Brahmamudi serial today Episode: సెక్యూరిటీ ఫోన్ చేయడంతో ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్తాడు రాజ్. అక్కడ కొంత మంది రౌడీలు ఫ్యాక్టరీ తగులబెట్టేందుకు పెట్రోల్ పోస్తుంటారు. రాజ్ వాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే.. పారిపోతారు. సెక్యూరిటీకి జాగ్రతలు చెప్పి రాజ్ అక్కడి నుంచి వచ్చేస్తాడు. మరోవైపు ఇంట్లో అందరూ హ్యాపీగా పాటలు పెట్టుకుని డాన్సులు చేస్తుంటే.. పైకి వెళ్లిన రుద్రాణి బాధపడుతుంది. ఇక నేను వీళ్లను ఏమీ చేయలేనా..? అనుకుంటూ ఇరిటేట్‌గా ఫీలవుతుంది. అనామికకు ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్నది వినిపిస్తుందా..? నీకు అని అడుగుతుంది. ఆ దరిద్రాన్ని నేను సినిమా చూసినట్టు చూడాల్సి వచ్చింది. ఇందుకేనా నేను ఇక్కడ ఉన్నది అంటుంది. ఎందుకు అలా ఆవేశపడతారు. ఆవేశపడితే పనులు జరగవు. వేటాడాలి అంటే పులి మాటు వేయాల్సిందే అంటుంది అనామిక.
ఇలాంటి కబుర్లతోనే కాలక్షేపం చేస్తున్నావు. కానీ చేసింది ఏమీ లేదు. ఎవరో వస్తారని ఏమో చేస్తారని ఎదురుచూడకు అని ఎవరో అన్నారట అలాగే ఉంది ఇక్కడ. అదిగో పులి.. ఇదిగో పులి అంటూ అన్ని లాస్ట్‌కు ఫెయిల్ చేస్తున్నావు. అయినా ఆ ముసలోడు బ్యాంకులో వందకోట్లకు ష్యూరిటీ పెట్టిన విషయం నాకెందుకు చెప్పలేదు. అసలు పగ తీర్చుకునే వాళ్ల లక్షణం ఇదేనా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. ఏం చేస్తున్నానో.. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అదే కసితో ఉన్నాను. అంతకుమించిన ప్లాన్‌తో రాబోతున్నాను.. చూస్తూ ఉండండి ఈ సారి ఆ ఇంట్లో కురుక్షేత్రమే కాదు లంకా దహనమే జరుగుతుంది. రేపు ప్రపంచం అంతా సూర్యుడు ఉదయిస్తాడు. ఆ ఇంట్లో మాత్రం చీకట్లు అలుముకుంటాయి అని అనామిక చెప్పగానే అదేంటో ముందే చెప్పొచ్చు కదా అని రుద్రాణి అడిగితే లైవ్‌లో చూద్దురేలే ఆంటీ ఫోన్ కట్ చేస్తుంది అనామిక.
అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటుండగా.. రాజ్ మాత్రం రాత్రి ఫ్యాక్టరీ తగులబెట్టేందుకు వచ్చిందెవరు..? అని ఆలోచిస్తుంటాడు. ఇంతలో కావ్య కాఫీ తీసుకొచ్చి ఇవ్వబోతే వద్దని అంటాడు. రాత్రి బయటకు వెళ్లొచ్చిన్నప్పటి నుంచి అలా ఉన్నారేంటి అని కావ్య అడుగుతుంది. దీంతో రాజ్ కోపంగా నీతో చెప్తే ఏం చేస్తావు.. ప్రశాంతంగా ఉండనివ్వవా..? నన్ను కాసేపు వదిలేయ్ అని అరుస్తాడు. అరేయ్ ఇప్పుడు కావ్య ఏమందని.. నీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పకు కానీ అలా అరుస్తావేంటి అంటుంది అపర్ణ. రుద్రాణి కూడా ఏంటి రాజ్ పొద్దున్నుంచి అందరి మీద ఇలాగే అరుస్తున్నావు. ఏదైనా చేయకూడని పని చేశావా ఏంటి..? అని అడగ్గానే.. రాజ్ కోపంగా అత్తా నువ్వు నీకు సంబంధం లేని దాట్లో అనవసరంగా దూరుతున్నావు నీ లిమిట్ లో ఉండు అంటాడు ఇంతలో అప్పు యూనిఫామ్ లో పోలీసులతో ఇంటికి వస్తుంది.
అప్పు ఏంటే పోలీసులతో ఇంటికి వచ్చావు అని కావ్య అడుగుతుంది. దీంతో రాత్రి నుంచి అనామికకు కాబోయే భర్త సామంత్ కనిపించడం లేదని అనామిక కంప్లైంట్ ఇచ్చింది. ఇల్లు సోదా చేయాలని సర్చ్ వారెంట్ తీసుకుని వచ్చాను అని అప్పు చెప్పగానే అందరూ షాక్ అవుతారు. ధాన్యలక్ష్మీ కోపంగా ఏంటి ఇల్లు సోదా చేస్తావా..? ఇది ఎవరి ఇల్లో తెలుసు కదా..? ఎంత పోలీస్ అయితే తన మన అనే తేడా లేదా..? అంటుంది. సామంత్ తప్పిపోతే నాకేంటి సంబంధం అంటాడు రాజ్. ఇంతలో అక్కడికి వచ్చిన అనామిక నీకే సంబంధం ఉంది. నంద విషయంలో సామంత్‌ను కొట్టావు. చంపేస్తానని వార్నింగ్ ఇచ్చావు అందుకే నువ్వే ఏదో చేసి ఉంటావని నా అనుమానం అంటుంది.
సీతారామయ్య ఒప్పుకోవడంతో అప్పు పోలీసుల చేత సోదాలు చేయిస్తుంది. మొత్తం సోదాలు చేసిన పోలీసులకు రాజ్ కారులో సామంత్ శవం కనిపిస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. అనామిక ఏడుస్తుంది. రాజ్‌ను తిడుతుంది. ఎంత పని చేశావు దుర్మార్గుడా అంటూ రాజ్ గల్లా పట్టుకుంటుంది. తన మాటలతో అందరినీ నిలదీస్తుంది. దుగ్గిరాల కుటుంబం గొప్పది అంటారు. మీ వారసుడు ఒక ప్రాణం తీసేశాడు. ఇప్పుడు నేనెలా బతకాలి అంటూ రోదిస్తుంది. ఇంతలో మీడియా వాళ్లు రావడంతో మీడిమా ముందు అనామిక.. సామంత్‌ను రాజ్ చంపేశాడని చెప్తుంది. కావ్య ఏడుస్తూ అబద్దం ఈ అనామిక కావాలనే ఇదంతా చేస్తుంది అని చెప్పగానే.. రాజ్ కూడా నాకేం తప్పు తెలియదు.. నన్ను కావాలనే ఎవరో ఈ మర్డర్ కేసులో ఇరికించారు అంటాడు. ఇంతలో అప్పు రాజ్‌ను అరెస్ట్ చేయబోతుంటే అందరూ ఏడుస్తారు. అడ్డు పడతారు. సుభాష్ మాత్రం ఎవరూ అడ్డుపడకండి అప్పు డ్యూటీ అప్పును చేయనివ్వండి అని చెప్తాడు. అప్పు, రాజ్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?