Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( Champions Trophy 2025 ) భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్ ( Bangladesh ) వర్సెస్ టీమ్ ఇండియా ( Team india) తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్.. ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. దుబాయ్ వేదికగా (Dubai ) జరగనున్న ఈ మ్యాచ్ లో మొదట టాస్ నెగిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పిచ్ మొదట బ్యాటింగ్ తీసుకున్న వాళ్లకు మాత్రమే అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో…. టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్ తీసుకుంటుంది అని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక ఇవాల్టి మ్యాచ్ లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగే ఛాన్సులు ఉన్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్ గా కె ఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నారు. ఓపెనర్లుగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే గిల్ బరిలో దిగనున్నారు. మొదటి వికెట్ కు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తాడు. మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేయనున్నాడు. ఆల్ రౌండర్ గా హార్దిక్ పాండ్యా అలాగే అక్షర్ పటేల్… జట్టుకు సేవలు అందించనున్నారు. ఇక ఫాస్ట్ బౌలర్గా మహమ్మద్ షమీతో పాటు అర్షదీప్ సింగ్ రంగంలో ఉంటాడు. హర్షిత్ రానా కు తుది జట్టులో ఉండే ఛాన్సులు లేవు.
ఇది ఇలా ఉండగా.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రికార్డులు… అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 41 వన్డే మ్యాచ్లు జరిగాయి. ఇందులో టీమిండియా పై చేయి సాధించింది. 41 మ్యాచ్లలో 32 మ్యాచ్ల్లో విజయం సాధించింది టీమిండియా. అటు బంగ్లాదేశ్… కేవలం ఎనిమిది మ్యాచ్ లలో మాత్రమే గెలిచింది. రెండు జట్ల మధ్య… ఫలితం తేలని మ్యాచ్ ఒకటి మాత్రమే ఉంది. ఇక స్వదేశంలో… టీమిండియా నాలుగు మ్యాచ్లు గెలిచింది. అటు బంగ్లాదేశ్ స్వదేశంలో ఆరు మ్యాచ్లు గెలిచి… చరిత్ర సృష్టించింది. అలాగే బంగ్లాదేశ్ గడ్డ పైన 18 మ్యాచ్లు గెలిచింది టీమిండియా. అదే ఇండియా గడ్డపైన బంగ్లాదేశ్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ లెక్కల ప్రకారం… టీమిండియా… ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. బంగ్లాదేశ్… గెలవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. మరి ఈ మ్యాచ్ లో టీమిండియా ఎలా ఆడుతుందో చూడాలి.
Bangladesh vs India, 2nd Match, Group A :
ఇండియా ప్రాబబుల్ ఎలెవన్: రోహిత్ శర్మ (C, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్
బంగ్లాదేశ్ ప్రాబబుల్ XI: తాంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (సి), మెహిదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, జాకర్ అలీ / తౌహిద్ హృదయ్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, నహిద్ రానా, తంజిమ్ సకీబ్/