి. వృత్తి నువ్వు ఇష్టపడిన ఉద్యోగం కూడా నీకు ఎంత ఇష్టమో నాకు అర్తం అయింది. నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. నిన్ను బాధపెట్టి నేనేం సాధిస్తాను. నీకు ఇష్టమైన ఉద్యోగం మాన్పించి నేను ఏం కూడబెట్టుకుంటాను. ఎంత పట్టుదల లేకపోతే అంతటి కేసును చేధిస్తావు.. ఎంత నిజాయితీ లేకపోతే ఆ బిడ్డను తల్లికి చేరుస్తావు చెప్పు.. ఆ తల్లి వచ్చి నీ గొప్పదనం గురించి చెప్తుంటే.. నీకే కాదు నువ్వు నా కోడలివి అయినందుకు నేను గర్వపడ్డాను.. వృత్తి పట్ల అంత బాధ్యత ఉన్న నీ కాళ్లకు నేనెందుకు సంకెళ్లు వేయాలి. నేనెందుకు నీ గౌరవాన్ని తగ్గించాలి. అందుకే నువ్వు ఉద్యోగం మానేయక్కర్లేదు. నువ్వు అనుకున్నది చేయ్‌ నీ ఇష్ట ప్రకారమే ఉండు కానీ.. అంటూ ఏదో చెప్పబోతుంటే..

Advertisement

ప్రకాష్‌ కల్పించుకుని ఆ కానీ అన్నావా..? మళ్లీ ఏదో మెలిక పెడతావు.. ఏంటో చెప్పు.. అనగానే.. ధాన్యలక్ష్మీ అదేం కాదు నా కొడలు డెలివరీ అయ్యేదాకా ఇల్లు కదలకుండా ఉంటే నాకంతే చాలు అంటుంది. దీంతో అప్పు ఎమోషనల్ అవుతూ థాంక్స్‌ అత్తయ్యా.. థాంక్యూ వెరీమచ్‌.. మీరు చెప్పినట్టే నాకు డెలివరీ అయ్యి బిడ్డను మీ చేతులో పెట్టేదాకా నేను ఎక్కడికి వెళ్లను అంటుంది. ధాన్యలక్ష్మీ కూడా ఇప్పుడు నీకు ఆనందమే కదా అనగానే.. అవును అంటూ అందరూ హ్యాపీగా ఉంటారు. ఇంతలో ప్రకాష్‌ కల్పించుకుని మా ఆనందం గురించి తర్వాత కానీ ధాన్యం నువ్వేంటే ఇంతటి శుభవార్త కూడా ఇంత సీరియస్‌గా రివీల్‌ చేశావు అంటాడు. ఇంద్రాదేవి కూడా మామూలుగా కాదురా బాంబు పేల్చినట్టే చెప్పింది అంటుంది. దీంతో కళ్యాన్‌ కూడా ఏదో ఒకటి నాన్నమ్మ మా అమ్మ ఒప్పుకుంది. ఐయామ్‌ ఫుల్‌ హ్యాపీ అంటాడు.

ఇక ప్రకాష్‌ అప్పుతో అమ్మ అప్పు మీ అత్తయ్య గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక నీ ఇష్టం వచ్చినట్టు డ్యూటీ చేయ్‌ అని చెప్పగానే.. లేదు మామయ్య అత్తయ్య నా ఆశలను గుర్తించారు. నేను అత్తయ్య మాటకు గౌరవం ఇవ్వాలి.. ఇస్తాను కూడా.. డెలివరీ అయ్యేంత వరకు డ్యూటీ చేయను.. అంటుంది అప్పు. దీంతో అపర్ణ కల్పించుకుని చూశారా అత్తయ్యా కోడలి మాటను అత్త కాదనలేదు.. అత్త మాటను కోడలి కాదనదట ఇక మనమేనా పరాయి వాళ్లం అంటుంది. దీంతో అందరూ నవ్వుకుంటారు. అత్తయ్య గారు మన ఇంట్లో పరాయి వాళ్లు ఎవ్వరూ ఉండరు.. అందరూ చిన్నత్తయ్యకు భయపడేవాళ్లే.. అంటుంది కావ్య.. దీంతో ప్రకాష్‌ అమ్మా కావ్య నేను దాన్ని మొగుణ్ని అమ్మా నేను భయపడను.. అని చెప్పగానే.. ధాన్యలక్ష్మీ కోపంగా చూస్తుంది. దీంతో ప్రకాష్‌ జోక్‌ చేశాను.. ధాన్యం జోక్‌ చేశాను అంతే  అంటాడు.   అందరూ నవ్వుకుంటారు.

Advertisement

రాహుల్‌ ఆఫీసులో మేనేజర్‌ను పిలిచి రాజ్‌ డిజైన్స్‌ కన్నా ముందే మన డిజైన్స్‌ మార్కెట్‌లోకి వెళ్లాలి అని చెప్తాడు. టైం లాప్స్‌లో కావ్య, అప్పులకు డెలివరీ టైం  దగ్గర పడుతుంది. తర్వాత రాజ్‌ డిజైన్స్‌ చూసిన క్లయింట్స్‌ ఒక్కొక్కరుగా రాజ్‌ దగ్గరకు వెళ్తున్నారని మేనేజర్ చెప్పగానే.. రాహుల్ ఇరిటేటింగ్‌ గా ఫీలవుతాడు. తర్వాత ఇంటికి వచ్చిన రాజ్‌, కావ్య తమ కంపెనీకి వచ్చే లాభాల గురించి మాట్లాడుకుంటుంటే రాహుల్‌ వస్తాడు. తన కంపెనీకి నష్టాలు రాబోతున్నాయని చెప్తాడు. అందరూ రాహుల్‌ ను తిట్టి రాజ్‌ను చూసి నేర్చుకో అంటారు. రాహుల్ ఇరిటేటింగ్‌ గా వెళ్లిపోతాడు. రుద్రాణి కోపంగా చూస్తుంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Illu Illalu Pillalu Today Episodes: విశ్వం ప్లాన్ సక్సెస్.. ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. అడ్డంగా బుక్కయిన ధీరజ్..

Ninnu kori Serial Today Episode September 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: డాక్టర్ ను బెదిరించి నిజం తెలుసుకున్న విరాట్  

Intinti Ramayanam Today Episode: గుండెలు పగిలేలా ఏడ్చిన అక్షయ్.. అయ్యో కన్నీళ్లు తెప్పించే సీన్.. పల్లవి ఫుల్ హ్యాపీ..

Big Stories

Advertisement
×