Brahmamudi serial today Episode: రాజ్ దగ్గరకు వెళ్లిన కావ్య వెంటనే నేను నెల తప్పాలని ఉంది. కాబట్టి మనం బూత్ బంగ్లాకు వెళ్లాలని మా అక్కలాగా పాపనో బాబునో ఎత్తుకోవాలని ఉంది అని చెప్తుంది. దీంతో రాజ్ నాకు కూడా నువ్వు నెల తప్పాలనే ఉంది. పాపనో బాబునో నేను ఎత్తుకోవాలని ఉంది. కానీ దానికోసం బూత్ బంగ్లా దాకా ఎందుకు ఇక్కడే చాలు అంటూ కావ్యను దగ్గరకు తీసుకుని హగ్ చేసుకుంటాడు. ఇప్పుడు చెప్పు పాప కావాలా..? బాబు కావాలా అని అడుగుతాడు. కావ్య నాకు ఎవరైనా ఓకే అంటుంది. పర్వాలేదు నిజం చెప్పు అనగానే.. నీలాంటి బాబు కావాలి అంటుంది. అయితే నాకు నీలాంటి పాప కావాలి అంటాడు రాజ్.
కళ్యాణ్ నిద్ర లేవగానే.. మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేసి కంగ్రాచ్యులేషన్స్ చెప్తాడు. నాకెందుకు చెప్తున్నారు సార్ అని కళ్యాణ్ అడుగుతాడు. నువ్వు నా సినిమాలో సోలో కార్డుతో సాంగ్స్ రాస్తున్నావు అందుకే కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను అనగానే కళ్యాణ్ షాక్ అవుతాడు. వెంటనే సార్ ఇంకొన్ని రోజులు మా గురువు గారి దగ్గరే వర్క్ నేర్చుకుందామనుకుంటన్నాను అని చెప్తాడు. దీంతో మ్యూజిక్ డైరెక్టర్.. ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ అవకాశాలు ఎప్పుడూ రావు. అవకాశం వచ్చి నీ తలుపు తడితే నువ్వు గురువు గారు అంటావేంటి..? నీకు నీ కెరియర్ ఇంపార్టెంటా… ఆ గురువు గారు ఇంపార్టెంటా..? అని అడుగుతాడు. దీంతో కళ్యాణ్ గురువు గారికి ఇచ్చిన మాట ఇంపార్టెంట్ సార్. అవకాశం వచ్చింది కదా అని ఇలా మధ్యలోనే ఆయన్ని వదిలి నేను రాలేను.
దానికి నా మనస్సాక్షి ఒప్పుకోదు అని చెప్పగానే.. వెరీ గుడ్ కానీ మీ గురువు గారే నాకు కాల్ చేసి నీకీ అవకాశం ఇవ్వమని చెప్పారు. ఆయన ఫోన్ కట్ చేసి నీకు ఫోన్ చేశాను. అని చెప్పగానే కళ్యాణ్ షాక్ అవుతాడు. రైటర్ కు ఫోన్ చేస్తే తానే ఆ అవకాశం ఇవ్వమన్నాను అని చెప్తాడు. కళ్యాణ్ అనుమానంగా అయినా మీరు ఇంత త్వరగా ఇలా మారతారని అడగ్గానే ఒక ఆదిపరాశక్తి నాకు జ్ఞానోదయం చేసిందిలే అని చెప్తాడు. పక్కనే ఆప్పు కూర్చుని ఉంటుంది. భయంతో మాట్లాడుతుంటాడు. ఇక నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నీ అగ్రిమెంట్ చించివేస్తున్నాను. అని ఫోన్ కట్ చేసి చెప్పాను అమ్మా.. అనగానే అప్పు అక్కడి నుంచి వస్తుంది.
అందరూ హాల్లో కూర్చుని ఉండగా కళ్యాణ్ డల్లుగా కిందకు వస్తాడు. ఏమైంది అలా ఉన్నావని ప్రకాష్ అడుగుతాడు. ఒక గుడ్ న్యూస్ నాన్నా అంటాడు. గుడ్ న్యూస్ అంటున్నావు.. అంత డల్లుగా ఉన్నావేంటిరా..? అని రాజ్ అడుగుతాడు. వెంటనే నాకు ఒక సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం వచ్చింది అంటూ చెప్తూ ఎగిరిగంతేస్తాడు. నాకు సింగిల్ కార్డు పడుతుంది అని చెప్పగానే.. అందరూ కంగ్రాట్స్ చెప్తారు. ధాన్యలక్ష్మీ పరధ్యానంలో ఉండిపోతుంది. ఇంతలో ఇందిరాదేవి ధాన్యలక్ష్మీ నీ కొడుకు తనను తాను ఫ్రూవ్ చేసుకున్నాడు చూడు అని చెప్తుంది. ఇంతలో కావ్య వెళ్లి స్వీట్లు తీసుకొచ్చి అదరికీ ఇస్తుంది. ఇంతలో స్వప్న ఉట్టి స్వీట్స్ తో వదిలేస్తావా కళ్యాణ్.. పార్టీ లేదా పుష్ప అంటుంది. ఎందుకు లేదు నా తమ్ముడు ఇంత సాధించాక రాత్రికి గ్రాండ్‌గా పార్టీ చేద్దాం అని రాజ్ చెప్తాడు.
రాత్రికి రాజ్ పెద్ద కేక్ తీసుకొచ్చి అందరినీ పిలుస్తాడు. కేక్ కట్ చేయడానికి కళ్యాణ్‌ను పిలిస్తే.. కళ్యాణ్ అప్పును కూడా రమ్మని పిలుస్తాడు. ఇప్పుడు ఈవిడెందుకు పానకంలో పుడకలాగా అంటుంది ధాన్యలక్ష్మీ. అప్పు డల్లుగా నిలబడి ఉంటే.. అందరూ అప్పును పిలుస్తారు. ఇద్దరూ వెళ్లి కేక్ కట్ చేస్తారు. అందరూ హ్యాపీగా ఉంటారు. రుద్రాణి, రాహుల్ మాత్రం డల్లుగా ఉంటారు. నువ్వు మంచి పాటలు రాసి మన దుగ్గిరాల ఇంటి పేరు దేశం అంతా తెలిసేలా చేయాలని చెప్తే.. ఇరిటేటింగ్‌గా రుద్రాణి ఇప్పుడు వాణ్ని మైకు పట్టుకుని దేశమంతా తిరగమంటావా ఏంటి..? అంటుంది. అందరూ కేక్ తినిపిస్తూ.. కళ్యాణ్, అప్పులకు కంగ్రాట్స్ చెప్తారు. తర్వాత అందరూ పాటలు పెట్టుకుని డాన్సులు చేస్తుంటారు. రాహుల్ డాన్స్ చేస్తుంటే.. రుద్రాణి తిట్టి పైకి వెళ్లిపోతుంది. అందరూ హ్యపీగా ఉండగా.. రాజ్ కు ఫోన్ వస్తుంది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?