Kota Srinivas : టాలీవుడ్ స్టార్ కమెడియన్, విలన్ ఎన్నో వందల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు కోటా శ్రీనివాస్ రావు (Kota SrinivasRao) .. ప్రస్తుతం సినిమాలకు దూరంగా.. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. వయస్సు మీద పడటంతో ఆయన ఇంటికే పరిమితం అయ్యారు.. ఇప్పటికి నేను నటిస్తానంటున్నారు.. అవకాశం ఇస్తే చాలు ఊపిరి ఉన్నంత వరకూ నటిస్తానంటున్నాడు కోటా.. నటన అంటే ఆయనకు ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే.. నటనను అంతలా ప్రేమిస్తారు కోటా శ్రీనివాసరావు.. ఎంత గొప్ప నటుడు అయిన ఆయన అందరిని సమానంగా ఉంటారు. అందరిని తన సొంత మనుషుల్లాగా చూసుకుంటారు.. అయితే ఈయనకు ఓ సందర్బంలో దారుణంగా అవమానం జరిగిందని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. ఆ విషయం పై కోటా ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
Also Read : బాయ్ ఫ్రెండ్ తో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన యానిమల్ బ్యూటీ..
సినిమాల పరంగా మంచి సక్సెస్ ను సాధించిన కోటా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో సినిమాల గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. అలాగే సినిమాల్లో అవకాశాల కోసం ఆయన ఎదుర్కొన్న కష్టాల గురించి వివరించారు. అయితే షూటింగ్ టైంలో సెట్ లో ఎలా ఉంటారు అన్న విషయం గురించి ఆయన చెప్పారు. అదేవిధంగా తన కో ఆర్టిస్టులతో కోట శ్రీనివాసరావు ఎలా ఉంటారు అన్న విషయాలని అందరితో పంచుకున్నారు. మొన్న ఓ ఇంటర్వ్యూలో బాబు మోహన్ కూడా తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటే కోటాని చెప్పారు. ఇక షూటింగ్ సమయంలో సెట్ లో ఎలా ఉంటారు అన్న విషయాల గురించి వివరించిన ఆయన తనను చిరంజీవి అరిచిన విషయం గురించి బయట పెట్టారు..
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఓసారి ఓ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సినిమా ఆగిపోయింది.. షూటింగ్ ఇప్పుడు లేదని క్యాన్సిల్ చేశారు. అయితే ఇక చేసే పనిలేక ఎమ్ ఎస్ నారాయణ నేను బయటికి వెళ్లి అలా బార్లో కూర్చుని మందు తాగి వచ్చాం.. మంచి పనిలో ఉన్నప్పుడు షూటింగ్ నుంచి ఫోన్ వచ్చింది. ఇక వెంటనే ఉరుక్కుంటూ అక్కడ నుంచి షూటింగ్ లోకేషన్ కి వెళ్ళాము అయితే అక్కడ మమ్మల్ని చూసి అందరూ షాక్ అయ్యారు. మేము చూడ్డానికి ఊగిపోతు కనిపిస్తున్నాం. దాంతో ఆ లొకేషన్ సెట్ లో మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi) కూడా ఉన్నారు. అయితే మేమిద్దరం కలిసి సినిమా చేయలేదు కానీ అక్కడ నన్ను అలా చూసి ఆయన ఓర్వలేకపోయాడు. మీలాంటి గొప్ప నటులు ఇలా చేస్తే మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసి ఏమనుకుంటారండి అని అక్కడి నుంచి వెళ్ళిపొమ్మని చెప్పాడు. ఆ విషయం ఆ మంచికే చెప్పారు మా మంచికే చెప్పారని మేము అనుకున్నాం. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకి చిరంజీవి కోట శ్రీనివాసరావుని దారుణంగా అవమానించారంటూ కొన్ని వార్తలు వచ్చాయని ఆయన అన్నారు. మా మధ్య ఎప్పుడూ మంచి సాహిత్యం ఉండేది కానీ ఇలా గొడవలు అలాంటివి మాకు తెలియదు ఇండస్ట్రీలో ఇప్పటివరకు నేను ఎవరితో గొడవ పడినట్టు వార్తలు కూడా రాలేదు అని కోటా శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇంటర్వ్యూ వీడియో వైరల్అవుతుంది..
ఇక ఈమధ్య ఈయన వయసు మీద పడటంతో సినిమాలు చేయడం లేదని తెలుస్తుంది. అయితే చిరంజీవి మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం విశ్వంభరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు..