Brahmamudi serial today Episode: స్వప్న సీమంతం గ్రాండ్‌గా చేస్తానంటుంది రుద్రాణి వచ్చిన వాళ్లదరికీ మృష్ణాన్నభోజనం పెట్టించాలని వాళ్లందరికీ రిటర్న్ గిఫ్ట్ కింద వెండి భరిణే ఇవ్వాలని చెప్తుంది. దీంతో స్వప్న ఆశ్చర్యంగా అంత గ్రాండ్‌గా నా సీమంతం జరుగుతుందా..? అని అడుగుతుంది. చూడు స్వప్న ఏదైనా దుష్ట శక్తి అడ్డుపడుతుంది అనుకుంటున్నావా..? లేక నీ చెల్లెలు సింపుల్ గా చేద్దామని అంటుందా..? ఏం కావ్య నువ్వు ఏం మాట్లాడవేంటి అని అడుగుతుంది రుద్రాణి.
మా అక్క సీమంతం అంటే నాకు కూడా సంతోషమే కదా రుద్రాణి గారు మీ ఇష్టం ఎలాగైనా జరరిపించండి అని చెప్పి వెళ్లిపోతుంది. రాహుల్ మెల్లగా ఏం టి మమ్మీ ఇలా జరిగింది అని అడుగుతాడు. అన్ని మన మంచికేరా.. ముఖం అలా పెట్టకుండా నవ్వుతూ ఉండు అంటుంది రుద్రాణి. కావ్యను రూంలోకి తీసుకెళ్లి రాజ్ డోర్ వేస్తాడు. మూడు కంటికి తెలియకుండా ఉండటానికి తలుపు మూస్తున్నారా..? అంటుంది కావ్య. కాదు మూడో చెవికి వినబడకుండా వేస్తున్నాను కానీ రా.. నీకేమైనా పిచ్చా.. మా అత్తయ్య అడిగిన దానికి తలూపావు ఏంటి.
మన శక్తికి మించిన ఖర్చు ఎలా పెట్టగలం.. అని రాజ్ అడగ్గానే.. మీ అత్తయ్యా ప్లాన్ మీకు అర్థం కాలేదా..? అందరి ముందు నన్ను బ్యాడ్ చేయాలని ప్లాన్ చేసింది. అందుకని 20 లక్షలు అవ్వొచ్చు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు. అలాగని ఏదో ఒకటి చేసి అంత డబ్బు ఇస్తే మా పిన్ని ఫీలవుతుంది అంటూ రాజ్ చెప్పగానే.. ఆవిడకు అంత చాన్స్ ఇవ్వనులేండి.. కానీ సీమంతం గ్రాండ్‌గా కాదు సింపుల్‌గా జరుగుతుంది అని కావ్య చెప్పగానే.. ఏంటో నీ ప్లాన్ రివర్స్ అయ్యి అందరూ నీ మీద దండెత్తితే నేను మాత్రం ఏమీ మాట్లాడలేను.. నన్ను మాత్రం అర్థం చేసుకో ఈ విషయంలో అంటూ వెళ్లిపోతాడు రాజ్.
ధాన్యలక్ష్మీ ఆలోచిస్తుంటే.. రుద్రాణి వెళ్లి చూశావా ధాన్యలక్ష్మీ దానికి ఎంత షాక్ ఇచ్చానో.. అంటుంది. షాక్ దానికే కాదు.. మాకు ఇచ్చావు. అంటూ సడెన్ గా నీ కోడలి మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో.. అంటూ నిలదీస్తుంది. సారీ ధాన్యలక్ష్మీ ఒకసారి నువ్వే ఆలోచించు.. నేను ఇదంతా చేస్తుంది. నా కోడలి మీద ప్రేమతోనో.. ఈ ఇంట్లో పండగ వాతావరణం కోసమో కాదు.
ఆ కావ్య ఇంట్లో అందరికీ ఒక న్యాయం తన అక్కకు ఒక న్యాయమా..? అంటూ మనం రివర్స్ లో మాట్లాడాలి అని చెప్తుంది. నువ్వన్నది కరెక్టే.. కానీ కావ్య నీకన్నా తెలివైనది. సీమంతం సింపుల్ గా చేయాలని అంటే.. అవును అప్పుడు కూడా సొంత అక్క సీమంతం చేయడానికి డబ్బులు పెట్టని షెల్పీస్ కావ్య అంటూ అబాండాలు వేసి వీలైనంత త్వరగా కావ్య చేతిలో పగ్గాలు లాగేసుకుందాం అంటుంది రుద్రాణి. సరే నాకు న్యాయం చేస్తానంటున్నావు కదా ఓకే అంటుంది ధాన్యలక్ష్మీ.
రైటర్ లక్ష్మీకాంతం, కళ్యాణ్‌కు ఫోన్ చేసి అవకాశం కావాలని వెంటపడ్డావు.. అవకాశం ఇచ్చాక ఇలా ప్రవర్తిస్తున్నావా..? అంటూ తిడుతుంటాడు. దీంతో లేదు సార్ మా తాతయ్య గారు కోమాలో ఉన్నారు.. అందుకని ఆయన దగ్గరే ఉన్నాను. అని చెప్పగానే.. మీ తాతయ్య దగ్గర ఉంటూ నాకు రాస్తానన్న పాట రాయకుండా నన్ను వేధిస్తున్నావా..? అంటూ తిడతాడు. సారీ సార్ తప్పు నాదే ఇవాళ పాట కంప్లీట్ చేసి ఇస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసి పాట ఎలా మొదలుపెట్టాలి అనుకుంటూ.. అప్పును గుర్తు చేసుకుని పొట్టి నువ్వు దూరంగా ఉంటున్న ఈ క్షణాలనే పాటగా రాస్తాను అనుకుంటాడు కళ్యాణ్.
గుండె దడగా ఉందేంటి.. కుడి కన్ను కూడా అదురుతుందేంటి అని కనకం కంగారు పడుతుంటే.. కావ్య వస్తుంది. కావ్యను చూసిన కనకం మరింత టెన్షన్‌గా తూలి కిందపడబోతుంటే కావ్య వచ్చి పట్టుకుంటుంది. అమ్మా నేనే కావ్యను అంటుంది. అవును కావ్యవే కాబట్టి ఈ కంగారు అంటుంది. ఆడపిల్ల తల్లికి షుగరు, బీపీ ఊరికే వస్తాయా..? అంటుంది కనకం. దీంతో అమ్మా నేను శుభవార్త గురించి చెప్పడానికి వచ్చాను అని చెప్పగానే.. ఏంటది అని కనకం అడుగుతుంది.
స్వప్న అక్కకు సీమంతం చేయాలని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు. అని చెప్పగానే.. కనకం హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో కావ్య సీమంతం అక్కడ కాకుండా ఇక్కడ చేయాలని నువ్వు ఇంటికి వచ్చి అందరికీ చెప్పి ఒప్పించమని అడుగుతుంది. ఏదైనా దాస్తున్నావా..? కావ్య అని కనకం అడగ్గానే.. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడైతే నేను చెప్పినట్టు చేయాలి అంటుంది. సరే అంటుంది కనకం. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?