BigTV English

Director Buchi Babu Sana: డైరెక్టర్ బుచ్చిబాబు కు భారీ ఎలివేషన్స్ ఇస్తున్న మెగా ఫ్యాన్స్

Director Buchi Babu Sana: డైరెక్టర్ బుచ్చిబాబు కు భారీ ఎలివేషన్స్ ఇస్తున్న మెగా ఫ్యాన్స్

Director Buchi Babu Sana: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్స్ బుచ్చిబాబు ఒకరు. ఉపన సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు బుచ్చిబాబు. బాక్స్ ఆఫీస్ వద్ద ఉప్పెన సినిమా ఎంతటి సంచలమైన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే దాదాపు 100 కోట్లు కలెక్షన్స్ లో చేరిపోయి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మంచి దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు. ఇప్పుడే సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు సినిమా అనౌన్స్ చేస్తాడు అని అందరూ ఎదురు చూశారు. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా సెట్ కాలేదు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా జరగనున్నట్లు వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఆ ప్రాంతంలో సినిమాకి సంబంధించిన ఆడిషన్స్ కూడా చేసింది చిత్ర యూనిట్.


దర్శకుడు సుకుమార్ దగ్గర బుచ్చిబాబు శిష్యరికం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయ్యాడు బుచ్చిబాబు. ఈవెంట్లో బుచ్చిబాబు మాట్లాడుతూ దర్శకుడు సుకుమార్ ని కొనియాడారు. సుక్కు సార్ మీ కష్టం నాకు తెలుసు. మేము ఒక 26 సీన్లు రాసి అలసిపోతే మీరు అక్కడి నుంచి మొదలుపెడతారు. ఈ సినిమా బాగా ఆడాలని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకు మంచి లాభాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ చెప్పాడు. ఇక బుచ్చిబాబు స్పీచ్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఒక్క మాట కూడా హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడలేదు. ఇలా మాట్లాడకపోవడం వలన సోషల్ మీడియాలో కొంతమంది మెగా ఫ్యాన్స్ బుచ్చిబాబుకు భారీ ఎలివేషన్స్ ఇస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి బుచ్చిబాబు కూడా బ్యానర్ కడతామని ఫిక్స్ అయ్యారు. కొంతమంది మెగా ఫ్యాన్స్.

Also Read :  Allu Arjun : బాహుబలి, RRR ని మన తెలుగు సినిమా అని ఎంత గర్వించామో, ఇప్పుడు పుష్పకి కూడా అంతే గర్విస్తాం


బుచ్చిబాబు చాలా తెలివిగా మాట్లాడాడని నిజమైన మెగా ఫ్యాన్ అంటూ కొంతమంది చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక పుష్ప విషయానికొస్తే రిలీజ్ అవ్వడానికి కంటే ముందు ఈ ఒక్క సినిమా పది కేజీఎఫ్ లతో సమానం అంటూ అప్పట్లో భారీ ఎలివేషన్ ఇచ్చాడు బుచ్చిబాబు. పుష్ప సినిమా కూడా అదే స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు పుష్ప 2 సినిమా కూడా అంతకు మించిన స్థాయిలో హిట్ అవుతుందని చాలామంది అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీత అందించారు. ఇదివరకే రిలీజ్ అయిన పాటలు కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక సోషల్ మీడియాలో వస్తున్న ఎలివేషన్స్ చూసి బుచ్చిబాబు ఏమైనా రియాక్ట్ అవుతాడేమో కొన్ని రోజులు వెయిట్ చేసి చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×