Brahmamudi serial today Episode: స్టెల్లా వచ్చి నేను చేసిన డిషెష్ పది నిమిషాల్లోనే తినాలని లేకపోతే తినడానికి పనికిరావని చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. త్వరగా తినాలని.. పాస్ట్‌గా వడ్డించుకుని మొదటి ముద్ద తిని అందరూ ఫ్రీజ్ అయిపోతారు. దీంట్లో సాల్ట్ లేదే అని రాహుల్ అడగ్గానే నీకు బీపీ కావాలా..? సాల్ట్ కావాలా..? అని అడుగుతుంది స్టెల్లా. ఇందులో ఆయిల్ లేదే అని ప్రకాష్ అడగ్గానే.. నీకు ఆయిల్ కావాలా..? కొలెస్ట్రాల్ కావాలా..? అని అడుగుతుంది స్టెల్లా.. ఇక రాజ్ ఇందులో టేస్ట్ లేదే అని అడగ్గానే నీకు టేస్ట్ కావాలా..? ప్రొటీన్స్ కావాలా అని ప్రశ్నిస్తుంది. దీంతో అందరూ నవ్వుకుంటారు.
స్వప్న కావ్యను కర్రీ అడిగి వేయించుకుంటుంది. సరేనని తీసుకొచ్చి స్వప్నకు ఇచ్చి ఇంకెవరికైనా కావాలా.? అని అడుగుతుంది. హలో అవసరం లేదు అంటాడు రాజ్. ఇంతలో ప్రకాష్ ఓరేయ్ కొంచెం కావ్య కర్రీ అయినా వేసుకుంటానురా.. అని అడగ్గానే బాబాయ్ నీవల్లే ఇదంతా అది టమాటా ముందే వేసినందువల్ల ఇదంతా జరిగింది. నీ కకృతి వల్లే ఇలా జరిగింది అంటాడు రాజ్. తినలేక చావలేక అన్నట్లు అవస్థలు పడుతుంటారు. ఇంతలో సీతారామయ్య ఎంటీ ఎక్కడో అన్నం ఉడుకుతున్న సౌండ్ వస్తున్నట్లుంది అంటాడు. నాన్న అది అన్నం ఉడుకుతున్న సౌండ్ కాదు సున్నం ఉడుకుతున్న సౌండ్ అంటాడు సుభాష్. ఇంతలో ప్రకాష్, రాహుల్, రాజ్ ముగ్గురు ఒక్కోక్కరుగా కడుపులో ఏదో రకంగా ఉందని తినకుండా వెళ్లిపోతారు.
స్టెల్లా ఒక్కతే కిచెన్ లో ఉంటే రాహుల్ వెళ్లి తనను మళ్లీ పరిచయం చేసుకుంటాడు. మీరు చేసిన వంట చాలా బాగుంది. మీలాంటి బ్యూటిఫుల్ గర్ల్స్ కు కుకింగ్ తో పాటు ఇంకా చాలా టాలెంట్స్ ఉంటాయే అని అడుగుతాడు రాహుల్. ఎందుకలేవు నేను హెడ్ మసాజ్ చేయడంలో నేను స్పెషలిస్టును అంటుంది స్టెల్లా.. దీంతో నాక్కూడా మసాజ్ చేయోచ్చు కదా అని అడుగుతాడు. ఎందుకు చేయను పేమేంట్ ఇస్తే కుక్కకైనా చేస్తాను అంటుంది స్టెల్లా.. ఎందుకు చేయను ఇప్పుడే చేస్తాను అంటూ స్టెల్లాకు డబ్బులు సెండ్ చేస్తాడు. ఇద్దరూ కలిసి బెడ్ రూంలోకి వెళ్తారు. రాహుల్ కూర్చుంటే స్టెల్లా మసాజ్ చేస్తుంది. ఇంతలో స్వప్న వచ్చి కోపంగా చీపురు తీసుకుని రాహుల్ ను కొడుతుంది.
మధ్యలో అడ్డొచ్చిన స్టెల్లాను కొడుతుంది. స్టెలా కిందకు వస్తుంది. ప్రకాష్ కూడా స్టెల్లా అనుకుంటూ వెళ్లబోతుంటే ధాన్యలక్ష్మీ పట్టుకుంటుంది. రాజ్ వచ్చి ఏయ్ ఏమైంది అని అడుగుతాడు. స్టెల్లా రాజ్ వెనక్కి వచ్చి చెర్రి కాపాడు అని అడుగుతుంది. రాజ్ ఏమైంది స్వప్న అని అడగ్గానే ఇది వంట మనిషి కాదు. బజారు మనిషి రాహుల్ కు మసాజ్ చేస్తుంది. అంటూ మళ్లీ కొడుతుంటే స్టెల్లా అక్కడి నుంచి పారిపోతుంది. ఇక ధాన్యలక్ష్మీ మిస్టర్ పులిహోర నీకు కావాలా..? చీపురుదెబ్బలు అని అడుగుతుంది. అంత లేదు నువ్వు వేరు కుంపటి పెట్టి ఓవర్ యాక్షన్ చేస్తుంటే నీకు బుద్ది చెప్పాలని అలా చేశాను యూ చిల్లి అంటాడు ప్రకాష్.
అవునని ఇదంతా మాకు చెప్పే చేశాడని ఇందిరాదేవి చెప్తుంది. కానీ రాహుల్ మాత్రం కావాలనే జీవించాడు. అందుకే ఇద్దరినీ కలిపి వాయిచాను అంటుంది స్వప్న. చూశావా..? రాహుల్ ఇంటి మనిషికి, వంట మనిషికి తేడా అని ఇందిరాదేవి చెప్తుంది. ఇంతలో కొరియర్ బాయ్ వచ్చి కవర్ ఇచ్చి వెళ్తాడు. ఎవరికి వచ్చిందిరా అని సుభాష్ అడగ్గానే ఈ కళావతి ఇంటి అడ్రస్ నుంచి వచ్చింది డాడీ అని చెప్పగానే కావ్య ఆశ్చర్యంగా నేను ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి వచ్చాను అక్కడి నుంచి కవర్ రావడం ఏంటి అని అడుగుతుంది.
కవర్ ఓపెన్ చేసిన రాజ్ చదివి షాక్ అవుతాడు. డాడీ.. మమ్మీ నీకు డైవర్స్ ఇవ్వడానికి నోటీస్ పంపించింది అని చెప్తాడు. అందరూ షాక్ అవుతారు. రాజ్ కావ్యను తిడతాడు. కావ్య కూడా రాజ్‌ను తిట్టి మీ అమ్మతో తేల్చుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సుభాష్ కూడా రాజ్‌ను తిడతాడు నువ్వు ఎన్ని వెధవ వేషాలు వేసినా భరించాను అంటాడు. దీంతో రాజ్ అమ్మ రేపే ఇంటికి వస్తుంది. కళావతి ఎప్పటికీ ఇంటికి రాదు అమ్మ ఇంటికి వచ్చేలా నేను చేస్తాను అని చెప్పి వెళ్లిపోతాడు.
ఇంటికి వెళ్లిన కావ్య అపర్ణను తిడుతుంది. అయినా ఆవిడను కాదు నిన్ను అనాలి. ఆవిడ వెనక నీ క్రిమినల్ బ్రెయిన్ ఉండొచ్చు అని కనకాన్ని తిడుతుంది. దీంతో ఇది నేను స్వతహాగా తీసుకున్న నిర్ణయం. ఆ బండరాయిని కరిగించడానికే నేను బండరాయిలా తయారయ్యాను అంటుంది అపర్ణ. నువ్వు అంతలా కంగారుపడాల్సిన అవసరం లేదు. నేనేమైనా పిచ్చిదాన్నా..? నాభర్తను వదిలేసి ఎలా ఉంటాను. నీ భర్తకు బుద్ది రావాలనే ఇలా చేశాను అంటుంది అపర్ణ. ఇదే దారి దొరికిందా మీకు అయినా మీ అబ్బాయి ఆడే తైతక్కల గురించి మీకు తెలియదు.
ఆ మహానుభావుడు అనుకున్నది జరగడం కోసం ఎంతదూరం అయినా వెళ్తారు అంటుంది కావ్య. వాడు ఎంతదూరం అయినా వెళ్లనివ్వు కానీ వాడి కంటే ముందు నేనే ఉంటాను అంటుంది అపర్ణ. ఎందుకు జీవిత భాగస్వామిని వదిలేయడానికా..? అంటుంది కావ్య. నన్ను ఇలా వదిలేయండి అత్తయ్యా మీ కొడుకు దిగొస్తే దిగొస్తారు లేకుంటే నా కర్మ ఇంతే అనుకుంటాను అని చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?